Guntur District MLA List 2024 | 2024 లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన గుంటూరు జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితాను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Guntur District MLA List 2024
2024 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గెలిచిన గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలందరూ, ప్రస్తుతం జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేల పేర్లు, నియోజకవర్గాల పేర్లు మరియు పార్టీ పేర్లను ఇక్కడ చూడండి.
| S.NO. | MLA Name | Constituency | Party Name |
| 1 | Dhulipalla Narendra Kumar | Ponnur | TDP |
| 2 | Burla Ramanjaneyulu | Prathipadu (SC) | TDP |
| 3 | Galla Madhavi | Guntur West | TDP |
| 4 | Tenali Sravan Kumar | Tadikonda (SC) | TDP |
| 5 | Nadendla Manohar | Tenali | JSP |
| 6 | Mohammed Naseer Ahmed | Guntur East | TDP |
| 7 | Nara Lokesh | Mangalagiri | TDP |
Source: ఈ పట్టికలోని వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా సేకరించబడినవి.
Ponnur MLA 2024 | పూర్తి జాబితా

పొన్నూరు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు మంత్రివర్గంలో మంత్రిగా గా కూడా పనిచేశారు.
వీరయ్య చౌదరి గారు 1983,1985 అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. అనంతరం 1989 శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.
దురదృష్టవశాత్తు వీరయ్య చౌదరి గారు చనిపోవడంతో నరేంద్ర కుమార్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆయనకు పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
1994 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి. వెంకటరామయ్య పైన 21,729 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
1999 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన చిట్టినేని ప్రతాప్ బాబు పైన 15,533 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2004 శాసనసభ ఎన్నికలలో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన మన్నవ రాజా కిషోర్ పైన 9,025 ఓట్ల మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన మరుపుడి లీలాధర రావు పైన 2,168 ఓట్ల మెజారిటీతో గెలిచి నాలుగో సారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా ఐదోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన రవి వెంకట రమణ పైన 7,761 ఓట్ల మెజారిటీతో గెలిచి ఐదోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2019 శాసనసభ ఎన్నికలలో వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కిలారి వెంకట రోశయ్య చేతిలో 1,112 అతి తక్కువ ఓట్ల తేడాతో మొదటిసారి ఓటమి పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పొన్నూరు నియోజకవర్గం నుంచి ఏడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన అంబటి మురళీ కృష్ణ పైన 32,915 ఓట్ల మెజారిటీతో గెలిచి ఆరోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
పొన్నూరు నియోజకవర్గం రాజకీయ చరిత్రలో అత్యధిక సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. అంతేకాకుండా పొన్నూరు నియోజకవర్గంలో 32,915 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా కూడా రికార్డ్ సృష్టించారు.
ఒక పక్క రాజకీయాల్లో ఉంటూనే ఇంకోపక్క సంగం డెయిరీ చైర్మన్ గా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Prathipadu MLA 2024 | పూర్తి జాబితా

ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గారు రాజకీయాల్లోకి రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఎఎస్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు.
రాజకీయాల పైన ఆసక్తితో ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. 2019 శాసనసభ ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో కోడుమూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన జరదొడ్డి సుధాకర్ చేతిలో 36,045 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
2024 శాసనసభ ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం.
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన బాలసాని కిరణ్ కుమార్ పైన 42,015 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 42,015 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు ఆయన పేరిట ఉంది.
Guntur West MLA 2024 | పూర్తి జాబితా

గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2024 శాసనసభ ఎన్నికలలో ఆమెకు తెలుగుదేశం పార్టీ గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన విడదల రజిని పైన 51,150 భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ఆమె రెండు రికార్డులను తన సొంతం చేసుకున్నారు. ఒకటి గుంటూరు వెస్ట్ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 51,150 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.
మరొకటి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యేగా ఆమె సరికొత్త రికార్డుని సృష్టించారు.
అంతేకాక గుంటూరు వెస్ట్ నియోజకవర్గం 2009 లో ఏర్పడినప్పటి నుంచి 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. మిగతా 2014,2019,2024 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా తెలుగుదేశం పార్టీ జెండా జయకేతనం ఎగురవేసింది.
Tadikonda MLA 2024 | పూర్తి జాబితా

తాడికొండ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారు గ్రూప్ 1 ఆఫీసర్ గా పనిచేశారు. ఆయనకు రాజకీయాల పైన ఆసక్తితో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు.
2009 శాసనసభ ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం.
2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన డొక్కా మాణిక్యవరప్రసాద్ రావు చేతిలో 3,620 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన హెనీ క్రిస్టినా పైన 7,542 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వరుసగా మూడో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ఉండవల్లి శ్రీదేవి చేతిలో 4,083 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా నాలుగో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన మేకతోటి సుచరిత పైన 39,606 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
తాడికొండ శాసనసభ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 39,606 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డుని ఆయన సొంతం చేసుకున్నారు.
Tenali MLA 2024 | పూర్తి జాబితా

తెనాలి శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారు రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి నాదెండ్ల భాస్కరరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి మాజీ ముఖ్యమంత్రి గా పనిచేశారు.
ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు తెనాలి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2004 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన గోగినేని ఉమా పైన 12,606 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2009 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ పైన 2,884 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయగా కేవలం 15,511 ఓట్లు మాత్రమే నమోదు అయ్యాయి. టిడిపి వర్సెస్ వైకాపా మధ్య గట్టి పోటీ ఉండడంతో, ఆ ఎన్నికల్లో ఆయన మూడవ స్థానంలో నిలిచారు.
2019 శాసనసభ ఎన్నికలకు ముందే ఆయన జనసేన పార్టీలో చేరారు.
2019 శాసనసభ ఎన్నికలలో తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయగా కేవలం 29,905 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. వైకాపా వర్సెస్ టిడిపి మధ్య గట్టి పోటీ ఉండడంతో, ఆయన ఆ ఎన్నికల్లో కూడా మూడవ స్థానంలో నిలిచారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన అన్నాబత్తుని శివ కుమార్ పైన 48,112 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడో సారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
తెనాలి శాసనసభ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 48,112 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన ఒక అరుదైన రికార్డుని సృష్టించారు.
2009 నుంచి 2011 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా, 2011 నుంచి 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాలు, ఆహారం మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Guntur East MLA 2024 | పూర్తి జాబితా

గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆయన 2019 ఎన్నికల్లో మొహమ్మద్ నసీర్ పేరుతో పోటీ చేశారు.
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన మొహమ్మద్ ముస్తాఫా షేక్ చేతిలో 22,091 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన నూరి ఫాతిమా పైన 31,962 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 31,962 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన రికార్డుని తన సొంతం చేసుకున్నారు.
అంతేకాకుండా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం 2009 లో ఏర్పడినప్పటి నుంచి 2009,2014,2019 శాసనసభ ఎన్నికలలో టిడిపి జెండా ఎగరలేదు. 2024 శాసనసభ ఎన్నికల్లో మొహమ్మద్ నసీర్ అహ్మద్ గెలుపుతో తెలుగుదేశం పార్టీ జెండా జయకేతనం ఎగురవేసింది.
Mangalagiri MLA 2024 | పూర్తి జాబితా

మంగళగిరి శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే నారా లోకేశ్ గారు రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి.
ఆయన తెలుగుదేశం పార్టీ యువజన విభాగం నాయకుడిగా వ్యవహరించారు. ఆయన 2017 లో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2017-2019 మధ్య కాలంలో చంద్రబాబు మంత్రివర్గంలో పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 5,337 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచే ఎందుకు పోటీ చేశారంటే, తెలుగుదేశం పార్టీ 1983 మరియు 1985 శాసనసభ ఎన్నికల్లో మాత్రమే గెలిచింది. ఆ తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదు అని అందుకే ఆయన అక్కడి నుంచి పోటీ చేశారని చాలా సందర్భాల్లో పేర్కొన్నారు.
ఆయన 2023 సంవత్సరంలో యువగలం పాదయాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్రలో ప్రజల సమస్యల్ని తెలుసుకున్నారు. దాదాపు ఆయన 3 వేల కిలోమీటర్లు పైనే పాదయాత్ర చేశారు. అంతేకాక తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవడానికి యువగలం పాదయాత్ర కీలక పాత్ర పోషించింది.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన మురుగుడు లావణ్య పైన 91,413 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
మంగళగిరి శాసనసభ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 91,413 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు.
అంతేకాక తెలుగుదేశం పార్టీ చివరిసారిగా 1985 శాసనసభ ఎన్నికల్లో జెండా ఎగురవేసింది. దాదాపు ముప్పై తొమ్మిది ఏళ్ల తర్వాత 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నారా లోకేశ్ గెలుపుతో తెలుగుదేశం పార్టీ జెండా జయకేతనం ఎగురవేసింది.
ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ శాఖ మంత్రిగా, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Comparison Table 2024
| Constituency | Winner | Runner | Margin |
| Ponnur | Dhulipalla Narendra Kumar | Ambati Murali Krishna | 32,915 |
| Prathipadu (SC) | Burla Ramanjaneyulu | Balasani Kiran Kumar | 42,015 |
| Guntur West | Galla Madhavi | Vidadala Rajini | 51,150 |
| Tadikonda (SC) | Tenali Sravan Kumar | Mekathoti Sucharitha | 39,606 |
| Tenali | Nadendla Manohar | Annabathuni Siva Kumar | 48,112 |
| Guntur East | Mohammed Naseer Ahmed | Noori Fathima | 31,962 |
| Mangalagiri | Nara Lokesh | Murugudu Lavanya | 91,413 |
ఆధారాలు (Source): పై పట్టికలోని అభ్యర్థుల మెజారిటీలు మరియు ఎన్నికల ఫలితాల వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా ఇవ్వబడినవి.
Previous Election Comparison ( 2019 VS 2024 )
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గాలి బలంగా వీచింది. గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను కనబరిచి, ఆరు స్థానాలను కైవసం చేసుకోగా, మిగతా ఒక్క స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలిచి తన ఉనికిని చాటుకుంది.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు తారుమారు అయ్యాయి. గుంటూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేసి చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది.
Alliance Impact 2024
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి కలయిక కీలక పాత్ర పోషించింది. కూటమి ఐక్యత ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. జిల్లాలోని యువత మరియు తటస్థ ఓటర్లు కూటమి వైపే మొగ్గు చూపారు. అందువలనే జిల్లాలోని మంగళగిరి, గుంటూరు వెస్ట్ మరియు తెనాలి నియోజకవర్గాలు రికార్డు స్థాయిలో మెజారిటీలు నమోదు అయ్యాయి.
ముగింపు
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో గుంటూరు జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టించింది. అందులో తెలుగుదేశం పార్టీ ఆరు స్థానాల్లో ఘనవిజయం సాధించింది. మిగతా ఒక్క స్థానం జనసేన పార్టీ విజయం సాధించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేక పోయారు.
ముఖ్య గమనిక (Disclaimer & Credits) :
సమాచార సేకరణ : ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం మరియు ఫోటోలు కేవలం పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మరియు విద్యా ప్రయోజనాల (Informational and Educational Purposes) కోసం మాత్రమే సేకరించబడినవి.
ఫోటో సౌజన్యం : ఇందులో ఉపయోగించిన చిత్రాలు సంబంధిత ఎమ్మెల్యేల అధికారిక Facebook/Social Media ఖాతాల నుండి సేకరించబడినవి. వీటిపై పూర్తి హక్కులు ఆయా వ్యక్తులకు మాత్రమే ఉంటాయి.
మా ఉద్దేశ్యం : ఎటువంటి కాపీరైట్ నియమాలను ఉల్లంఘించడం మా ఉద్దేశ్యం కాదు. కేవలం పాఠకులకు లేటెస్ట్ సమాచారాన్ని అందించడమే UU News లక్ష్యం.
తరచుగా అడిగే ప్రశ్నలు
గుంటూరు జిల్లాలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన ఎమ్మెల్యే ఎవరు?
నారా లోకేష్ – 91,413 ఓట్లు ( తెలుగుదేశం పార్టీ) మంగళగిరి నియోజకవర్గం.
గుంటూరు జిల్లాలో విజయం సాధించిన ఏకైక మహిళా ఎమ్మెల్యే ఎవరు?
గళ్ళా మాధవి ( తెలుగుదేశం పార్టీ ) గుంటూరు వెస్ట్ నియోజకవర్గం.
గుంటూరు జిల్లాలోని ఇద్దరు మంత్రులు ఎవరు?
నారా లోకేష్ మరియు నాదెండ్ల మనోహర్
పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ( తెలుగుదేశం పార్టీ )
ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
బూర్ల రామాంజనేయులు ( తెలుగుదేశం పార్టీ )
తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
తెనాలి శ్రావణ్ కుమార్ ( తెలుగుదేశం పార్టీ )
గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
మొహమ్మద్ నసీర్ అహ్మద్ ( తెలుగుదేశం పార్టీ )
