Kadapa District MLA List 2024 : 2024 లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో గెలుపొందిన కడప జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితాను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Kadapa District MLA List 2024
2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలిచిన కడప జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ, ప్రస్తుతానికి కూడా తమ పదవుల్లో కొనసాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో మొత్తం ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో గెలుపొందిన కడప జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేల పేర్లు, నియోజకవర్గాల పేర్లు మరియు పార్టీ పేర్లను ఇక్కడ చూడండి.
| S.NO. | MLA Name | Constituency | Party |
| 1 | C.Adinarayana Reddy | Jammalamadugu | BJP |
| 2 | Varada Rajula Reddy | Proddatur | TDP |
| 3 | Putta Sudhakar Yadav | Mydukur | TDP |
| 4 | Dasari Sudha | Badvel | YSRCP |
| 5 | Reddeppagari Madhavi Reddy | Kadapa | TDP |
| 6 | Y. S. Jagan Mohan Reddy | Pulivendula | YSRCP |
| 7 | Putha Krishna Chaitanya Reddy | Kamalapuram | TDP |
| 8 | Akepati Amarnath Reddy | Rajampet | YSRCP |
Source: ఈ పట్టికలోని వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా సేకరించబడినవి.
Jammalamadugu MLA 2024 | పూర్తి జాబితా

జమ్మలమడుగు ఎమ్మెల్యే చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2004 శాసనసభ ఎన్నికలలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ జమ్మలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2004 శాసనసభ ఎన్నికలలో జమ్మలమడుగు నియోజకవర్గానికి గాను కాంగ్రెస్ పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి టిడిపి పార్టీకి చెందిన రామసుబ్బారెడ్డి పైన 22,693 ఓట్ల మెజారిటీతో మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఆ తర్వాత 2009 శాసనసభ ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున వరుసగా రెండో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి టిడిపి పార్టీకి చెందిన రామసుబ్బారెడ్డి పైన 7,384 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2014 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ వీడి వైకాపా పార్టీలో చేరారు. 2014 శాసనసభ ఎన్నికలలో వైకాపా పార్టీ తరపున ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి టిడిపి పార్టీకి చెందిన రామసుబ్బారెడ్డి పైన 12,167 ఓట్ల మెజారిటీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2017 సంవత్సరంలో ఆయన వైకాపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ హయాంలో 2017 నుంచి 2019 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
2019 ఎన్నికల్లో ఆయనకు టిడిపి పార్టీ కడప లోక్ సభ నియోజకవర్గం ఎంపీ టికెట్ ఇచ్చింది. 2019 ఎన్నికల్లో కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ తరపున మొదటిసారి ఎంపీగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన వైయస్ అవినాష్ రెడ్డి చేతిలో 3,80,726 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.
ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీని వీడి బిజెపి పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో టిడిపి జనసేన మరియు బిజెపి పార్టీలు ఎన్డీయే కూటమిగా కలిసి పోటీ చేశారు.
2024 శాసనసభ ఎన్నికలలో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి గారు బిజెపి పార్టీ తరపున జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన మూలే సుధీర్ రెడ్డి పైన 17,191 ఓట్ల మెజారిటీతో గెలిచి నాలుగో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఆదినారాయణ రెడ్డి గారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, నాలుగు సార్లు విజయం సాధించారు. అందులో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. ఒకసారి వైకాపా పార్టీ తరపున గెలిచారు. ఒకసారి బిజెపి పార్టీ తరపున గెలిచారు.
జమ్మలమడుగు నియోజకవర్గంలో 1983 నుంచి 1999 వరకు టిడిపి పార్టీనే వరుసగా గెలుస్తూ వచ్చింది. 2004 ఎన్నికల్లో ఎప్పుడైతే ఆదినారాయణ రెడ్డి గారు వచ్చారో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఆయన జమ్మలమడుగు నియోజకవర్గంలో నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా అరుదైన రికార్డు సృష్టించారు. ఎందుకంటే ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా జమ్మలమడుగు నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవలేదు.
Proddatur MLA 2024 | పూర్తి జాబితా

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు 1983 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు.
1983 శాసనసభ ఎన్నికలలో ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన మల్లెల వెంకట రమణ రెడ్డి చేతిలో 22,552 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.
1985 సంవత్సరంలో ఆయన టిడిపి పార్టీలో చేరారు. 1985 శాసనసభ ఎన్నికలలో టిడిపి పార్టీ తరపున ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి మల్లెల వెంకట రమణ రెడ్డి పైన 7,130 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
1989 సంవత్సరంలో టిడిపి పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రొద్దుటూరు నియోజకవర్గానికి గాను ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన 31,297 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
1994 శాసనసభ ఎన్నికలలో మళ్ళీ ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి టిడిపి పార్టీకి చెందిన కొవ్వూరు రామసుబ్బారెడ్డి పైన 7,607 ఓట్ల మెజారిటీతో మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.
ఆ తర్వాత 1999 శాసనసభ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరపున అదే ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన మల్లెల లింగారెడ్డి పైన 2,135 అతి తక్కువ ఓట్ల మెజారిటీతో నాలుగో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2004 శాసనసభ ఎన్నికలలో మళ్ళీ అదే ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల లింగారెడ్డి పైన 17,029 ఓట్ల మెజారిటీతో ఐదోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2009 శాసనసభ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరపున అదే ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన మల్లెల లింగారెడ్డి చేతిలో 16,156 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.
2014 సంవత్సరం ఆయన టిడిపి పార్టీలో చేరారు. 2014 శాసనసభ ఎన్నికలలో టిడిపి పార్టీ తరపున ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేతిలో 12,945 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. 2024 ఎన్నికలలో టిడిపి పార్టీ ఆయనకు మళ్ళీ ప్రొద్దుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 శాసనసభ ఎన్నికలలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పైన 22,744 ఓట్ల మెజారిటీతో గెలిచి ఆరోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
నంద్యాల వరదరాజుల రెడ్డి గారు ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మూడు సార్లు ఓడిపోయారు. అందులో నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. మిగతా రెండు సార్లు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు.
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అత్యధిక సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా వరదరాజుల రెడ్డి గారు అరుదైన రికార్డు సృష్టించారు.
Mydukur MLA 2024 | పూర్తి జాబితా

మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2014 శాసనసభ ఎన్నికల్లో టిడిపి పార్టీ ఆయనకు మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2014 శాసనసభ ఎన్నికలలో మైదుకూరు నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన శెట్టిపల్లి రఘురామిరెడ్డి చేతిలో 11,522 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.
అనంతరం 2019 శాసనసభ ఎన్నికలలో టిడిపి పార్టీ తరపున మైదుకూరు నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన శెట్టిపల్లి రఘురామిరెడ్డి చేతిలో 29,344 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
2024 శాసనసభ ఎన్నికల్లో మళ్లీ అదే మైదుకూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన శెట్టిపల్లి రఘురామిరెడ్డి పైన 20,950 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
పుట్టా సుధాకర్ యాదవ్ గారు మైదుకూరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అందులో రెండుసార్లు ఓడిపోయారు. మిగతా ఒకసారి గెలిచారు.
Badvel MLA 2024 | పూర్తి జాబితా

బద్వేల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. బద్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే దాసరి సుధ గారు వైకాపా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆమె భర్త గుంతోటి వెంకటసుబ్బయ్య మరణాంతరం రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యింది.
ఆమె భర్త గుంతోటి వెంకటసుబ్బయ్య 2019 శాసనసభ ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన ఓబుళాపురం రాజశేఖర్ పైన 44,734 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
2021 సంవత్సరంలో వెంకటసుబ్బయ్య గారు మరణించడంతో, ఆమె 2021 ఉప ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గం నుంచి వైకాపా పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి బిజెపి పార్టీకి చెందిన పనతాల సురేష్ పైన 90,533 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి అసెంబ్లీకి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయింది.
ఆ తర్వాత 2024 శాసనసభ ఎన్నికలలో వైకాపా పార్టీ తరపున బద్వేల్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి బిజెపి పార్టీకి చెందిన బొజ్జ రోశన్న పైన 18,567 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయింది.
బద్వేల్ నియోజకవర్గం రాజకీయ చరిత్రలోనే 90,533 ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా దాసరి సుధ గారు అరుదైన రికార్డు సృష్టించారు.
Kadapa MLA 2024 | పూర్తి జాబితా

కడప నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2024 శాసనసభ ఎన్నికలలో ఆమెకు టిడిపి పార్టీ కడప నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 శాసనసభ ఎన్నికలలో కడప నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన అంజాద్ భాషా పైన 18,860 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయింది.
కడప నియోజకవర్గం రాజకీయ చరిత్రలో గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యేగా రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారు సంచలన రికార్డు సృష్టించారు.
కడప శాసనసభ నియోజకవర్గంలో 1999 ఎన్నికలు తర్వాత పసుపు జెండా ఎగరలేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మాధవి రెడ్డి గారి గెలుపుతో చాలా సంవత్సరాలు తర్వాత మళ్ళీ పసుపు జెండా రెపరెపలాడింది.
Pulivendula MLA 2024 | పూర్తి జాబితా

పులివెందుల నియోజకవర్గం ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసిపి పార్టీ అధినేత. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2009 ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ కడప లోక్ సభ నియోజకవర్గం ఎంపీ టికెట్ ఇచ్చింది.
2009 ఎన్నికలలో కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మొదటిసారి ఎంపీగా పోటీ చేసి తన ప్రత్యర్థి టిడిపి పార్టీకి చెందిన పాలెం శ్రీకాంత్ రెడ్డి పైన 1,78,846 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎంపీగా విజయం సాధించారు.
2009 ఆయన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఒక పార్టీని పెట్టారు.
2011 ఉప ఎన్నికల్లో కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి వైకాపా పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన రవీంద్ర రెడ్డి పైన 5,45,672 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు.
అంతేకాకుండా కడప లోక్ సభ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 5,45,672 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎంపీగా ఆయన సంచలన రికార్డ్ సృష్టించారు.
2014 శాసనసభ ఎన్నికల్లో ఆయన పులివెందుల నియోజకవర్గం నుంచి వైకాపా పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి టిడిపి పార్టీకి చెందిన ఎస్ వి సతీష్ కుమార్ రెడ్డి పైన 75,243 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఆ తర్వాత 2019 శాసనసభ ఎన్నికలలో మళ్ళీ పులివెందుల నియోజకవర్గానికి గాను వైకాపా పార్టీ తరపున వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి టిడిపి పార్టీకి చెందిన ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి పైన 90,110 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
అంతేకాకుండా 2019 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 2019 శాసనసభ ఎన్నికల్లో వైకాపా పార్టీ 175 నియోజకవర్గాలకు గాను 151 నియోజకవర్గాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది.
2024 శాసనసభ ఎన్నికలలో మళ్లీ పులివెందుల నియోజకవర్గం నుంచి వైకాపా పార్టీ తరపున వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్. రవీంద్రనాథ్ రెడ్డి పైన 61,687 ఓట్ల మెజారిటీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు.
ఆయన 2024 శాసనసభ ఎన్నికల్లో పులివెందుల ఎమ్మెల్యేగా అయితే గెలిచారు. కానీ వైకాపా పార్టీ 2024 ఎన్నికలలో 175 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచింది. వైకాపా పార్టీ చాలా చిత్తుగా ఓడిపోయింది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండుసార్లు ఎంపీగా పోటీ చేస్తే, రెండుసార్లు గెలిచారు. అదేవిధంగా పులివెందుల నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మూడుసార్లు గెలిచారు. అంతేకాకుండా 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.
పులివెందుల నియోజకవర్గం చరిత్రలో 90,110 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రికార్డ్ సృష్టించారు.
Kamalapuram MLA 2024 | పూర్తి జాబితా

కమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆయన తండ్రి పుత్తా నరసింహారెడ్డి గారు టిడిపి పార్టీ సీనియర్ నాయకులు.
పుత్తా నరసింహారెడ్డి గారు కమలాపురం నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ తరపున 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2009,2014 మరియు 2019 ఎన్నికల్లో టిడిపి పార్టీ తరపున వరుసగా మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయారు.
తండ్రి రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ కృష్ణ చైతన్య రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం 2024 శాసనసభ ఎన్నికలలో ఆయనకు టిడిపి పార్టీ కమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 శాసనసభ ఎన్నికలలో కమలాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పైన 25,357 ఓట్ల మెజార్టీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి నాన్నగారు పుత్తా నరసింహారెడ్డి గారు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ కృష్ణ చైతన్య రెడ్డి గారు మొదటిసారి పోటీ చేసి విజయం సాధించారు.
2004 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది. మళ్లీ చాలా సంవత్సరాలు తర్వాత కృష్ణ చైతన్య రెడ్డి గెలుపుతో తెలుగుదేశం పసుపు జెండా రెపరెపలాడింది.
Rajampet MLA 2024 | పూర్తి జాబితా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 2022 సంవత్సరంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజంపేట నియోజకవర్గాన్ని అప్పటి వైసిపి ప్రభుత్వం హయాంలో అన్నమయ్య జిల్లాలో చేర్చారు.
రాజంపేట నియోజకవర్గం ప్రజల కోరిక మేరకు తిరిగి కడప జిల్లాలో చేర్చాలని, ప్రజలు కోరడంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం 2025 డిసెంబర్ లో రాజంపేట నియోజకవర్గాన్ని తిరిగి కడప జిల్లాలో చేర్చారు.
రాజంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2009 ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ రాజంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2009 శాసనసభ ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గానికి గాను కాంగ్రెస్ పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి పైన 12,342 ఓట్ల మెజార్టీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2012 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012 శాసనసభ ఎన్నికలలో వైకాపా పార్టీ తరపున రాజంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన మేడా వెంకట మల్లికార్జున రెడ్డి పైన 38,219 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2014 శాసనసభ ఎన్నికల్లో మళ్లీ రాజంపేట నియోజకవర్గం నుంచి వైకాపా పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన మేడా వెంకట మల్లికార్జున రెడ్డి చేతిలో 11,617 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.
2019 సంవత్సరంలో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. అందుకే ఆయన 2019 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయలేదు.
2024 శాసనసభ ఎన్నికల్లో మళ్లీ అదే రాజంపేట నియోజకవర్గం నుంచి వైకాపా పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి టిడిపి పార్టీకి చెందిన సుగవసి సుబ్రహ్మణ్యం పైన 7,016 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
అమరనాథ రెడ్డి గారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అందులో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. మిగతా రెండుసార్లు వైకాపా పార్టీ తరపున గెలిచారు.
రాజంపేట నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 38,219 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా అమరనాథ రెడ్డి గారు రికార్డు సృష్టించారు.
Comparison Table 2024
| Consistency | Winner | Runner | Margin |
| Jammalamadugu | Adinarayana Reddy | Mule Sudheer Reddy | 17,191 |
| Proddatur | Nandyala Varada Rajulu Reddy | Rachamallu Siva Prasad Reddy | 22,744 |
| Mydukur | Putta Sudhakar Yadav | Settipalli Raghurami Reddy | 20,950 |
| Badvel | Dasari Sudha | Bojja Roshanna | 18,567 |
| Kadapa | Reddeppagari Madhavi Reddy | Amzath Basha Shaik Bepari | 18,860 |
| Pulivendula | Y. S. Jagan Mohan Reddy | M. Ravindranath Reddy | 61,687 |
| Kamalapuram | Putha Krishna Chaitanya Reddy | Pochimareddy Ravindranath Reddy | 25,357 |
| Rajampet | Akepati Amarnath Reddy | Sugavasi Subrahmanyam | 7,016 |
ఆధారాలు (Source): పై పట్టికలోని అభ్యర్థుల మెజారిటీలు మరియు ఎన్నికల ఫలితాల వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా ఇవ్వబడినవి.
Previous Election Comparison ( 2019 VS 2024 )
2019 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో భాగంగా గెలుపొందిన కడప జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లోనూ వైకాపా పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేక పోయింది.
2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన కడప జిల్లాకు సంబంధించిన ఎనిమిది నియోజకవర్గాల్లో వైకాపా పార్టీ మూడు నియోజకవర్గాల్లో గెలిచింది. మిగతా ఐదు నియోజకవర్గాల్లో ఎన్డీయే కూటమి గెలిచింది. అందులో టిడిపి నాలుగు చోట్ల విజయం సాధిస్తే, మిగతా ఒకచోట బిజెపి పార్టీ గెలిచింది.
Alliance Impact 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో ఎన్డీయే కూటమి ప్రభావం గట్టిగానే చూపించింది. టిడిపి, జనసేన మరియు బిజెపి పార్టీలు పొత్తుగా ఏర్పడి ఓట్ల మెజారిటీ పైన ప్రభావం చూపింది.
కడప జిల్లా ఓటర్లు కూడా ఎన్డీయే కూటమి వైపే మొగ్గు చూపారు. అంతేకాకుండా ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రభావం అన్ని అంశాలు కూటమి ఎక్కువ నియోజకవర్గాల్లో గెలిచేలా చేశాయి.
ముగింపు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో కడప జిల్లాకు సంబంధించిన ఎనిమిది నియోజకవర్గాల్లో ఎన్డీయే కూటమి ఐదు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. మిగతా మూడు నియోజకవర్గాల్లో వైకాపా పార్టీ విజయం సాధించింది.
కడప జిల్లా అంటేనే వైకాపా పార్టీకి కంచుకోట లాంటిది. అలాంటి కంచుకోట లో ఎన్డీయే కూటమి ఐదు నియోజకవర్గాల్లో గెలిచి ఒక అరుదైన రికార్డు సృష్టించింది.
ముఖ్య గమనిక (Disclaimer & Credits) :
సమాచార సేకరణ : ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం మరియు ఫోటోలు కేవలం పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మరియు విద్యా ప్రయోజనాల (Informational and Educational Purposes) కోసం మాత్రమే సేకరించబడినవి.
ఫోటో సౌజన్యం : ఇందులో ఉపయోగించిన చిత్రాలు సంబంధిత ఎమ్మెల్యేల అధికారిక Facebook/Social Media ఖాతాల నుండి సేకరించబడినవి. వీటిపై పూర్తి హక్కులు ఆయా వ్యక్తులకు మాత్రమే ఉంటాయి.
మా ఉద్దేశ్యం : ఎటువంటి కాపీరైట్ నియమాలను ఉల్లంఘించడం మా ఉద్దేశ్యం కాదు. కేవలం పాఠకులకు లేటెస్ట్ సమాచారాన్ని అందించడమే UU News లక్ష్యం.
తరచుగా అడిగే ప్రశ్నలు
కడప జిల్లాలోని మొత్తం నియోజకవర్గాలు ఎన్ని?
కడప జిల్లాలో మొత్తం ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి.
కడప జిల్లాలో ఎన్డీయే కూటమి ఎన్ని స్థానాలు గెలుచుకుంది 2024?
మొత్తం ఐదు స్థానాల్లో ఎన్డీయే కూటమి గెలిచింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన నియోజకవర్గాలు ఎన్ని 2024?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు నియోజకవర్గాల్లో గెలిచింది.
కడప జిల్లాలో అత్యధిక మెజారిటీ ఎవరికి వచ్చింది?
వైయస్ జగన్మోహన్ రెడ్డి ( 61,687 ఓట్లు )
జమ్మలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి ( బిజెపి పార్టీ )
ప్రొద్దుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
నంద్యాల వరదరాజులు రెడ్డి ( టిడిపి పార్టీ )
మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
పుట్టా సుధాకర్ యాదవ్ ( టిడిపి పార్టీ )
బద్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
దాసరి సుధ ( వైకాపా పార్టీ )
కడప నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
రెడ్డప్ప గారి మాధవి రెడ్డి ( టిడిపి పార్టీ )
పులివెందుల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
వైయస్ జగన్మోహన్ రెడ్డి ( వైకాపా పార్టీ )
కమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి ( టిడిపి పార్టీ )
రాజంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
ఆకేపాటి అమరనాథ రెడ్డి ( వైకాపా పార్టీ )
