Konaseema District MLA List 2024 ( Latest Update ) | కోనసీమ జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

Konaseema District MLA List 2024 | 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో గెలుపొందిన కోనసీమ జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితాను తెలుసుకుందాం.

Table of Contents

Konaseema District MLA List 2024

2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గెలిచిన కోనసీమ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ ప్రస్తుతం కోనసీమ జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో భాగంగా కోనసీమ జిల్లాలో గెలుపొందిన ఆరు నియోజకవర్గాల పేర్లు, ఎమ్మెల్యేల పేర్లు మరియు పార్టీ పేర్లను ఇక్కడ చూడండి.

S.NO.MLA NameConstituencyParty Name
1Aithabathula Ananda RaoAmalapuram ( SC )TDP
2Vasamsetti Subhash RamachandrapuramTDP
3Deva VaraprasadRazole ( SC )JSP
4Datla SubbarajuMummidivaramTDP
5Bandaru Satyananda RaoKothapetaTDP
6Giddi SatyanarayanaGannavaram ( SC )JSP

Source: ఈ పట్టికలోని వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా సేకరించబడినవి.

Amalapuram MLA 2024 | పూర్తి జాబితా

Amalapuram MLA 2024 Aithabathula Ananda Rao
అమలాపురం ఎమ్మెల్యే 2024 అయితాబత్తుల ఆనందరావు | Amalapuram MLA 2024 Aithabathula Ananda Rao (Source : Facebook)

అమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అంతేకాకుండా ఆయన టిడిపి పార్టీ సీనియర్ నాయకులు మరియు రాజకీయ అనుభవజ్ఞుడు.

అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. 2009 లో తెలుగుదేశం పార్టీ తరపున ఆయన తొలిసారిగా అమలాపురం బరిలో నిలిచారు.

2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున అమలాపురం నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన పినిపె విశ్వరూప్ చేతిలో 34,737 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గానికి గాను వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన బాబురావు గొల్ల పైన 12,413 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.

2019 శాసనసభ ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన పినిపె విశ్వరూప్ చేతిలో 25,654 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున అమలాపురం నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన పినిపె విశ్వరూప్ పైన 38,628 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ఆయన తెలుగుదేశం పార్టీ తరపున అమలాపురం శాసనసభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా, అందులో రెండుసార్లు విజయం సాధించారు. మిగతా రెండుసార్లు పరాజయం చెందారు.

అమలాపురం శాసనసభ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 38,628 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డు ఆయన పేరిట ఉంది.

Ramachandrapuram MLA 2024 | పూర్తి జాబితా

Ramachandrapuram MLA 2024 Vasamsetti Subhash
రామచంద్రపురం ఎమ్మెల్యే 2024 వాసంశెట్టి సుభాష్ | Ramachandrapuram MLA 2024 Vasamsetti Subhash (Source : Facebook)

రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. వైకాపాలో కొన్నాళ్లపాటు పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా పనిచేశారు.

రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైకాపాతో తలెత్తిన విభేదాల కారణంగా ఆయన పార్టీకి రాజీనామా చేసి, అనంతరం 2024 లో శాసనసభ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు.

2024 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చాలామంది కొత్త వాళ్లకి ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం ఇచ్చింది. అందులో ఆయన కూడా ఒకరు. ఆయనకు తెలుగుదేశం పార్టీ రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన పిల్లి సూర్య ప్రకాష్ పైన 26,291 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 26,291 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన రికార్డుని తన సొంతం చేసుకున్నారు.

మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, ఆయన పనితీరు మరియు సామర్థ్యాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ అధిష్టానం మంత్రి వర్గంలో చోటు కల్పించింది. ప్రస్తుతం ఆయన కార్మిక, కర్మాగార, బాయిలర్స్ అండ్ వైద్య బీమా సేవల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Razole MLA 2024 | పూర్తి జాబితా

Razole MLA 2024 Deva Varaprasad
రాజోలు ఎమ్మెల్యే 2024 దేవ వరప్రసాద్ | Razole MLA 2024 Deva Varaprasad (Source : Facebook)

రాజోలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. రాజోలు నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ (IAS) అధికారి. రాజకీయాల్లో ఆసక్తి ఉండటంతో ఆయన జనసేన పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు.

ఆయన రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చారు. ఆయనకు జనసేన పార్టీ 2024 శాసనసభ ఎన్నికల్లో భాగంగా రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన గొల్లపల్లి సూర్య రావు పైన 39,011 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

రాజోలు శాసనసభ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 39,011 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన ఒక నూతన రికార్డును సృష్టించారు.

West Godavari District MLA List 2024
West Godavari District MLA List 2024 (Latest Update ) | పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

రాజోలు నియోజకవర్గానికి, జనసేన పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచిన ఏకైక నియోజకవర్గం రాజోలు కావడం విశేషం.

Mummidivaram MLA 2024 | పూర్తి జాబితా

Mummidivaram MLA 2024 Datla Subbaraju
ముమ్మిడివరం ఎమ్మెల్యే 2024 దాట్ల సుబ్బరాజు | Mummidivaram MLA 2024 Datla Subbaraju (Source : Facebook)

ముమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆయన రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు.

2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ ముమ్మిడివరం శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన గుత్తుల వెంకట సాయి శ్రీనివాస రావు పైన 29,538 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన పొన్నాడ వెంకట సతీష్ కుమార్ చేతిలో 5,547 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరపున ముమ్మిడివరం నియోజకవర్గానికి గాను ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పైన 38,736 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి రెండో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

సుబ్బరాజు గారు తెలుగుదేశం పార్టీ తరపున ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు పోటీ చేయగా, అందులో అందులో రెండుసార్లు ఘనవిజయం సాధించారు. మిగతా ఒకసారి పరాజయం పాలయ్యారు.

ముమ్మిడివరం శాసనసభ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 38,736 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ విప్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Kothapeta MLA 2024 | పూర్తి జాబితా

Kothapeta MLA 2024 Bandaru Satyananda Rao
కొత్తపేట ఎమ్మెల్యే 2024 బండారు సత్యానందరావు | Kothapeta MLA 2024 Bandaru Satyananda Rao (Source : Facebook)

కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు.

1989 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

1989 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కొత్తపేట నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన చీర్ల రెడ్డి చేతిలో 12,355 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

1994 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తపేట నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన చీర్ల రెడ్డి పైన 15,541 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

అనంతరం 1999 శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో కొత్తపేట నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన చీర్ల రెడ్డి పైన 16,113 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

2004 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున కొత్తపేట నియోజక వర్గం నుంచి నాలుగో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన చీర్ల జగ్గిరెడ్డి చేతిలో 2,271 అతి తక్కువ ఓట్ల తేడాతో పరాజయం చెందారు.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలోకి చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున కొత్తపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన చీర్ల జగ్గిరెడ్డి పైన 2,470 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

2014 సంవత్సరంలో తిరిగి ఆయన టిడిపి పార్టీలో చేరారు. 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కొత్తపేట నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన చీర్ల జగ్గిరెడ్డి చేతిలో 713 అతి తక్కువ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తపేట నియోజక వర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన చీర్ల జగ్గిరెడ్డి చేతిలో 4,038 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో కొత్తపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన చీర్ల జగ్గిరెడ్డి పైన 56,479 ఓట్ల అతిపెద్ద భారీ మెజారిటీతో గెలిచి నాలుగోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

బండారు సత్యానందరావు గారు కొత్తపేట నియోజకవర్గం నుంచి 8 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా, అందులో మూడుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున, మిగతా ఒకసారి ప్రజారాజ్యం పార్టీ తరపున విజయం సాధించారు.

అంతేకాకుండా కొత్తపేట శాసనసభ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 56,479 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన రికార్డు సృష్టించారు.

Gannavaram MLA 2024 | పూర్తి జాబితా

Gannavaram MLA 2024 Giddi Satyanarayana
గన్నవరం ఎమ్మెల్యే 2024 గిడ్డి సత్యనారాయణ | Gannavaram MLA 2024 Giddi Satyanarayana (Source : Facebook)

గన్నవరం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. గిడ్డి సత్యనారాయణ గారు జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆయన ఎటువంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం నుంచి వచ్చారు.

రాజకీయాల్లో ఆయనకు ఆసక్తి ఉండటంతో 2024 సంవత్సరంలో జనసేన పార్టీలో చేరారు. 2024 శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ ఆయనకు గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

East Godavari District MLA List 2024
East Godavari District MLA List 2024 | తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో గన్నవరం నియోజకవర్గం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన విప్పర్తి వేణుగోపాల్ పైన 33,367 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.

అంతేకాకుండా గన్నవరం నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 33,367 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా ఒక అరుదైన రికార్డుని సృష్టించారు.

Comparison Table 2024

ConstituencyWinnerRunnerMargin
Amalapuram (SC)Aithabathula Ananda RaoPinipe Viswarup38,628
RamachandrapuramVasamsetti SubhashPilli Surya Prakash26,291
Razole (SC)Deva VaraprasadGollapalli Surya Rao39,011
MummidivaramDatla SubbarajuPonnada Venkata Satish Kumar38,736
KothapetaBandaru Satyananda RaoChirla Jaggi Reddy56,479
Gannavaram (SC)Giddi SatyanarayanaVipparthi Venugopal33,367

ఆధారాలు (Source): పై పట్టికలోని అభ్యర్థుల మెజారిటీలు మరియు ఎన్నికల ఫలితాల వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా ఇవ్వబడినవి.

Previous Election Comparison ( 2019 VS 2024 )

2019 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో భాగంగా కోనసీమ జిల్లాకు సంబంధించిన ఆరు నియోజకవర్గాలలో, ఐదు స్థానాల్లో వైకాపా కైవసం చేసుకోగా, ఒక్క రాజోలు స్థానాన్ని జనసేన పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కించుకోలేకపోయింది.

2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో కోనసీమ జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టించింది. నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోగా, మిగతా రెండు స్థానాల్లో జనసేన పార్టీ సొంతం చేసుకుంది. వైకాపా తన పట్టును పూర్తిగా కోల్పోయి, ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కించుకోలేకపోయింది.

Alliance Impact 2024

2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో కోనసీమ జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి ఓట్ల చీలికను అరికట్టడమే కాకుండా, రికార్డు స్థాయిలో మెజారిటీలు రావడానికి కీలక పాత్ర పోషించింది. కోనసీమ జిల్లా యువత మరియు తటస్థ ఓటర్లు ఎన్డీయే కూటమి వైపు మొగ్గు చూపారు.

ముగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో భాగంగా కోనసీమ జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. వైకాపా మాత్రం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేక పోయింది.

ముఖ్య గమనిక (Disclaimer & Credits) :

సమాచార సేకరణ : ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం మరియు ఫోటోలు కేవలం పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మరియు విద్యా ప్రయోజనాల (Informational and Educational Purposes) కోసం మాత్రమే సేకరించబడినవి.

ఫోటో సౌజన్యం : ఇందులో ఉపయోగించిన చిత్రాలు సంబంధిత ఎమ్మెల్యేల అధికారిక Facebook/Social Media ఖాతాల నుండి సేకరించబడినవి. వీటిపై పూర్తి హక్కులు ఆయా వ్యక్తులకు మాత్రమే ఉంటాయి.

మా ఉద్దేశ్యం : ఎటువంటి కాపీరైట్ నియమాలను ఉల్లంఘించడం మా ఉద్దేశ్యం కాదు. కేవలం పాఠకులకు లేటెస్ట్ సమాచారాన్ని అందించడమే UU News లక్ష్యం.

తరచుగా అడిగే ప్రశ్నలు

కోనసీమ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి 2024?

కోనసీమ జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి.

కోనసీమ జిల్లాలోని నియోజకవర్గాల పేర్లు 2024?

అమలాపురం, రామచంద్రపురం, రాజోలు, ముమ్మిడివరం, కొత్తపేట మరియు గన్నవరం

కోనసీమ జిల్లాలో టిడిపి పార్టీ గెలిచిన నియోజకవర్గాలు ఎన్ని 2024?

టిడిపి 4 నియోజకవర్గాల్లో గెలిచింది.

కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ గెలిచిన నియోజకవర్గాలు ఎన్ని 2024?

జనసేన పార్టీ రెండు నియోజకవర్గాల్లో గెలిచింది.

అమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

అయితాబత్తుల ఆనందరావు ( టిడిపి పార్టీ )

రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

వాసంశెట్టి సుభాష్ ( టిడిపి పార్టీ)

రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

దేవ వరప్రసాద్ ( జనసేన పార్టీ )

ముమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

దాట్ల సుబ్బరాజు ( టిడిపి పార్టీ )

కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

బండారు సత్యానందరావు ( టిడిపి పార్టీ )

గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

గిడ్డి సత్యనారాయణ ( జనసేన పార్టీ )

Leave a Comment