Anantapur District MLA List 2024 (Latest Update) | అనంతపురం జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

Anantapur District MLA List 2024 : 2024 లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో గెలుపొందిన అనంతపురం జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితాను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Table of Contents

Anantapur District MLA List 2024

2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో గెలిచిన అనంతపురం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ, ప్రస్తుతానికి కూడా తమ పదవుల్లో కొనసాగుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన అనంతపురం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేల పేర్లు, నియోజకవర్గాల పేర్లు మరియు పార్టీ పేర్లను ఇక్కడ చూడండి.

S.NO.MLA NameConstituencyParty Name
1Bandaru Sravani SreeSinganamala (SC)TDP
2Payyavula KeshavUravaKondaTDP
3Kalava SrinivasuluRayadurgTDP
4Gummanur JayaramGuntakalTDP
5Amilineni Surendra BabuKalyandurgTDP
6J.C. Ashmit ReddyTadpatriTDP
7Daggupati Venkateswara PrasadAnantapur UrbanTDP
8Paritala SunithaRaptaduTDP

Source: ఈ పట్టికలోని వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా సేకరించబడినవి.

Singanamala MLA 2024 | పూర్తి జాబితా

Singanamala MLA 2024 Bandaru Sravani Sree
శింగనమల ఎమ్మెల్యే 2024 బండారు శ్రావణి శ్రీ | Singanamala MLA 2024 Bandaru Sravani Sree (Source: Facebook)

బండారు శ్రావణి శ్రీ గారిది రాజకీయ నేపథ్యం గల కుటుంబం. ఆమె తాతగారు మరియు తండ్రిగారు రాజకీయాల్లో ఉన్నారు. శ్రావణి శ్రీ తాతగారు రామారావు గారికి అత్యంత సన్నిహితుడు.

శ్రావణి శ్రీ తాతగారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎప్పుడు పోటీ చేయలేదు. కానీ టిడిపి తరపున శింగనమల నియోజకవర్గం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అదేవిధంగా శ్రావణి తండ్రిగారు 2014 ఎన్నికల్లో పోటీ చేయాల్సింది కానీ కొన్ని కారణాలవల్ల ఆయన తప్పుకున్నారు.

తాతగారు మరియు తండ్రి రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేసే దిశగా ఆమె రాజకీయాల్లోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ద్వారా ఆమె రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆమెకి టిడిపి పార్టీ 2019 ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2019 శాసనసభ ఎన్నికలలో శింగనమల శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన జొన్నలగడ్డ పద్మావతి చేతిలో 46,242 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

ఆమె 2019 ఎన్నికల్లో ఓడిపోయిన కూడా ప్రజల మధ్య తిరుగుతూ అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 2024 ఎన్నికల్లో మళ్లీ ఆమెకు తెలుగుదేశం పార్టీ శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2024 శాసనసభ ఎన్నికలలో టిడిపి పార్టీ తరపున శింగనమల శాసనసభ నియోజకవర్గానికి గాను వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన వీరాంజనేయులు పైన 8,788 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

Uravakonda MLA 2024 | పూర్తి జాబితా

Uravakonda MLA 2024 Payyavula Keshav
ఉరవకొండ ఎమ్మెల్యే 2024 పయ్యావుల కేశవ్ | Uravakonda MLA 2024 Payyavula Keshav (Source: Facebook)

ఉరవకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ టిడిపి పార్టీ సీనియర్ నాయకుడు. ఆయన 1994 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 1994 నుంచి ఇప్పటివరకు ఆయన టిడిపి పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు.

ఆయన తెలుగుదేశం పార్టీని వీడి ఎప్పుడు వేరే పార్టీలోకి పోలేదు. ఉరవకొండ నియోజకవర్గం రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరపున కీలక నాయకుడిగా వ్యవహరించారు.

ఆయనకు 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఉరవకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. 1994 శాసనసభ ఎన్నికలలో ఉరవకొండ శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి వై. శివరామ రెడ్డి పైన 17,691 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ఆ తర్వాత 1999 శాసనసభ ఎన్నికల్లో వరుసగా మళ్లీ రెండోసారి ఉరవకొండ నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన వై. శివరామ రెడ్డి చేతిలో 8,501 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.

అనంతరం 2004 శాసనసభ ఎన్నికల్లో టిడిపి పార్టీ తరపున ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి సిపిఐ పార్టీకి చెందిన వై. విశ్వేశ్వర రెడ్డి పైన 8,255 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

2009 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా నాలుగో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన వై. విశ్వేశ్వర రెడ్డి పైన అతి తక్కువ 229 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2014 శాసనసభ ఎన్నికలలో ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఐదోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన వై. విశ్వేశ్వర రెడ్డి చేతిలో 2,275 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

2019 శాసనసభ ఎన్నికలలో వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన వై. విశ్వేశ్వర రెడ్డి పైన 2,132 ఓట్ల మెజారిటీతో గెలిచి నాలుగో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ఆ తర్వాత 2024 శాసనసభ ఎన్నికల్లో టిడిపి పార్టీ తరపున ఉరవకొండ నియోజకవర్గానికి గాను ఏడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన వై. విశ్వేశ్వర రెడ్డి పైన 21,704 ఓట్ల మెజారిటీతో గెలిచి ఐదోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

పయ్యావుల కేశవ్ గారు ఉరవకొండ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, అందులో ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండుసార్లు ఓటమి పాలయ్యారు. ప్రస్తుతానికి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Rayadurg MLA 2024 | పూర్తి జాబితా

Rayadurg MLA 2024 Kalava Srinivasulu
రాయదుర్గం ఎమ్మెల్యే 2024 కాల్వ శ్రీనివాసులు | Rayadurg MLA 2024 Kalava Srinivasulu (Source: Facebook)

రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు గారు టిడిపి పార్టీ సీనియర్ నాయకులు. ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.

1999 ఎన్నికల్లో టిడిపి పార్టీ ఆయనకు అనంతపురం లోక్ సభ నియోజకవర్గం ఎంపీ టికెట్ ఇచ్చింది. 1999 ఎన్నికలలో అనంతపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎంపీగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన అనంత వెంకటరామిరెడ్డి పైన 21,102 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎంపీగా విజయం సాధించారు.

అనంతరం 2004 ఎన్నికలలో వరుసగా రెండోసారి ఎంపీగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన అనంత వెంకటరామిరెడ్డి చేతిలో 73,404 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.

ఆ తర్వాత 2009 ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీ తరపున ముచ్చటగా మూడోసారి ఎంపీగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన అనంత వెంకటరామిరెడ్డి చేతిలో 77,921 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

తర్వాత ఆయనకు తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో రాయదుర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. 2014 శాసనసభ ఎన్నికల్లో టిడిపి పార్టీ తరపున రాయదుర్గం నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన కాపు రామచంద్రారెడ్డి పైన 1,827 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ఆయన 2017 నుంచి 2019 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూరల్ హౌసింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

2019 శాసనసభ ఎన్నికలలో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా రాయదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన కాపు రామచంద్రారెడ్డి చేతిలో 14,049 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

West Godavari District MLA List 2024
West Godavari District MLA List 2024 (Latest Update ) | పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

2024 ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీ తరపున ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన మెట్టు గోవిందా రెడ్డి పైన 41,659 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ఆయన మూడుసార్లు ఎంపీగా పోటీ చేస్తే, అందులో ఒకసారి విజయం సాధించారు. మిగతా రెండుసార్లు ఓడిపోయారు. అలాగే మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, అందులో ఒకసారి ఓడిపోయారు. మిగతా రెండు సార్లు విజయం సాధించారు.

Guntakal MLA 2024 | పూర్తి జాబితా

Guntakal MLA 2024 Gummanur Jayaram
గుంతకల్లు ఎమ్మెల్యే 2024 గుమ్మనూరు జయరాం | Guntakal MLA 2024 Gummanur Jayaram (Source: Facebook)

గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. మొట్టమొదటిసారిగా ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

ఆ తర్వాత 2009 శాసనసభ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఆయనకు ఆలూరు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2009 శాసనసభ ఎన్నికల్లో ఆలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన పాటిల్ నీరజ రెడ్డి చేతిలో 5,346 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

2014 సంవత్సరంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆయనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలూరు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2014 శాసనసభ ఎన్నికలలో వైకాపా పార్టీ తరపున ఆలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన వీరభద్ర గౌడ్ పైన 1,919 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2019 శాసనసభ ఎన్నికలలో వరుసగా వైకాపా పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగు పార్టీకి చెందిన కోట్ల సుజాతమ్మ పైన 39,896 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఆయన వైయస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కార్మిక ఉపాధి శిక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

2024 సంవత్సరంలో ఆయన్ని ఆలూరు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా, కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా వైకాపా పార్టీ ప్రకటించడంతో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

2024 ఎన్నికల్లో ఆయనకు టిడిపి పార్టీ గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. 2024 శాసనసభ ఎన్నికలలో టిడిపి పార్టీ తరపున గుంతకల్లు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన వై. వెంకటరామ రెడ్డి పైన 6,826 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, అందులో ఒకసారి ఓడిపోయారు. మిగతా మూడుసార్లు విజయం సాధించారు. రెండుసార్లు వైకాపా పార్టీ తరపున గెలిచారు. ఒకసారి తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు. మిగతా ఒకసారి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.

Kalyandurg MLA 2024 | పూర్తి జాబితా

Kalyandurg MLA 2024 Amilineni Surendra Babu
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే 2024 అమిలినేని సురేంద్ర బాబు | Kalyandurg MLA 2024 Amilineni Surendra Babu (Source: Facebook)

కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2024 ఎన్నికలలో టిడిపి పార్టీ ఆయనకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.

2024 శాసనసభ ఎన్నికలలో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన తలారి రంగయ్య పైన 37,734 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

Tadpatri MLA 2024 | పూర్తి జాబితా

Tadpatri MLA 2024 JC Ashmit Reddy
తాడిపత్రి ఎమ్మెల్యే 2024 జెసి అస్మిత్ రెడ్డి | Tadpatri MLA 2024 JC Ashmit Reddy (Source: Facebook)

తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి గారిది రాజకీయ నేపథ్యం గల కుటుంబం. అస్మిత్ రెడ్డి పెదనాన్న గారు మరియు నాన్నగారు సీనియర్ నాయకులు మరియు రాజకీయ అనుభవజ్ఞులు. అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఆయన పెద్దనాన్న మరియు తండ్రి కీలక నాయకులు.

తండ్రి మరియు పెదనాన్న రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. 2019 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు.

2019 శాసనసభ ఎన్నికల్లో టిడిపి పార్టీ ఆయనకు తాడిపత్రి శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2019 శాసనసభ ఎన్నికలలో తాడిపత్రి శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన కేతిరెడ్డి పెద్దా రెడ్డి చేతిలో 7,533 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

2024 శాసనసభ ఎన్నికలలో మళ్ళీ వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన కేతిరెడ్డి పెద్దా రెడ్డి పైన 27,731 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

జెసి అస్మిత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరపున తాడిపత్రి నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, అందులో ఒకసారి విజయం సాధించారు. ఒకసారి ఓటమి పాలయ్యారు.

Anantapur Urban MLA 2024 | పూర్తి జాబితా

Anantapur Urban MLA 2024 Daggupati Venkateswara Prasad
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే 2024 దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ | Anantapur Urban MLA 2024 Daggupati Venkateswara Prasad (Source: Facebook)

అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2024 ఎన్నికల్లో టిడిపి పార్టీ ఆయనకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2024 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున అనంతపురం అర్బన్ శాసనసభ నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన అనంత వెంకటరామిరెడ్డి పైన 23,023 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Raptadu MLA 2024 | పూర్తి జాబితా

Raptadu MLA 2024 Paritala Sunitha
రాప్తాడు ఎమ్మెల్యే 2024 పరిటాల సునీత | Raptadu MLA 2024 Paritala Sunitha (Source: Facebook)

రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే పరిటాల సునీత గారిది రాజకీయ నేపథ్యం గల కుటుంబం. పరిటాల సునీత గారి భర్త పరిటాల రవి గారు 1994 నుంచి 2004 వరకు టిడిపి పార్టీ తరపున వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా పరిటాల రవి గారు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కీలక వ్యక్తుల్లో ఒకరు.

పరిటాల రవి గారు 2005 సంవత్సరంలో చనిపోవడంతో, 2005 ఉప ఎన్నికల్లో ఆమెకు తెలుగుదేశం పార్టీ పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2005 ఉప ఎన్నికల్లో పెనుకొండ నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ తరపున మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన బోయ శ్రీరాములు పైన 18,852 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2009 ఎన్నికల నుంచి ఆమె రాప్తాడు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2009 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున రాప్తాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన 1,707 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

అలాగే 2014 శాసనసభ ఎన్నికలలో రాప్తాడు నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన 7,774 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

East Godavari District MLA List 2024
East Godavari District MLA List 2024 | తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

2019 శాసనసభ ఎన్నికలలో ఆమె పోటీ చేయలేదు. టిడిపి పార్టీ ఆమె కొడుకు పరిటాల శ్రీరామ్ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. పరిటాల శ్రీరామ్ తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో 25,575 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

అనంతరం 2024 ఎన్నికల్లో ఆమెకు మళ్లీ తెలుగుదేశం పార్టీ రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. 2024 శాసనసభ ఎన్నికలలో రాప్తాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన 23,329 ఓట్ల మెజారిటీతో గెలిచి నాలుగో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2017 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మహిళా సాధికారత శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

పరిటాల సునీత గారికి ఒక అరుదైన రికార్డు ఉంది. అదేంటంటే ఆమె నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, నాలుగు సార్లు విజయం సాధించారు. ఒక్కసారి కూడా ఓడిపోలేదు. అంతేకాకుండా రాప్తాడు నియోజకవర్గం రాజకీయ చరిత్రలో గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.

Comparison Table 2024

ConstituencyWinnerRunnerMargin
Singanamala (SC)Bandaru Sravani SreeMannepakula Veeranjaneyulu8,788
UravakondaPayyavula KeshavY. Visweswara Reddy21,704
RayadurgKalava SrinivasuluMettu Govinda Reddy41,659
GuntakalGummanur JayaramY. Venkatarama Reddy6,826
KalyandurgAmilineni Surendra BabuTalari Rangaiah37,734
TadpatriJC Ashmit ReddyKethireddy Pedda Reddy27,731
Anantapur UrbanDaggupati Venkateswara PrasadAnantha Venkatarami Reddy23,023
RaptaduParitala SunithaThopudurthi Prakash Reddy23,329

ఆధారాలు (Source): పై పట్టికలోని అభ్యర్థుల మెజారిటీలు మరియు ఎన్నికల ఫలితాల వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా ఇవ్వబడినవి.

Previous Election Comparison ( 2019 VS 2024 )

2019 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో భాగంగా అనంతపురం జిల్లాకు సంబంధించిన ఎనిమిది నియోజకవర్గాలకు గాను, ఏడు నియోజకవర్గాల్లో వైకాపా పార్టీ గెలిచింది. మిగతా ఒక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది.

2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో అనంతపురం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. వైకాపా పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కలేదు.

2019 ఎన్నికల్లో వైకాపా పార్టీ ప్రభావం గట్టిగానే చూపించింది. కానీ 2024 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. ఎన్డీయే కూటమి తెలుగుదేశం పార్టీ ప్రభావం ముందు వైకాపా పార్టీ నిలువలేక పోయింది.

Alliance Impact 2024

2024 శాసనసభ ఎన్నికలలో టిడిపి పార్టీ జనసేన పార్టీ మరియు బిజెపి పార్టీలు ఎన్డీయే కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేసి ఫలితాలపై ప్రభావం చూపాయి. ఓట్లు పక్కకు పోకుండా మూడు పార్టీలు కలిసికట్టుగా పోటీ చేసి అనంతపురం జిల్లా అన్ని నియోజకవర్గాల్లోనూ క్లీన్ స్వీప్ చేసింది.

అంతేకాకుండా ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రభావం మరియు ఓటర్లు ప్రభావం కూడా కీలకంగా మారాయి.

ముగింపు

2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో అనంతపురం జిల్లా అన్ని నియోజకవర్గాల్లోనూ టిడిపి పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. వైసిపి పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేక పోయింది. 2024 ఎన్నికలలో ఎన్డీయే కూటమి హవా ముందు వైసిపి పార్టీ నిలువ లేకపోయింది.

ముఖ్య గమనిక (Disclaimer & Credits) :

సమాచార సేకరణ : ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం మరియు ఫోటోలు కేవలం పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మరియు విద్యా ప్రయోజనాల (Informational and Educational Purposes) కోసం మాత్రమే సేకరించబడినవి.

ఫోటో సౌజన్యం : ఇందులో ఉపయోగించిన చిత్రాలు సంబంధిత ఎమ్మెల్యేల అధికారిక Facebook/Social Media ఖాతాల నుండి సేకరించబడినవి. వీటిపై పూర్తి హక్కులు ఆయా వ్యక్తులకు మాత్రమే ఉంటాయి.

మా ఉద్దేశ్యం : ఎటువంటి కాపీరైట్ నియమాలను ఉల్లంఘించడం మా ఉద్దేశ్యం కాదు. కేవలం పాఠకులకు లేటెస్ట్ సమాచారాన్ని అందించడమే UU News లక్ష్యం.

తరచుగా అడిగే ప్రశ్నలు

అనంతపురం జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి?

మొత్తం ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి.

అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో గెలిచింది 2024?

2024 ఎన్నికలలో టిడిపి పార్టీ అనంతపురం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో గెలిచి క్లీన్ స్వీప్ చేసింది.

అనంతపురం జిల్లాలో వైకాపా పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో గెలిచింది 2024?

అనంతపురం జిల్లాలో 2024 ఎన్నికల ఫలితాల్లో వైకాపా పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కలేదు.

శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

బండారు శ్రావణి శ్రీ ( టిడిపి పార్టీ )

ఉరవకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

పయ్యావుల కేశవ్ ( టిడిపి పార్టీ )

రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

కాల్వ శ్రీనివాసులు ( టిడిపి పార్టీ )

గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

గుమ్మనూరు జయరాం ( టిడిపి పార్టీ )

కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

అమిలినేని సురేంద్ర బాబు ( టిడిపి పార్టీ )

తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

జెసి అస్మిత్ రెడ్డి ( టిడిపి పార్టీ )

అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ( టిడిపి పార్టీ )

రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

పరిటాల సునీత ( టిడిపి పార్టీ )

Leave a Comment