West Godavari District MLA List 2024 (Latest Update ) | పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

West Godavari District MLA List 2024 | 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో గెలుపొందిన పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితాను తెలుసుకుందాం.

Table of Contents

West Godavari District MLA List 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో భాగంగా గెలుపొందిన పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల పేర్లు, ఎమ్మెల్యేల పేర్లు మరియు పార్టీ పేర్లను ఇక్కడ చూడండి.

S.NO.MLA NameConstituencyParty Name
1Nimmala Rama Naidu PalakolluTDP
2Pulaparthi RamanjaneyuluBhimavaramJSP
3Pithani SatyanarayanaAchantaTDP
4 Raghu Rama Krishna RajuUndiTDP
5Bolisetti SrinivasTadepalligudemJSP
6Bommidi Narayana NayakarNarasapuramJSP
7Arimilli Radha KrishnaTanukuTDP

Source: ఈ పట్టికలోని వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా సేకరించబడినవి.

Palakollu MLA 2024 | పూర్తి జాబితా

Palakollu MLA 2024 Nimmala Rama Naidu
పాలకొల్లు ఎమ్మెల్యే 2024 నిమ్మల రామానాయుడు | Palakollu MLA 2024 Nimmala Rama Naidu (Source : Facebook)

నిమ్మల రామానాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ సుపరిచితమే. పాలకొల్లు నియోజకవర్గం ప్రజలతో మమేకమై, అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రామానాయుడు గారు ప్రజల నాయకుడు.

పాలకొల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2014 శాసనసభ ఎన్నికలలో భాగంగా ఆయనకు టిడిపి పార్టీ పాలకొల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2014 శాసనసభ ఎన్నికలలో పాలకొల్లు నియోజకవర్గానికి గాను టిడిపి పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన మేక శేషుబాబు పైన 6,383 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

అనంతరం 2019 శాసనసభ ఎన్నికలలో పాలకొల్లు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన సత్యనారాయణ మూర్తి పైన 17,809 ఓట్ల మెజారిటీతో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

ఆ తర్వాత 2024 శాసనసభ ఎన్నికలలో మళ్లీ అదే పాలకొల్లు నియోజకవర్గం నుంచే టిడిపి పార్టీ తరపున ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన గూడల శ్రీ హరి గోపాలరావు పైన 67,945 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టించారు.

నిమ్మల రామానాయుడు గారు పాలకొల్లు నియోజకవర్గం నుంచి మూడుసార్లు వరుసగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి మూడుసార్లు ఘనవిజయం సాధించారు.

అంతేకాకుండా పాలకొల్లు నియోజకవర్గం చరిత్రలో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా రామానాయుడు గారు అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతానికి ఆయన ఆంధ్ర రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Bhimavaram MLA 2024 | పూర్తి జాబితా

Bhimavaram MLA 2024 Pulaparthi Ramanjaneyulu
భీమవరం ఎమ్మెల్యే 2024 పులపర్తి రామాంజనేయులు | Bhimavaram MLA 2024 Pulaparthi Ramanjaneyulu (Source : Facebook)

భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2009 శాసనసభ ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2009 శాసనసభ ఎన్నికలలో భీమవరం నియోజకవర్గానికి గాను కాంగ్రెస్ పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీకి చెందిన వేగేశ్న సూర్యనారాయణ రాజు పైన 22,099 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున భీమవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన గ్రంధి శ్రీనివాస్ పైన 13,726 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.

అనంతరం 2019 శాసనసభ ఎన్నికల్లో టిడిపి పార్టీ తరపున మళ్లీ భీమవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన గ్రంధి శ్రీనివాస్ చేతిలో 16,606 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని వీడి జనసేన పార్టీలోకి చేరారు.

ఆ తర్వాత 2024 శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున అదే భీమవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన గ్రంధి శ్రీనివాస్ పైన 66,974 ఓట్ల అతిపెద్ద భారీ మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఎన్నికయ్యారు.

రామాంజనేయులు గారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అందులో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. ఒకసారి తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు. ఒకసారి జనసేన పార్టీ తరఫున గెలిచారు.

భీమవరం నియోజకవర్గం చరిత్రలో 66,974 ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన రికార్డుని నమోదు చేసుకున్నారు.

Achanta MLA 2024 | పూర్తి జాబితా

Achanta MLA 2024 Pithani Satyanarayana
ఆచంట ఎమ్మెల్యే 2024 పితాని సత్యనారాయణ | Achanta MLA 2024 Pithani Satyanarayana (Source : Facebook)

ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. 2004 శాసనసభ ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2004 శాసనసభ ఎన్నికలలో పెనుగొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి టిడిపి పార్టీకి చెందిన వీర రాఘవేంద్రరావు పైన 18,020 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.

అనంతరం 2009 శాసనసభ ఎన్నికల్లో ఆచంట నియోజకవర్గానికి గాను కాంగ్రెస్ పార్టీ తరపున రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి టిడిపి పార్టీకి చెందిన కర్రీ రాధాకృష్ణా రెడ్డి పైన 15,755 ఓట్ల మెజారిటీతో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఆచంట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన ప్రసాద్ రాజు పైన 3,920 ఓట్ల మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.

2019 శాసనసభ ఎన్నికల్లో అదే ఆచంట నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు చేతిలో 12,886 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.

ఆ తర్వాత 2024 శాసనసభ ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీ తరపున ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు పైన 26,554 ఓట్ల మెజారిటీతో గెలిచి నాలుగోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఎన్నికయ్యారు.

East Godavari District MLA List 2024
East Godavari District MLA List 2024 | తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

పితాని సత్యనారాయణ ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అందులో కాంగ్రెస్ పార్టీ తరపున రెండుసార్లు గెలిచారు. మిగతా రెండుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు.

Undi MLA 2024 | పూర్తి జాబితా

Undi MLA 2024 Raghu Rama Krishna Raju
ఉండి ఎమ్మెల్యే 2024 రఘు రామ కృష్ణ రాజు | Undi MLA 2024 Raghu Rama Krishna Raju (Source : Facebook)

ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘు రామ కృష్ణ రాజు గారు వైకాపా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2014 లోక్ సభ ఎన్నికలలో వైకాపా పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు.

ఆ తర్వాత బిజెపి తెలుగుదేశం అటు ఇటు పార్టీలు మారారు. మళ్లీ 2019 ఎన్నికల్లో వైసిపి పార్టీలో చేరారు. ఆయనకు వైకాపా పార్టీ 2019 ఎన్నికలలో నరసాపురం లోక్ సభ నియోజకవర్గం ఎంపీ టికెట్ ఇచ్చింది.

2019 లోక్ సభ ఎన్నికలలో వైకాపా పార్టీ తరపున నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎంపీగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన వేటుకూరి వెంకట శివరామరాజు గారి పైన 31,909 ఓట్ల మెజారిటీతో మొదటిసారి ఎంపీగా గెలిచారు.

ఆ తర్వాత 2024 సంవత్సరంలో వైసిపి పార్టీతో కొన్ని విభేదాల కారణంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. 2024 శాసనసభ ఎన్నికలలో ఆయనకు టిడిపి పార్టీ ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2024 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున ఉండి నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన నరసింహ రాజు పైన 56,777 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

రఘు రామ కృష్ణ రాజు గారు వైకాపా పార్టీ తరపున ఒకసారి ఎంపీగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ తరపున ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఆయన ఒక అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. అదేంటంటే ఉండి నియోజకవర్గం చరిత్రలో 56,777 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతానికి ఆయన ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Tadepalligudem MLA 2024 | పూర్తి జాబితా

Tadepalligudem MLA 2024  Bolisetti Srinivas
తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే 2024 బోలిశెట్టి శ్రీనివాస్ | Tadepalligudem MLA 2024 Bolisetti Srinivas (Source : Facebook)

తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ గారు యువజన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. కొన్నాళ్లపాటు అక్కడే ఆయన వివిధ హోదాల్లో పని చేశారు. ఆ తర్వాత 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు.

2019 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. 2019 ఎన్నికలలో ఆయనకు జనసేన పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2019 శాసనసభ ఎన్నికలలో తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి గాను జనసేన పార్టీ తరపున మొట్టమొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన కొట్టు సత్యనారాయణ చేతిలో 34,544 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.

2024 శాసనసభ ఎన్నికలలో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన కొట్టు సత్యనారాయణ పైన 62,492 ఓట్ల మెజార్టీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

బొలిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ తరపున వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, అందులో ఒకసారి ఓడిపోయారు. రెండోసారి విజయం సాధించారు.

తాడేపల్లిగూడెం నియోజకవర్గం చరిత్రలో 62,492 ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గారు రికార్డ్ సృష్టించారు.

Narasapuram MLA 2024 | పూర్తి జాబితా

Narasapuram MLA 2024 Bommidi Narayana Nayakar
నరసాపురం ఎమ్మెల్యే 2024 బొమ్మిడి నారాయణ నాయకర్ | Narasapuram MLA 2024 Bommidi Narayana Nayakar (Source : Facebook)

నరసాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2019 ఎన్నికల్లో ఆయనకు జనసేన పార్టీ నరసాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2019 శాసనసభ ఎన్నికలలో నరసాపురం నియోజకవర్గానికి గాను జనసేన పార్టీ తరపున మొట్టమొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన ముదునూరి ప్రసాద్ రాజు చేతిలో 6,436 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.

అనంతరం 2024 శాసనసభ ఎన్నికలలో మళ్ళీ నరసాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన ముదునూరి ప్రసాద్ రాజు పైన 49,738 ఓట్ల మెజారిటీతో మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

బొమ్మిడి నారాయణ జనసేన పార్టీ తరపున వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, అందులో ఒకసారి విజయం సాధించారు. ఒకసారి ఓటమి పాలయ్యారు.

నరసాపురం నియోజకవర్గం చరిత్రలో 49,738 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా నారాయణ గారు రికార్డు సృష్టించారు.

Tanuku MLA 2024 | పూర్తి జాబితా

Tanuku MLA 2024 Arimilli RadhaKrishna
తణుకు ఎమ్మెల్యే 2024 ఆరిమిల్లి రాధాకృష్ణ | Tanuku MLA 2024 Arimilli RadhaKrishna (Source : Facebook)

తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2014 ఎన్నికల్లో ఆయనకు టిడిపి పార్టీ తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2014 శాసనసభ ఎన్నికల్లో తణుకు నియోజకవర్గానికి గాను టిడిపి పార్టీ తరపున మొట్టమొదటి సారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన చీర్ల రాధాకృష్ణ పైన 30,948 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2019 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున తణుకు నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన కరుమూరి వెంకట నాగేశ్వరరావు చేతిలో 2,195 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

ఆ తర్వాత 2024 శాసనసభ ఎన్నికలలో మళ్ళీ టిడిపి పార్టీ తరపున అదే తణుకు నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన కరుమూరి వెంకట నాగేశ్వరరావు పైన 72,121 ఓట్ల భారీ మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

Konaseema District MLA List 2024
Konaseema District MLA List 2024 ( Latest Update ) | కోనసీమ జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

రాధాకృష్ణ గారు టిడిపి పార్టీ తరపున వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, అందులో రెండు సార్లు విజయం సాధించారు. ఒకసారి ఓటమి పాలయ్యారు.

తణుకు నియోజకవర్గం చరిత్రలో 72,121 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా రాధాకృష్ణ గారు రికార్డు సృష్టించారు.

Comparison Table 2024

ConstituencyWinnerRunnerMargin
PalakolluNimmala Rama NaiduGudala Srihari Gopala Rao67,945
BhimavaramPulaparthi RamanjaneyuluGrandhi Srinivas66,974
AchantaPithani SatyanarayanaCherukuvada Sri Ranganadha Raju26,554
UndiRaghu Rama Krishna RajuP. V. L. Narasimha Raju56,777
TadepalligudemBolisetti SrinivasKottu Satyanarayana62,492
NarasapuramBommidi Narayana NayakarMudunuri Prasad Raju49,738
TanukuArimilli Radha KrishnaKarumuri Venkata Nageswara Rao72,121

ఆధారాలు (Source): పై పట్టికలోని అభ్యర్థుల మెజారిటీలు మరియు ఎన్నికల ఫలితాల వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా ఇవ్వబడినవి.

Previous Election Comparison ( 2019 VS 2024 )

2019 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించిన ఏడు నియోజకవర్గాల్లో, ఐదు నియోజకవర్గాల్లో వైకాపా పార్టీ గెలిచింది. మిగతా రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది.

2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించిన ఏడు నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేయగా, వైకాపా పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేక పోయింది.

Alliance Impact 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎన్డీయే కూటమి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీలు కూటమిగా ఏర్పడి గట్టి ప్రభావం చూపింది.

ఎన్డీయే కూటమి అభ్యర్థుల ప్రభావం కూడా గట్టిగానే ఉంది. అలాగే పశ్చిమగోదావరి జిల్లా ఓటర్లు కూటమి వైపే మొగ్గు చూపారు. అందుచేత జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరూ భారీ మెజారిటీతో గెలిచారు.

ముగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసి సంచలన రికార్డ్ సృష్టించింది. నాలుగు నియోజకవర్గాల్లో టిడిపి పార్టీ గెలిస్తే, మిగతా మూడు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ గెలిచింది. వైకాపా పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కలేదు.

ముఖ్య గమనిక (Disclaimer & Credits) :

సమాచార సేకరణ : ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం మరియు ఫోటోలు కేవలం పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మరియు విద్యా ప్రయోజనాల (Informational and Educational Purposes) కోసం మాత్రమే సేకరించబడినవి.

ఫోటో సౌజన్యం : ఇందులో ఉపయోగించిన చిత్రాలు సంబంధిత ఎమ్మెల్యేల అధికారిక Facebook/Social Media ఖాతాల నుండి సేకరించబడినవి. వీటిపై పూర్తి హక్కులు ఆయా వ్యక్తులకు మాత్రమే ఉంటాయి.

మా ఉద్దేశ్యం : ఎటువంటి కాపీరైట్ నియమాలను ఉల్లంఘించడం మా ఉద్దేశ్యం కాదు. కేవలం పాఠకులకు లేటెస్ట్ సమాచారాన్ని అందించడమే UU News లక్ష్యం.

తరచుగా అడిగే ప్రశ్నలు

పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి?

పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో గెలిచింది 2024?

జనసేన పార్టీ మూడు నియోజకవర్గాల్లో గెలిచింది.

పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో గెలిచింది 2024?

టిడిపి పార్టీ నాలుగు నియోజకవర్గాల్లో గెలిచింది.

పాలకొల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

నిమ్మల రామానాయుడు ( టిడిపి పార్టీ )

భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

పులపర్తి రామాంజనేయులు ( జనసేన పార్టీ )

ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

పితాని సత్యనారాయణ ( టిడిపి పార్టీ )

ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

రఘు రామ కృష్ణ రాజు ( టిడిపి పార్టీ )

తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

బోలిశెట్టి శ్రీనివాస్ ( జనసేన పార్టీ )

నరసాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

బొమ్మిడి నారాయణ నాయకర్ ( జనసేన పార్టీ )

తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

ఆరిమిల్లి రాధాకృష్ణ ( టిడిపి పార్టీ )

Leave a Comment