Nandyal District MLA List 2024 ( Latest Update ) | నంద్యాల జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

Nandyal District MLA List 2024 : 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో గెలుపొందిన నంద్యాల జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితాను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Table of Contents

Nandyal District MLA List 2024

2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో గెలిచిన నంద్యాల జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ, ప్రస్తుతానికి కూడా తమ పదవుల్లో కొనసాగుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో గెలుపొందిన నంద్యాల జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల పేర్లు, ఎమ్మెల్యేల పేర్లు మరియు పార్టీ పేర్లను ఇక్కడ చూడండి.

.

S.NO.MLA NAMEConstituencyParty Name
1Bhuma Akhila PriyaAllagaddaTDP
2N.M.D. FarooqNandyalTDP
3Gowru Charitha ReddyPanyamTDP
4Budda Rajasekhar ReddySrisailamTDP
5Githa JayasuryaNandikotkurTDP
6B.C. Janardhan ReddyBanaganapalleTDP
7Kotla Jayasurya Prakash ReddyDhoneTDP

Source: ఈ పట్టికలోని వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా సేకరించబడినవి.

Allagadda MLA 2024 | పూర్తి జాబితా

Allagadda MLA 2024 Bhuma Akhila Priya
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే 2024 భూమా అఖిల ప్రియ | Allagadda MLA 2024 Bhuma Akhila Priya (Source: Facebook)

ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గారిది రాజకీయ నేపథ్యం గల కుటుంబం. ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి గారు సీనియర్ నాయకులు మరియు తల్లి భూమా శోభా నాగిరెడ్డి గారు సీనియర్ నాయకురాలు.

ఆళ్లగడ్డ నియోజకవర్గం రాజకీయాల్లో భూమా శోభానాగిరెడ్డి గారికి మంచి పట్టు ఉన్న నాయకురాలు. అలాగే భూమా నాగిరెడ్డి గారు అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు.

2014 సంవత్సరంలో ఆమె తల్లి భూమా శోభానాగిరెడ్డి గారి మరణించారు. ఆ తర్వాత అఖిల ప్రియ గారు ఉప ఎన్నికల్లో వైకాపా పార్టీ తరపున పోటీ చేసి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికయింది. ఆమెకు ప్రత్యర్థి అభ్యర్థిగా ఎవరు నామినేషన్ వేయలేదు. పోటీ లేకపోయేసరికి ఆమె గెలిచినట్టు ప్రకటించారు.

ఆ తర్వాత వైకాపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు గారి మంత్రివర్గంలో 2017 నుంచి 2019 మధ్య కాలంలో ఆమె పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

అనంతరం 2019 శాసనసభ ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన గంగుల బ్రిజేంద్ర రెడ్డి చేతిలో 35,613 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

ఆ తర్వాత 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఆళ్లగడ్డ నియోజకవర్గానికి గాను ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన బ్రిజేంద్ర రెడ్డి పైన 12,037 ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయింది.

భూమా అఖిల ప్రియ గారు మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అందులో రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఒకసారి వైకాపా పార్టీ తరపున గెలిచారు. ఒకసారి తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు.

Nandyal MLA 2024 | పూర్తి జాబితా

Nandyal MLA 2024 Nasyam Mohammed Farooq
నంద్యాల ఎమ్మెల్యే 2024 నాస్యం మహమ్మద్ ఫరూఖ్| Nandyal MLA 2024 Nasyam Mohammed Farooq (Source: Facebook)

నంద్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే నాస్యం మహమ్మద్ ఫరూఖ్ టిడిపి పార్టీ సీనియర్ నేత. ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 1985 ఎన్నికలలో టిడిపి పార్టీ ఆయనకు నంద్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

1985 ఎన్నికలలో నంద్యాల నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్థసారథి రెడ్డి పైన 8,447 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

అనంతరం 1989 శాసనసభ ఎన్నికలలో నంద్యాల నియోజకవర్గంలో నుంచి టిడిపి పార్టీ తరపున వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన రామనాథ్ రెడ్డి చేతిలో 7212 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.

1994 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున నంద్యాల నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన మక్బూల్ హుస్సేన్ పైన 39,813 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

1999 శాసనసభ ఎన్నికలలో టిడిపి పార్టీ తరపున నంద్యాల నియోజకవర్గం నుంచి నాలుగో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్పీవై రెడ్డి పైన 3,825 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2004 శాసనసభ ఎన్నికలలో నంద్యాల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఐదో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన శిల్పా మోహన్ రెడ్డి చేతిలో 48,677 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.

2009 ఎన్నికలలో ఆయనకు టిడిపి పార్టీ నంద్యాల లోక్ సభ నియోజకవర్గం ఎంపీ టికెట్ ఇచ్చింది. 2009 ఎన్నికల్లో నంద్యాల లోక్ సభ నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ తరపున మొదటిసారి ఎంపీగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్పీవై రెడ్డి చేతిలో 90,847 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

ఆ తర్వాత 2014 ఎన్నికల్లో నంద్యాల లోక్ సభ నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున రెండోసారి ఎంపీగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన ఎస్పీవై రెడ్డి చేతిలో 105,766 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.

మళ్లీ 2024 శాసనసభ ఎన్నికలలో నంద్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఆరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన రవిచంద్ర కిశోర్ రెడ్డి పైన 12,333 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఫరూఖ్ గారు తెలుగుదేశం పార్టీ తరపున నంద్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మిగతా రెండు సార్లు ఓడిపోయారు. ఎంపీగా రెండుసార్లు పోటీ చేస్తే, రెండుసార్లు ఓడిపోయారు.

అంతేకాకుండా ఆయన పలుసార్లు మంత్రిగాను, శాసనసభ డిప్యూటీ స్పీకర్ గాను, శాసనమండలి చైర్మన్ గాను బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతానికి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Panyam MLA 2024 | పూర్తి జాబితా

Panyam MLA 2024 Gowru Charitha Reddy
పాణ్యం ఎమ్మెల్యే 2024 గౌరు చరిత రెడ్డి | Panyam MLA 2024 Gowru Charitha Reddy (Source: Facebook)

పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2004 సంవత్సరంలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2004 శాసనసభ ఎన్నికలలో నందికొట్కూరు శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పైన 13,488 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించింది.

2009 శాసనసభ ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. 2014 సంవత్సరంలో ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 శాసనసభ ఎన్నికల్లో ఆమెకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

West Godavari District MLA List 2024
West Godavari District MLA List 2024 (Latest Update ) | పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

2014 శాసనసభ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పాణ్యం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి కాటసాని రామ భూపాల్ రెడ్డి పైన 11,647 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టింది.

2019 సంవత్సరంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరింది. 2019 శాసనసభ ఎన్నికలలో పాణ్యం శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన కాటసాని రామ భూపాల్ రెడ్డి చేతిలో 43,857 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

అలాగే 2024 శాసనసభ ఎన్నికలలో టిడిపి పార్టీ తరపున మళ్ళీ పాణ్యం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన కాటసాని రామ భూపాల్ రెడ్డి పైన 40,591 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయింది.

గౌరు చరిత రెడ్డి గారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, మూడుసార్లు విజయం సాధించారు. ఒకసారి పరాజయం పాలయ్యారు. అందులో కాంగ్రెస్ పార్టీలో ఒకసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకసారి మరియు టిడిపి పార్టీలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

పాణ్యం నియోజకవర్గం రాజకీయ చరిత్రలో ఏకైక మహిళా ఎమ్మెల్యేగా గెలిచిన గౌరు చరిత రెడ్డి గారు రికార్డు సృష్టించారు.

Srisailam MLA 2024 | పూర్తి జాబితా

Srisailam MLA 2024 Budda Rajasekhar Reddy
శ్రీశైలం ఎమ్మెల్యే 2024 బుడ్డా రాజశేఖర్ రెడ్డి | Srisailam MLA 2024 Budda Rajasekhar Reddy (Source: Facebook)

శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల్లో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2009 శాసనసభ ఎన్నికలలో శ్రీశైలం శాసనసభ నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏరాసు ప్రతాపరెడ్డి చేతిలో 4,307 తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు.

2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 శాసనసభ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీశైలం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి టిడిపి పార్టీకి చెందిన శిల్ప చక్రపాణి రెడ్డి పైన 4,861 ఓట్ల మెజార్టీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున శ్రీశైలం నియోజకవర్గానికి గాను ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన శిల్పా చక్రపాణి రెడ్డి చేతిలో 38,698 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.

ఆ తర్వాత 2024 శాసనసభ ఎన్నికలలో మళ్లీ శ్రీశైలం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన శిల్పా చక్రపాణి రెడ్డి పైన 6,385 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, అందులో రెండుసార్లు విజయం సాధించారు. రెండుసార్లు ఓటమి పాలయ్యారు. ఒకసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. ఒకసారి తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు.

Nandikotkur MLA 2024 | పూర్తి జాబితా

Nandikotkur MLA 2024 Githa Jayasurya
నందికొట్కూరు ఎమ్మెల్యే 2024 గిత్త జయసూర్య | Nandikotkur MLA 2024 Githa Jayasurya (Source: Facebook)

నందికొట్కూరు శాసనసభ నియోజకవర్గం ఎస్సీ క్యాస్ట్ రిజర్వుడు నియోజకవర్గం. నందికొట్కూరు నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు.

2024 ఎన్నికల్లో ఆయనకు టిడిపి పార్టీ నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. 2024 శాసనసభ ఎన్నికలలో నందికొట్కూరు శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన సుధీర్ పైన 9,792 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

జయసూర్య గారు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చారు. నందికొట్కూరు నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.

Banaganapalle MLA 2024 | పూర్తి జాబితా

Banaganapalle MLA 2024 BC Janardhan Reddy
బనగానపల్లె ఎమ్మెల్యే 2024 బిసి జనార్దన్ రెడ్డి | Banaganapalle MLA 2024 BC Janardhan Reddy (Source: Facebook)

బనగానపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆయన ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చారు. 2014 ఎన్నికల్లో ఆయనకు టిడిపి పార్టీ బనగానపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2014 శాసనసభ ఎన్నికల్లో బనగానపల్లె శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన కాటసాని రామిరెడ్డి పైన 17,341 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.

ఆ తర్వాత 2019 శాసనసభ ఎన్నికలలో టిడిపి పార్టీ తరపున బనగానపల్లె నియోజకవర్గానికి గాను వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన కాటసాని రామిరెడ్డి చేతిలో 13,384 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.

2024 శాసనసభ ఎన్నికలలో బనగానపల్లె నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ తరపున మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన కాటసాని రామిరెడ్డి పైన 25,566 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

బీసీ జనార్దన్ రెడ్డి గారు బనగానపల్లె నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, అందులో రెండుసార్లు విజయం సాధించారు. ఒకసారి ఓటమి పాలయ్యారు.

బనగానపల్లె నియోజకవర్గం చరిత్రలో జనార్దన్ రెడ్డి గారు ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే బనగానపల్లె నియోజకవర్గంలో 25,566 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.

ప్రస్తుతానికి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Dhone MLA 2024 | పూర్తి జాబితా

Dhone MLA 2024 Kotla Jayasurya Prakash Reddy
డోన్ ఎమ్మెల్యే 2024 కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి | Dhone MLA 2024 Kotla Jayasurya Prakash Reddy (Source: Facebook)

కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి గారిది రాజకీయ నేపథ్యం గల కుటుంబం. ఆయన తండ్రి కోట్ల విజయభాస్కరరెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తండ్రిగారి స్ఫూర్తితో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.

ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు. 2004 ఎన్నికలలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గం ఎంపీ టికెట్ ఇచ్చింది.

2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున కర్నూల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎంపీగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన కేఇ కృష్ణమూర్తి పైన 101,098 ఓట్ల మెజారిటీతో మొదటిసారి ఎంపీగా విజయం సాధించారు.

అనంతరం 2009 ఎన్నికలలో కర్నూల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున వరుసగా రెండోసారి ఎంపీగా పోటీ చేసి తన ప్రత్యర్థి టిడిపి పార్టీకి చెందిన బిటి నాయుడు పైన 74,079 ఓట్ల మెజారిటీతో వరుసగా రెండోసారి ఎంపీగా విజయం సాధించారు.

ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మళ్లీ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గానికి గాను కాంగ్రెస్ పార్టీ తరపున ముచ్చటగా మూడోసారి ఎంపీగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన బుట్టా రేణుక చేతిలో 3,56,179 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.

East Godavari District MLA List 2024
East Godavari District MLA List 2024 | తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున కర్నూలు లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన సంజీవ్ కుమార్ చేతిలో 1,48,889 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

2024 ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ డోర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. 2024 శాసనసభ ఎన్నికలలో డోన్ శాసనసభ నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పైన 6,049 ఓట్ల మెజారిటీతో మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు నాలుగు సార్లు ఎంపీగా పోటీ చేస్తే, అందులో రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. రెండుసార్లు ఓటమి పాలయ్యారు. డోన్ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.

Comparison Table 2024

ConstituencyWinnerRunnerMargin
AllagaddaBhuma Akhila PriyaGangula Brijendra Reddy12,037
NandyalN.M.D. FarooqS. Ravichandra Kishore Reddy12,333
PanyamGowru Charitha ReddyKatasani Ramabhupal Reddy40,591
SrisailamBudda Rajasekhar ReddySilpa Chakrapani Reddy6,385
NandikotkurGitha JayasuryaDr. Dara Sudheer9,792
BanaganapalleB.C. Janardhan ReddyKatasani Rami Reddy25,566
DhoneKotla Jayasurya Prakasha ReddyBuggana Rajendranath Reddy6,049

ఆధారాలు (Source): పై పట్టికలోని అభ్యర్థుల మెజారిటీలు మరియు ఎన్నికల ఫలితాల వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా ఇవ్వబడినవి.

Previous Election Comparison ( 2019 VS 2024 )

2019 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో భాగంగా నంద్యాల జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేక పోయింది.

2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో నంద్యాల జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం ఏడు నియోజకవర్గాల్లోనూ టిడిపి పార్టీ కైవసం చేసుకుంది. వైకాపా పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేక పోయింది.

Alliance Impact 2024

2024 శాసనసభ ఎన్నికలలో టిడిపి జనసేన మరియు బిజెపి పార్టీలు ఎన్డీయే కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేసి ఫలితాలపై ప్రభావం చూపాయి. అందువలన నంద్యాల జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎన్డీయే కూటమి ప్రభావం నంద్యాల జిల్లాలో స్పష్టంగా కనిపించింది.

అంతేకాకుండా ఎన్నికల ఫలితాల్లో నంద్యాల జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రభావం మరియు ఓటర్లు ప్రభావం కూడా కీలకంగా మారాయి.

ముగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో నంద్యాల జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసి సంచలనం సృష్టించింది. వైకాపా పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కలేదు.

ముఖ్య గమనిక (Disclaimer & Credits) :

సమాచార సేకరణ : ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం మరియు ఫోటోలు కేవలం పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మరియు విద్యా ప్రయోజనాల (Informational and Educational Purposes) కోసం మాత్రమే సేకరించబడినవి.

ఫోటో సౌజన్యం : ఇందులో ఉపయోగించిన చిత్రాలు సంబంధిత ఎమ్మెల్యేల అధికారిక Facebook/Social Media ఖాతాల నుండి సేకరించబడినవి. వీటిపై పూర్తి హక్కులు ఆయా వ్యక్తులకు మాత్రమే ఉంటాయి.

మా ఉద్దేశ్యం : ఎటువంటి కాపీరైట్ నియమాలను ఉల్లంఘించడం మా ఉద్దేశ్యం కాదు. కేవలం పాఠకులకు లేటెస్ట్ సమాచారాన్ని అందించడమే UU News లక్ష్యం.

తరచుగా అడిగే ప్రశ్నలు

నంద్యాల జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి?

నంద్యాల జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి.

నంద్యాల జిల్లాలో ఎన్డీయే కూటమి ఎన్ని నియోజకవర్గాల్లో గెలిచింది 2024?

నంద్యాల జిల్లాలో ఎన్డీయే కూటమి అన్ని నియోజకవర్గాల్లో గెలిచి క్లీన్ స్వీప్ చేసింది.

నంద్యాల జిల్లాలో వైకాపా పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో గెలిచింది 2024?

నంద్యాల జిల్లాలో వైకాపా పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు.

ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

భూమా అఖిల ప్రియ ( టిడిపి పార్టీ )

నంద్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

నాస్యం మహమ్మద్ ఫరూఖ్ ( టిడిపి పార్టీ )

పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

గౌరు చరిత రెడ్డి ( టిడిపి పార్టీ )

శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

బుడ్డా రాజశేఖర్ రెడ్డి ( టిడిపి పార్టీ )

నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

గిత్త జయసూర్య ( టిడిపి పార్టీ )

బనగానపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

బిసి జనార్దన్ రెడ్డి (టిడిపి పార్టీ )

డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ( టిడిపి పార్టీ )

Leave a Comment