Kakinada District MLA List 2024 ( Latest Update ) | కాకినాడ జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

Kakinada District MLA List 2024 | 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో గెలుపొందిన కాకినాడ జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితాను తెలుసుకుందాం.

Table of Contents

Kakinada District MLA List 2024

2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గెలిచిన కాకినాడ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ, ప్రస్తుతానికి కూడా తమ పదవుల్లో కొనసాగుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో మొత్తం ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 వ సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో భాగంగా గెలుపొందిన కాకినాడ జిల్లా ఎమ్మెల్యేల పేర్లు, నియోజకవర్గాల పేర్లు మరియు పార్టీ పేర్లను ఇక్కడ చూడండి.

S.NO.MLA NameConstituencyParty Name
1Vanamadi Venkateswara RaoKakinada CityTDP
2Yanamala DivyaTuniTDP
3Jyothula NehruJaggampetaTDP
4Pantham Venkateswara RaoKakinada RuralJSP
5Varupula SatyaprabhaPrathipaduTDP
6Nimmakayala ChinarajappaPeddapuramTDP
7Pawan Kalyan PithapuramJSP

Source: ఈ పట్టికలోని వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా సేకరించబడినవి.

Kakinada City MLA 2024 | పూర్తి జాబితా

Kakinada City MLA 2024 Vanamadi Venkateswara Rao
కాకినాడ సిటీ ఎమ్మెల్యే 2024 వనమాడి వెంకటేశ్వరరావు | Kakinada City MLA 2024 Vanamadi Venkateswara Rao (Source : Facebook)

కాకినాడ సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు రాజకీయ అనుభవజ్ఞుడు.

ఆయన తెలుగుదేశం పార్టీని ఎన్నడూ వీడలేదు. ఆయనకు తెలుగుదేశం పార్టీ 1999 శాసనసభ ఎన్నికలలో కాకినాడ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

1999 శాసనసభ ఎన్నికలలో కాకినాడ నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లిపూడి మంగపతి పైన 4,506 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.

2004 అసెంబ్లీ ఎన్నికలలో కాకినాడ నియోజకవర్గం నుంచి టిడిపి తరపున వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముత్త గోపాలకృష్ణ చేతిలో 33,446 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

2009 శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో కాకినాడ సిటీ నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈసారి కేవలం 25,636 ఓట్లు మాత్రమే నమోదు అయ్యాయి. ఎందుకంటే 2009 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ప్రజా రాజ్యం పార్టీ మధ్య గట్టి పోటీ ఉండడంతో తెలుగుదేశం పార్టీకి ఓట్లు తగ్గాయి.

2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాకినాడ సిటీ నియోజకవర్గానికి గాను టిడిపి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పైన 24,000 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి చేతిలో 14,111 ఓట్ల తేడాతో పరాజయం చెందారు.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి టిడిపి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పైన 56,572 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు.

కాకినాడ సిటీ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 56,572 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన రికార్డ్ సృష్టించారు.

Tuni MLA 2024 | పూర్తి జాబితా

Tuni MLA 2024 Yanamala Divya
తుని ఎమ్మెల్యే 2024 యనమల దివ్య | Tuni MLA 2024 Yanamala Divya (Source : Facebook)

తుని నియోజకవర్గం ఎమ్మెల్యే యనమల దివ్య గారిది రాజకీయ నేపథ్యం గల కుటుంబం. ఆమె తండ్రి గారు యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ అంచెలంచెలుగా ఎదిగి తెలుగుదేశం పార్టీ మంత్రివర్గంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

యనమల రామకృష్ణుడు గారు తెలుగుదేశం పార్టీ తరపున తుని నియోజకవర్గం నుంచి 1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి డబల్ హ్యాట్రిక్ రికార్డు సాధించిన ఎమ్మెల్యేగా సంచలన రికార్డ్ సృష్టించారు. ఆయన శాసనసభ స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

ఆయన తుని నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున 2009, 2014 మరియు 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యారు.

ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ యనమల దివ్య గారు రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమె తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. 2024 శాసనసభ ఎన్నికలలో టిడిపి ఆమెకు తుని నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో తుని నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన దాడి శెట్టి రాజా పైన 15,177 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయింది.

ఆమె కూడా వాళ్ళ నాన్న గారి మాదిరే పోటీ చేసిన మొదటి సారే ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సృష్టించింది. దివ్య గారు మరియు యనమల రామకృష్ణుడు గారు ఇద్దరు టిడిపి పార్టీ నుంచే మొదటిసారి ఎమ్మెల్యేలు కావడం విశేషం.

తుని శాసనసభ నియోజకవర్గంలో 2004 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది. ఆ తర్వాత 2009, 2014 మరియు 2019 ఎన్నికలలో టిడిపి గెలవలేదు. 2004 తర్వాత 2024 లో గెలిచారు అంటే దాదాపు 20 ఏళ్ల గ్యాప్ తర్వాత, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో యనమల దివ్య గారి గెలుపుతో తెలుగుదేశం పార్టీ జెండా జయకేతనం ఎగురవేసింది.

Jaggampeta MLA 2024 | పూర్తి జాబితా

Jaggampeta MLA 2024 Jyothula Nehru
జగ్గంపేట ఎమ్మెల్యే 2024 జ్యోతుల నెహ్రూ | Jaggampeta MLA 2024 Jyothula Nehru (Source : Facebook)

జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన సీనియర్ రాజకీయ అనుభవజ్ఞుడు. ఆయనకు 1994 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

1994 శాసనసభ ఎన్నికలలో జగ్గంపేట నియోజకవర్గానికి గాను టిడిపి తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన తోట వెంకట చలం పైన 20,301 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

1999 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో జగ్గంపేట నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన తోట వెంకట చలం పైన 9,814 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

2004 శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో ముచ్చటగా మూడో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన తోట నరసింహం చేతిలో 2,643 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

2009 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలోకి చేరారు. 2009 శాసనసభ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన తోట నరసింహం చేతిలో 789 అతి తక్కువ ఓట్ల తేడాతో పరాజయం చెందారు.

అనంతరం 2014 ఎన్నికలలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 శాసనసభ ఎన్నికల్లో వైకాపా ఆయనకు జగ్గంపేట శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

West Godavari District MLA List 2024
West Godavari District MLA List 2024 (Latest Update ) | పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుంచి వైకాపా తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన జ్యోతుల చంటి బాబు పైన 15,932 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

ఆయన 2019 లో వైకాపాను వీడి తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 శాసనసభ ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన జ్యోతుల చంటి బాబు చేతిలో 23,365 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో జగ్గంపేట నియోజకవర్గం నుంచి టిడిపి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన తోట నరసింహం పైన 52,676 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి నాలుగో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

జ్యోతుల నెహ్రూ ఏడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, అందులో నాలుగు సార్లు విజయం సాధించారు. మూడుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించగా, మిగతా ఒకసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలవడం విశేషం.

జగ్గంపేట శాసనసభ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 52,676 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన ఒక అరుదైన రికార్డుని తన సొంతం చేసుకున్నారు.

Kakinada Rural MLA 2024 | పూర్తి జాబితా

Kakinada Rural MLA 2024 Pantham Venkateswara Rao
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే 2024 పంతం వెంకటేశ్వరరావు | Kakinada Rural MLA 2024 Pantham Venkateswara Rao (Source : Facebook)

కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. 2019 శాసనసభ ఎన్నికల్లో ఆయనకు జనసేన పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గానికి గాను జనసేన పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం 40,001 ఓట్లు నమోదు అయ్యాయి. 2019 ఎన్నికలలో టిడిపి వర్సెస్ వైకాపా మధ్య గట్టి పోటీ ఉండడంతో, ఆ ఎన్నికల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కురసాల కన్నబాబు పైన 74,086 అతి పెద్ద భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

కాకినాడ రూరల్ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 74,086 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన రికార్డ్ సృష్టించారు.

Prathipadu MLA 2024 | పూర్తి జాబితా

Prathipadu MLA 2024 Varupula Satyaprabha
ప్రత్తిపాడు ఎమ్మెల్యే 2024 వరుపుల సత్యప్రభ | Prathipadu MLA 2024 Varupula Satyaprabha (Source : Facebook)

ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె భర్త వరుపుల రాజా 2019 శాసనసభ ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ చేతిలో 4,666 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

ఆయన 2023 సంవత్సరంలో గుండెపోటుతో మరణించారు. వరుపుల రాజా గారి మరణాంతరం ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2024 శాసనసభ ఎన్నికల్లో ఆమెకు తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన వరుపుల సుబ్బారావు పైన 38,768 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.

Peddapuram MLA 2024 | పూర్తి జాబితా

Peddapuram MLA 2024 Nimmakayala Chinarajappa
పెద్దాపురం ఎమ్మెల్యే 2024 నిమ్మకాయల చిన్న రాజప్ప | Peddapuram MLA 2024 Nimmakayala Chinarajappa (Source : Facebook)

పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్ప తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలో కొనసాగుతూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఆయన 2007 నుంచి 2013 సంవత్సరం వరకు శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయనకు తెలుగుదేశం పార్టీ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పెద్దాపురం నియోజకవర్గానికి గాను టిడిపి పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన తోట సుబ్బారావు నాయుడు పైన 10,663 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి తరపున పెద్దాపురం నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన తోట వాణి పైన 4,027 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన దవులూరి దొరబాబు పైన 40,451 ఓట్ల అతిపెద్ద భారీ మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టించారు.

ఆయన తెలుగుదేశం పార్టీ తరపున పెద్దాపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

అంతేకాకుండా పెద్దాపురం నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 40,451 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డు ఆయన పేరిట ఉంది.

Pithapuram MLA 2024 | పూర్తి జాబితా

Pithapuram MLA 2024 Pawan Kalyan
పిఠాపురం ఎమ్మెల్యే 2024 పవన్ కళ్యాణ్ | Pithapuram MLA 2024 Pawan Kalyan (Source : Facebook)

పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ సుపరిచితమే. అటు సినిమాల్లో పవర్ స్టార్ గా, ఇటు రాజకీయాల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఆయన 2008 సంవత్సరంలో ప్రజా రాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన అప్పట్లో ప్రజా రాజ్యం పార్టీ తరపున పలు ఊర్లు తిరిగి రాజకీయ ప్రచారం కూడా చేశారు.

2014 సంవత్సరంలో జనసేన పార్టీ పేరుతో ఆయన రాజకీయ పార్టీని పెట్టారు. ఆయన జనసేన పార్టీ వ్యవస్థాపకుడు. 2014 శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం మరియు బిజెపి పార్టీకి ఆయన సపోర్టర్ గా నిలిచారు.

2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆయన మొదటి సారి ఎమ్మెల్యేగా గాజువాక నియోజకవర్గం మరియు భీమవరం నియోజకవర్గంలో పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో జనసేన పార్టీ 140 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. 140 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు జనసేన పార్టీ గెలిచింది.

2019 శాసనసభ ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గానికి గాను జనసేన పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన గ్రంధి శ్రీనివాస్ చేతిలో 8,357 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

ఆ ఎన్నికల్లోనే గాజువాక నియోజకవర్గం నుంచి కూడా జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, కేవలం 58,539 ఓట్లు మాత్రమే నమోదు అయ్యాయి. వైసిపి వర్సెస్ టిడిపి మధ్య గట్టి పోటీ ఉండటంతో, ఆయన ఆ ఎన్నికలలో మూడవ స్థానానికే పరిమితమయ్యారు.

East Godavari District MLA List 2024
East Godavari District MLA List 2024 | తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

2024 శాసనసభ ఎన్నికలలో టిడిపి బిజెపి మరియు జనసేన పొత్తుగా ఏర్పాటై, ఎన్డీయే కూటమిగా కలిసి పోటీ చేసింది. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అలాగే జనసేన పార్టీ 21 శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేసింది. అదేవిధంగా 2 లోక్ సభ నియోజకవర్గాల్లోనూ పోటీ చేసింది.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన వంగా గీత గారి పైన 70,279 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

పిఠాపురం శాసనసభ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 70,279 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన సంచలన రికార్డుని సృష్టించారు.

జనసేన పార్టీ 2024 ఎన్నికలలో 21 శాసనసభ నియోజకవర్గాలు మరియు 2 లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేసి, అన్ని చోట్ల విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ తో సరికొత్త రికార్డు సృష్టించింది.

పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గాను మరియు పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Comparison Table 2024

ConstituencyWinnerRunnerMargin
Kakinada CityVanamadi Venkateswara RaoDwarampudi Chandrasekhar Reddy56,572
TuniYanamala DivyaDadisetty Raja15,177
JaggampetaJyothula NehruThota Narasimham52,676
Kakinada RuralPantham Venkateswara RaoKurasala Kannababu74,086
PrathipaduVarupula SatyaprabhaVarupula Subbarao38,768
PeddapuramNimmakayala ChinarajappaDavuluri Dorababu40,451
PithapuramPawan KalyanVanga Geetha Viswanath70,279

ఆధారాలు (Source): పై పట్టికలోని అభ్యర్థుల మెజారిటీలు మరియు ఎన్నికల ఫలితాల వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా ఇవ్వబడినవి.

Previous Election Comparison ( 2019 VS 2024 )

2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలలో కాకినాడ జిల్లాకు సంబంధించిన ఏడు నియోజకవర్గాల్లో వైకాపా ఆరు స్థానాల్లో కైవసం చేసుకోగా, తెలుగుదేశం పార్టీ ఒక్క స్థానానికే పరిమితమైంది.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తలకిందులయ్యాయి. కాకినాడ జిల్లాకు సంబంధించిన ఏడు నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసి ప్రభంజనం సృష్టిస్తే, వైకాపా ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది.

Alliance Impact 2024

2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో భాగంగా కాకినాడ జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి ప్రభావం చూపింది. అలానే కాకినాడ జిల్లా యువత మరియు తటస్థ ఓటర్లు కూడా ఎన్డీయే కూటమి వైపే మొగ్గు చూపారు.

ఎన్డీయే కూటమి ప్రభావానికి కాకినాడ రూరల్ మరియు పిఠాపురం శాసనసభ నియోజకవర్గాలలో రికార్డు స్థాయిలో మెజారిటీలు నమోదు అయ్యాయి.

ముగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో కాకినాడ జిల్లాకు సంబంధించిన ఏడు నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసి చారిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకుంది. వైకాపా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేక పోయింది. ఏడు నియోజకవర్గాల్లో ఇందులో ఐదు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోగా, మిగిలిన రెండు స్థానాలను జనసేన పార్టీ సొంతం చేసుకుంది.

ముఖ్య గమనిక (Disclaimer & Credits) :

సమాచార సేకరణ : ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం మరియు ఫోటోలు కేవలం పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మరియు విద్యా ప్రయోజనాల (Informational and Educational Purposes) కోసం మాత్రమే సేకరించబడినవి.

ఫోటో సౌజన్యం : ఇందులో ఉపయోగించిన చిత్రాలు సంబంధిత ఎమ్మెల్యేల అధికారిక Facebook/Social Media ఖాతాల నుండి సేకరించబడినవి. వీటిపై పూర్తి హక్కులు ఆయా వ్యక్తులకు మాత్రమే ఉంటాయి.

మా ఉద్దేశ్యం : ఎటువంటి కాపీరైట్ నియమాలను ఉల్లంఘించడం మా ఉద్దేశ్యం కాదు. కేవలం పాఠకులకు లేటెస్ట్ సమాచారాన్ని అందించడమే UU News లక్ష్యం.

తరచుగా అడిగే ప్రశ్నలు

కాకినాడ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి 2024?

కాకినాడ జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి.

కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో గెలిచింది 2024?

కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఐదు నియోజకవర్గాల్లో గెలిచింది.

కాకినాడ జిల్లాలో జనసేన పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో గెలిచింది 2024?

కాకినాడ జిల్లాలో జనసేన పార్టీ రెండు నియోజకవర్గాల్లో గెలిచింది.

కాకినాడ సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

వనమాడి వెంకటేశ్వరరావు ( టిడిపి పార్టీ )

తుని నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

యనమల దివ్య ( టిడిపి పార్టీ )

జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

జ్యోతుల నెహ్రూ ( టిడిపి పార్టీ )

కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

పంతం వెంకటేశ్వరరావు ( జనసేన పార్టీ )

ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

వరుపుల సత్యప్రభ ( టిడిపి పార్టీ )

పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

నిమ్మకాయల చిన్న రాజప్ప ( టిడిపి పార్టీ )

పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

పవన్ కళ్యాణ్ ( జనసేన పార్టీ )

Leave a Comment