East Godavari District MLA List 2024 | 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో గెలుపొందిన తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితాను తెలుసుకుందాం.
East Godavari District MLA List 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెద్ద జిల్లాలలో తూర్పుగోదావరి జిల్లా ఒకటి. 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో భాగంగా గెలుపొందిన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల పేర్లు ఎమ్మెల్యేల పేర్లు మరియు పార్టీ పేర్లు యొక్క పూర్తి వివరాలు కింద ఇచ్చిన పట్టిక లో చూడవచ్చు.
| S.NO. | MLA Name | Constituency | Party Name |
| 1 | Bathula Balaramakrishna | Rajanagaram | JSP |
| 2 | Gorantla Butchaiah Chowdary | Rajahmundry Rural | TDP |
| 3 | Nallamilli Ramakrishna Reddy | Anaparthy | BJP |
| 4 | Adireddy Srinivas | Rajahmundry City | TDP |
| 5 | Kandula Durgesh | Nidadavole | JSP |
| 6 | Maddipati Venkata Raju | Gopalapuram (SC) | TDP |
| 7 | Muppidi Venkateswara Rao | Kovvur (SC) | TDP |
| 8 | V. Jogeswara Rao | Mandapeta | TDP |
Source: ఈ పట్టికలోని వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా సేకరించబడినవి.
Rajanagaram MLA 2024 | పూర్తి జాబితా

రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు వైకాపా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆయన సతీమణి వైకాపా పార్టీ తరపున ఎంపీటీసీ సభ్యురాలిగా గెలవడంలో బలరామకృష్ణ గారి పాత్ర కీలకం. ఆ తర్వాత వైకాపా పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.
వైకాపా పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో భాగంగా ఆయనకు జనసేన పార్టీ రాజానగరం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో రాజానగరం నియోజకవర్గానికి గాను జనసేన పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన జక్కంపూడి రాజా పైన 34,049 ఓట్ల మెజారిటీతో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు.
అంతేకాకుండా 2024 శాసనసభ ఎన్నికలలో జనసేన పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో బలరామకృష్ణ గారు ఒకరు.
రాజానగరం నియోజకవర్గం చరిత్రలో 34,049 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా బలరామకృష్ణ గారు రికార్డు సృష్టించారు.
Rajahmundry Rural MLA 2024 | పూర్తి జాబితా

రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. తెలుగుదేశం పార్టీ స్థాపకులు ఎన్టీ రామారావు గారి అత్యంత సన్నిహితుడు. ఆయన అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. రాజమండ్రి నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న నాయకుడు. 1983 శాసనసభ ఎన్నికలలో ఆయనకు టిడిపి పార్టీ రాజమండ్రి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
1983 శాసనసభ ఎన్నికలలో రాజమండ్రి నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన చల్లా అప్పారావు పైన 37,351 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఆ తర్వాత 1985 శాసనసభ ఎన్నికలలో మళ్లీ రాజమండ్రి నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏసివై రెడ్డి పైన 7,239 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
1989 శాసనసభ ఎన్నికలలో రాజమండ్రి నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా టిడిపి పార్టీ తరపున పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏసివై రెడ్డి చేతిలో 13,142 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.
అనంతరం మళ్లీ 1994 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున అదే రాజమండ్రి నియోజకవర్గం నుంచి నాలుగో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉండవల్లి అరుణ్ కుమార్ పైన 6,620 ఓట్ల మెజార్టీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
1996 ఎన్నికలలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎంపీగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన చిట్టూరి రవీంద్ర చేతిలో 2,31,162 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.
1999 శాసనసభ ఎన్నికల్లో మళ్లీ రాజమండ్రి నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ తరపున ఐదోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉండవల్లి అరుణ్ కుమార్ పైన 23,027 ఓట్ల మెజారిటీతో గెలిచి నాలుగో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.
2004 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున రాజమండ్రి నియోజకవర్గానికి గాను ఆరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన రౌతు సూర్యప్రకాశరావు చేతిలో 7,554 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
అనంతరం 2009 శాసనసభ ఎన్నికలలో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఏడో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన రౌతు సూర్యప్రకాశరావు చేతిలో 1284 అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఆ తర్వాత 2014 శాసనసభ ఎన్నికలలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన ఆకుల వీర్రాజు పైన 18,058 ఓట్ల మెజారిటీతో గెలిచి ఐదోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2019 శాసనసభ ఎన్నికల్లోనూ మళ్ళీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన ఆకుల వీర్రాజు పైన 10,404 ఓట్ల మెజారిటీతో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
2024 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున అదే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పైన 64,090 అతి పెద్ద భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు.
ఆయన రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టించారు. అంతేకాకుండా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే గా కూడా అరుదైన రికార్డు సృష్టించారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు టిడిపి పార్టీ తరపున పదిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అందులో ఏడు సర్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకులు అంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
Anaparthy MLA 2024 | పూర్తి జాబితా

అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిది రాజకీయ నేపథ్యం గల కుటుంబం. ఆయన తండ్రి నల్లమిల్లి మూలా రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు అనపర్తి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
తండ్రిగారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారానే రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2014 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆయనకు అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2014 శాసనసభ ఎన్నికలలో అనపర్తి నియోజకవర్గానికి గాను టిడిపి పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పైన 1373 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.
2019 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున అనపర్తి నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి చేతిలో 55,207 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.
అనంతరం 2024 శాసనసభ ఎన్నికలలో టిడిపి జనసేన బిజెపి పార్టీలు ఎన్డీయే కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేయడం వలన అనపర్తి నియోజకవర్గం బిజెపికి ఇవ్వడం జరిగింది. అందుకని రామకృష్ణారెడ్డి గారు బిజెపి పార్టీలో చేరారు.
2024 శాసనసభ ఎన్నికలలో బిజెపి పార్టీ తరపున మళ్లీ అదే అనపర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పైన 20,850 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి గారు మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రెండు సార్లు విజయం సాధించి ఒకసారి ఓడిపోయారు. అందులో టిడిపి పార్టీ తరపున ఒకసారి బిజెపి పార్టీ తరపున ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
Rajahmundry City MLA 2024 | పూర్తి జాబితా

రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2019 శాసనసభ ఎన్నికల్లో ఆయన భార్య ఆదిరెడ్డి భవాని గారికి టిడిపి పార్టీ రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2019 శాసనసభ ఎన్నికలలో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ తరపున ఆదిరెడ్డి భవాని గారు మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన రౌతు సూర్యప్రకాశరావు పైన 30,065 ఓట్ల మెజార్టీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయింది.
భవాని గారు 2019 ఎన్నికల్లో గెలవడంలో శ్రీనివాస్ గారు కీలక పాత్ర వహించారు. అంతేకాకుండా ఆమెకు సపోర్టుగా నిలబడ్డారు.
2024 శాసనసభ ఎన్నికలలో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి టిడిపి పార్టీ రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 శాసనసభ ఎన్నికలలో రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన మార్గాని భరత్ పైన 71,404 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.
రాజమండ్రి సిటీ నియోజకవర్గం చరిత్రలో 71,404 ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గారు రికార్డు సృష్టించారు. అంతేకాకుండా మొదటిసారి ఎమ్మెల్యే గానే ఇంత భారీ మెజారిటీతో గెలిచి మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.
Nidadavole MLA 2024 | పూర్తి జాబితా

నిడదవోలు నియోజకవర్గం ఎమ్మెల్యే కందుల దుర్గేష్ గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గా కూడా పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడిగా మరియు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.
అనంతరం ఆయన 2014 ఎన్నికలలో రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మొదటిసారి ఎంపీగా పోటీ చేసి కేవలం 21,243 ఓట్లు మాత్రమే నమోదు అయ్యాయి. టిడిపి మరియు వైకాపా పార్టీకి గట్టి పోటీ ఉండటంతో ఆయన ఎంపీగా గెలవలేకపోయారు.
ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి వైకాపా పార్టీలో చేరారు. వైకాపా పార్టీలో కొన్నాళ్లపాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం ఆయన వైకాపా పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు.
2019 శాసనసభ ఎన్నికల్లో ఆయనకు జనసేన పార్టీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2019 శాసనసభ ఎన్నికలలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి టిడిపి పార్టీకి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతిలో 31,481 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.
ఆ తర్వాత 2024 శాసనసభ ఎన్నికలలో నిడదవోలు నియోజకవర్గం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన గడ్డం శ్రీనివాస నాయుడు పైన 33,304 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.
కందుల దుర్గేష్ జనసేన పార్టీ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒకసారి విజయం సాధించి మరోసారి పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతానికి ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Gopalapuram MLA 2024 | పూర్తి జాబితా

గోపాలపురం ఎస్సీ క్యాస్ట్ రిజర్వుడు నియోజకవర్గం. గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు.
2014 మరియు 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవి ఆశించిన దక్కలేదు. అయిన ఆయన ఎక్కడ నిరాశ పడలేదు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే ఉన్నారు.
టిడిపి పార్టీ ఆయన సేవలను గుర్తించి 2024 శాసనసభ ఎన్నికలలో గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 శాసనసభ ఎన్నికలలో గోపాలపురం నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన తానేటి వనిత పైన 26,784 ఓట్ల మెజార్టీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
Kovvur MLA 2024 | పూర్తి జాబితా

కొవ్వూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. కొవ్వూరు నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు.
2014 శాసనసభ ఎన్నికల్లో ఆయనకు టిడిపి పార్టీ గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2014 శాసనసభ ఎన్నికలలో టిడిపి పార్టీ తరపున గోపాలపురం నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన తలారి వెంకట్ రావు పైన 11,540 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
అనంతరం 2019 శాసనసభ ఎన్నికలలో గోపాలపురం నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన తలారి వెంకట్ రావు చేతిలో 37,461 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.
2024 ఎన్నికలలో టిడిపి పార్టీ ఆయనకు కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. 2024 శాసనసభ ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన తలారి వెంకట్ రావు పైన 33,946 ఓట్ల మెజారిటీతో గెలిచి భారీ విజయం సాధించారు.
Mandapeta MLA 2024 | పూర్తి జాబితా

మండపేట నియోజకవర్గం గతంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండేది. ప్రజల కోరిక మేరకు 2025 సంవత్సరంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాలో చేర్చడం జరిగింది. కావున ప్రస్తుతానికి మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా కిందికి వస్తుంది.
మండపేట నియోజకవర్గం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర రావు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2004 శాసనసభ ఎన్నికల్లో ఆయనకు టిడిపి పార్టీ అలమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2004 శాసనసభ ఎన్నికలలో అలమూరు నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన కృష్ణార్జున చౌదరి చేతిలో 8,120 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.
2009 శాసనసభ ఎన్నికలలో మండపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీకి చెందిన వివిఎస్ఎస్ చౌదరి పైన 17,440 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఆ తర్వాత 2014 శాసనసభ ఎన్నికల్లో మళ్లీ మండపేట నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన జివి స్వామి నాయుడు పైన 36,014 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
అనంతరం 2019 శాసనసభ ఎన్నికలలో టిడిపి పార్టీ తరపున మళ్లీ అదే మండపేట నియోజకవర్గానికి గాను ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ పైన 10,600 ఓట్ల మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు బద్దలు కొట్టారు.
2024 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున మండపేట నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన తోట త్రిమూర్తులు పైన 44,434 ఓట్ల మెజారిటీతో నాలుగో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీ కి ఎన్నికయ్యారు.
జోగేశ్వర రావు గారు తెలుగుదేశం పార్టీ తరపున ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అందులో నాలుగుసార్లు ఘనవిజయం సాధించారు. ఒకసారి పరాజయం పాలయ్యారు. అంతేకాకుండా మండపేట నియోజకవర్గం చరిత్రలో 44,434 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డును సొంతం చేసుకున్నాడు.
Comparison Table 2024
| Constituency | Winner | Runner | Margin |
| Rajanagaram | Bathula Balaramakrishna | Jakkampudi Raja | 34,049 |
| Rajahmundry Rural | Gorantla Butchaiah Chowdary | Chelluboyina Venugopala Krishna | 64,090 |
| Anaparthy | Nallamilli Ramakrishna Reddy | Dr. Sathi Suryanarayana Reddy | 20,850 |
| Rajahmundry City | Adireddy Srinivas | Margani Bharat | 71,404 |
| Nidadavole | Kandula Durgesh | Geddam Srinivas Naidu | 33,304 |
| Gopalapuram | Maddipati Venkata Raju | Taneti Vanitha | 26,784 |
| Kovvur | Muppidi Venkateswara Rao | Talari Venkat Rao | 33,946 |
| Mandapeta | V. Jogeswara Rao | Thota Trimurthulu | 44,434 |
ఆధారాలు (Source): పై పట్టికలోని అభ్యర్థుల మెజారిటీలు మరియు ఎన్నికల ఫలితాల వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా ఇవ్వబడినవి.
Previous Election Comparison ( 2019 VS 2024 )
2019 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాలు వైకాపా పార్టీ గెలిచింది. మిగతా మూడు నియోజకవర్గాలు టిడిపి పార్టీ కైవసం చేసుకుంది.
2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన 8 నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసింది. అందులో టిడిపి పార్టీ ఐదు నియోజకవర్గాలు, జనసేన పార్టీ రెండు నియోజకవర్గాలు మరియు బిజెపి పార్టీ ఒక నియోజకవర్గం. వైకాపా పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేక పోయింది.
Alliance Impact 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో ఎన్డీయే కూటమి ప్రభావం గట్టిగా ఉండటంతో తూర్పుగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఎన్డీయే కూటమి టిడిపి జనసేన బిజెపి పొత్తుగా ఏర్పడి పోటీ చేసి ఘనవిజయం సాధించారు.
ఎన్డీయే కూటమి ప్రభావం ఉన్న, తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రభావం మరియు ఓటర్లు సైతం కూటమి వైపు మొగ్గు చూపారు. అందువలన తూర్పుగోదావరి జిల్లాలో ఇంతటి భారీ విజయాన్ని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది.
ముగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఎనిమిది నియోజకవర్గంలోని ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసి సంచలన రికార్డ్ సృష్టించింది. ఐదు సీట్లు టీడీపీ పార్టీ, రెండు సీట్లు జనసేన పార్టీ, మిగతా ఒక సీటు బిజెపి పార్టీ కైవసం చేసుకుంది. వైకాపా పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కలేదు.
ముఖ్య గమనిక (Disclaimer & Credits) :
సమాచార సేకరణ : ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం మరియు ఫోటోలు కేవలం పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మరియు విద్యా ప్రయోజనాల (Informational and Educational Purposes) కోసం మాత్రమే సేకరించబడినవి.
ఫోటో సౌజన్యం : ఇందులో ఉపయోగించిన చిత్రాలు సంబంధిత ఎమ్మెల్యేల అధికారిక Facebook/Social Media ఖాతాల నుండి సేకరించబడినవి. వీటిపై పూర్తి హక్కులు ఆయా వ్యక్తులకు మాత్రమే ఉంటాయి.
మా ఉద్దేశ్యం : ఎటువంటి కాపీరైట్ నియమాలను ఉల్లంఘించడం మా ఉద్దేశ్యం కాదు. కేవలం పాఠకులకు లేటెస్ట్ సమాచారాన్ని అందించడమే UU News లక్ష్యం.
తరచుగా అడిగే ప్రశ్నలు
తూర్పుగోదావరి జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి?
తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి.
తూర్పుగోదావరి జిల్లాలో టిడిపి పార్టీ గెలిచిన నియోజకవర్గాలు ఎన్ని 2024?
తూర్పుగోదావరి జిల్లాలో టిడిపి పార్టీ ఐదు నియోజకవర్గాల్లో గెలిచింది.
తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ గెలిచిన నియోజకవర్గాలు ఎన్ని 2024?
తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ రెండు నియోజకవర్గాల్లో గెలిచింది.
రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
బత్తుల బలరామకృష్ణ ( జనసేన పార్టీ )
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( టిడిపి పార్టీ )
అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి ( బిజెపి పార్టీ )
రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
ఆదిరెడ్డి శ్రీనివాస్ ( టిడిపి పార్టీ )
నిడదవోలు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
కందుల దుర్గేష్ ( జనసేన పార్టీ )
గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
మద్దిపాటి వెంకట రాజు ( టిడిపి పార్టీ )
కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
ముప్పిడి వెంకటేశ్వర రావు ( టిడిపి పార్టీ )
మండపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
వేగుళ్ల జోగేశ్వర రావు ( టిడిపి పార్టీ )
