Eluru District MLA List 2024 ( Latest Update ) | ఏలూరు జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

Eluru District MLA List 2024 | 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో భాగంగా గెలుపొందిన ఏలూరు జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితాను తెలుసుకుందాం.

Table of Contents

Eluru District MLA List 2024

2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా గెలిచిన ఏలూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ ప్రస్తుతం జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో గెలుపొందిన ఏలూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేల పేర్లు, నియోజకవర్గాల పేర్లు మరియు పార్టీ పేర్లను ఇక్కడ చూడండి.

S.NO.MLA NameConstituencyParty Name
1Chintamaneni PrabhakarDenduluruTDP
2Patsamatla DharmarajuUnguturuJSP
3Chirri BalarajuPolavaram (ST)JSP
4Kolusu ParthasarathyNuzvidTDP
5Badeti Radha KrishnayyaEluruTDP
6Kamineni SrinivasKaikalurBJP
7Songa Roshan KumarChintalapudi (SC)TDP

Source: ఈ పట్టికలోని వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా సేకరించబడినవి.

Denduluru MLA 2024 | పూర్తి జాబితా

Denduluru MLA 2024 Chintamaneni Prabhakar
దెందులూరు ఎమ్మెల్యే 2024 చింతమనేని ప్రభాకర్ | Denduluru MLA 2024 Chintamaneni Prabhakar (Source : Facebook)

దెందులూరు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొఠారు రామచంద్ర రావు పైన 14,235 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గానికి గాను వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు పైన 17,746 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

2019 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కొఠారు అబ్బయ్య చౌదరి చేతిలో 16,131 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా నాలుగో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కొఠారు అబ్బయ్య చౌదరి పైన 26,266 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ఆయన తెలుగుదేశం పార్టీ తరపున దెందులూరు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా, అందులో మూడుసార్లు (2009, 2014, 2024) ఘనవిజయం సాధించారు. మిగతా ఒకసారి (2019 ఎన్నికలు) పరాజయం పాలయ్యారు.

Unguturu MLA 2024 | పూర్తి జాబితా

Unguturu MLA 2024 Patsamatla Dharmaraju
ఉంగుటూరు ఎమ్మెల్యే 2024 పత్సమట్ల ధర్మరాజు | Unguturu MLA 2024 Patsamatla Dharmaraju (Source : Facebook)

ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారు రాజకీయాల పైన ఆసక్తితో ఆయన జనసేన పార్టీలో చేరి ఆవిర్భావం నుంచి వివిధ హోదాల్లో పనిచేసి, ఉంగుటూరు జనసేన పార్టీ ఇన్ చార్జ్ గా పనిచేశారు.

ఉంగుటూరు నియోజకవర్గంలో ఆయన చేసిన కార్యక్రమాలను గుర్తించి జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో అవకాశం ఇచ్చింది. 2024 శాసనసభ ఎన్నికలలో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) పైన 44,945 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

Polavaram MLA 2024 | పూర్తి జాబితా

Polavaram MLA 2024 Chirri Balaraju
పోలవరం ఎమ్మెల్యే 2024 చిర్రి బాలరాజు | Polavaram MLA 2024 Chirri Balaraju (Source : Facebook)

పోలవరం ఎస్టీ రిజర్వ్ శాసనసభ నియోజకవర్గం. ప్రస్తుతం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు జనసేన పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. 2019 శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ ఆయనకు పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేయగా కేవలం 13,378 ఓట్లు మాత్రమే నమోదు అయ్యాయి. వైకాపా వర్సెస్ టిడిపి మధ్య గట్టి పోటీ ఉండడంతో ఆ ఎన్నికల్లో ఆయన మూడవ స్థానంలో నిలిచారు.

2024 శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన తెల్లం రాజ్యలక్ష్మి పైన 7,935 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

Nuzvid MLA 2024 | పూర్తి జాబితా

Nuzvid MLA 2024 Kolusu Parthasarathy
నూజివీడు ఎమ్మెల్యే 2024 కొలుసు పార్థసారథి | Nuzvid MLA 2024 Kolusu Parthasarathy (Source : Facebook)

నూజివీడు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి గారిది రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి కొలుసు పెద రెడ్డయ్య యాదవ్ ఒకసారి ఎంపీగా మరియు ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

తండ్రి అడుగుజాడల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికలలో ఉయ్యూరు శాసనసభ నియోజకవర్గం టికెట్ ఇచ్చింది.

2004 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఉయ్యూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన చలసాని వెంకటేశ్వరరావు పైన 6,314 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన చలసాని వెంకటేశ్వరరావు పైన 177 అతి తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

2014 ఎన్నికలలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 లోక్ సభ ఎన్నికలలో మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మొదటిసారి ఎంపీగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన కొనకాళ్ల నారాయణ రావు చేతిలో 81,057 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

West Godavari District MLA List 2024
West Godavari District MLA List 2024 (Latest Update ) | పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

2019 అసెంబ్లీ ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి వైకాపా తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన బోడె ప్రసాద్ పైన 11,317 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2024 శాసనసభ ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికలలో నూజివీడు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన మేక వెంకట ప్రతాప్ అప్పారావు పైన 12,378 ఓట్ల మెజారిటీతో గెలిచి నాలుగో సారి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు.

నూజివీడు నియోజకవర్గంలో చివరిసారిగా 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేశారు. దాదాపు పదిహేనేళ్ళ తర్వాత 2024 శాసనసభ ఎన్నికల్లో కొలుసు పార్థసారథి గారి గెలుపుతో తెలుగుదేశం పార్టీ జెండా జయకేతనం ఎగురవేసింది.

ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పశుసంవర్ధక మత్స్య మరియు పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా ఆయన మాధ్యమిక విద్యా మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

ప్రస్తుతం ఆయన చంద్రబాబు గారి మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ సమాచార & పౌరసంబంధాల మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Eluru MLA 2024 | పూర్తి జాబితా

Eluru MLA 2024 Badeti Radha Krishnayya
ఏలూరు ఎమ్మెల్యే 2024 బడేటి రాధాకృష్ణయ్య | Eluru MLA 2024 Badeti Radha Krishnayya (Source : Facebook)

ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆయనకు 2024 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

ఆయన రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చారు. ఆయన అన్న బడేటి కోట రామారావు గారు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మొదటిసారి ఓటమి పాలయ్యారు.

ఆ తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఏలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ విజయం సాధించారు. అనంతరం 2019 ఎన్నికలలో టిడిపి తరపున పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

ఆయన అన్నయ్య బడేటి కోట రామారావు గారు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే. దురదృష్టవశాత్తు ఆయన 2019 లో గుండెపోటుతో మరణించారు. అన్న మరణాంతరం ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ పైన 62,388 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా 62,388 ఓట్ల భారీ మెజారిటీతో గెలవడం విశేషం.

Kaikalur MLA 2024 | పూర్తి జాబితా

Kaikalur MLA 2024 Kamineni Srinivas
కైకలూరు ఎమ్మెల్యే 2024 కామినేని శ్రీనివాస్ | Kaikalur MLA 2024 Kamineni Srinivas (Source : Facebook)

కైకలూరు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరారు.

2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కైకలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన జయమంగళ వెంకట రమణ చేతిలో 974 అతి తక్కువ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

2014 శాసనసభ ఎన్నికలలో ఆయన బిజెపిలో చేరారు. 2014 ఎన్నికల్లో బిజెపి మరియు తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేశాయి. 2014 శాసనసభ ఎన్నికలలో కైకలూరు నియోజకవర్గం నుంచి బిజెపి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ఉప్పల రాంప్రసాద్ పైన 21,571 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2014-2018 మధ్య ఆయన చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ, మెడికల్ ఎడ్యుకేషన్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బిజెపి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన దూలం నాగేశ్వరరావు పైన 45,273 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

2014 ఎన్నికల్లో బిజెపి మరియు తెలుగుదేశం కూటమి తరపున గెలిచిన ఆయన 2024 ఎన్నికల్లో బిజెపి, తెలుగుదేశం మరియు జనసేన కూటమి తరపున గెలవడం విశేషం.

Chintalapudi MLA 2024 | పూర్తి జాబితా

Chintalapudi MLA 2024 Songa Roshan Kumar
చింతలపూడి ఎమ్మెల్యే 2024 సొంగ రోషన్ కుమార్ | Chintalapudi MLA 2024 Songa Roshan Kumar (Source : Facebook)

చింతలపూడి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ప్రస్తుతం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ 2024 శాసనసభ ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కంభం విజయ రాజు పైన 27,766 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

Comparison Table 2024

ConstituencyWinnerRunnerMargin
DenduluruChintamaneni PrabhakarKotaru Abbaya Chowdary26,266
UnguturuPatsamatla DharmarajuPuppala Srinivasa Rao Vasubabu44,945
Polavaram (ST)Chirri BalarajuTellam Rajya Lakshmi7,935
NuzvidKolusu ParthasarathyMeka Venkata Pratap Apparao12,378
EluruBadeti Radha KrishnayyaAlla Kali Krishna Srinivas62,388
KaikalurKamineni SrinivasDulam Nageswara Rao45,273
Chintalapudi (SC)Songa Roshan KumarKambham Vijaya Raju27,766

ఆధారాలు (Source): పై పట్టికలోని అభ్యర్థుల మెజారిటీలు మరియు ఎన్నికల ఫలితాల వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా ఇవ్వబడినవి.

East Godavari District MLA List 2024
East Godavari District MLA List 2024 ( Latest Update ) | తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

Previous Election Comparison ( 2019 VS 2024 )

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచి, జిల్లాలోని అన్ని స్థానాలను వైసిపి కైవసం చేసుకోగా, తెలుగుదేశం, బిజెపి మరియు జనసేన పార్టీలు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కించుకోలేకపోయారు.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన మరియు బిజెపి పార్టీలు కలయికతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి క్లీన్ స్వీప్ చేసి ప్రభంజనం సృష్టించింది. ప్రతిపక్షం ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది.

Alliance Impact 2024

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే అభ్యర్థుల భారీ మెజారిటీలే దానికి నిదర్శనం. ముఖ్యంగా ఏలూరు, కైకలూరు మరియు ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గాలలో భారీ మెజారిటీలు నమోదు అయ్యాయి. అంతేకాకుండా జిల్లాలోని యువత మరియు తటస్థ ఓటర్లు కూటమి వైపే మొగ్గు చూపారు.

ముగింపు

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసి చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. తెలుగుదేశం, జనసేన మరియు బిజెపి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం వలనే కూటమి ఇంతటి భారీ విజయాన్ని అందుకున్నారు.

ముఖ్య గమనిక (Disclaimer & Credits) :

సమాచార సేకరణ : ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం మరియు ఫోటోలు కేవలం పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మరియు విద్యా ప్రయోజనాల (Informational and Educational Purposes) కోసం మాత్రమే సేకరించబడినవి.

ఫోటో సౌజన్యం : ఇందులో ఉపయోగించిన చిత్రాలు సంబంధిత ఎమ్మెల్యేల అధికారిక Facebook/Social Media ఖాతాల నుండి సేకరించబడినవి. వీటిపై పూర్తి హక్కులు ఆయా వ్యక్తులకు మాత్రమే ఉంటాయి.

మా ఉద్దేశ్యం : ఎటువంటి కాపీరైట్ నియమాలను ఉల్లంఘించడం మా ఉద్దేశ్యం కాదు. కేవలం పాఠకులకు లేటెస్ట్ సమాచారాన్ని అందించడమే UU News లక్ష్యం.

తరచుగా అడిగే ప్రశ్నలు

ఏలూరు జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి 2024?

ఏలూరు జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి.

ఏలూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో గెలిచింది 2024?

తెలుగుదేశం పార్టీ 2024 శాసనసభ ఎన్నికలలో నాలుగు నియోజకవర్గాల్లో గెలిచింది.

ఏలూరు జిల్లాలో జనసేన పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో గెలిచింది 2024?

జనసేన పార్టీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో గెలిచింది.

దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

చింతమనేని ప్రభాకర్ ( తెలుగుదేశం పార్టీ )

ఉంగుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

పత్సమట్ల ధర్మరాజు ( జనసేన పార్టీ )

పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

చిర్రి బాలరాజు ( జనసేన పార్టీ )

నూజివీడు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

కొలుసు పార్థసారథి ( తెలుగుదేశం పార్టీ )

ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

బడేటి రాధాకృష్ణయ్య ( తెలుగుదేశం పార్టీ )

కైకలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

కామినేని శ్రీనివాస్ ( బిజెపి )

చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

సొంగ రోషన్ కుమార్ ( తెలుగుదేశం పార్టీ )

Leave a Comment