East Godavari District MLA List 2024 | 2024 శాసనసభ ఎన్నికల ఫలితాలలో గెలుపొందిన తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితాను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
East Godavari District MLA List 2024
2024 లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గెలిచిన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ, ప్రస్తుతం జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెద్ద జిల్లాలలో తూర్పుగోదావరి జిల్లా ఒకటి. 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో భాగంగా గెలుపొందిన జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల పేర్లు, ఎమ్మెల్యేల పేర్లు మరియు పార్టీ పేర్లు యొక్క పూర్తి వివరాలు కింద ఇచ్చిన పట్టిక లో చూడవచ్చు.
| S.NO. | MLA Name | Constituency | Party Name |
| 1 | Bathula Balaramakrishna | Rajanagaram | JSP |
| 2 | Gorantla Butchaiah Chowdary | Rajahmundry Rural | TDP |
| 3 | Nallamilli Ramakrishna Reddy | Anaparthy | BJP |
| 4 | Adireddy Srinivas | Rajahmundry City | TDP |
| 5 | Kandula Durgesh | Nidadavole | JSP |
| 6 | Maddipati Venkata Raju | Gopalapuram (SC) | TDP |
| 7 | Muppidi Venkateswara Rao | Kovvur (SC) | TDP |
| 8 | V. Jogeswara Rao | Mandapeta | TDP |
Source: ఈ పట్టికలోని వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా సేకరించబడినవి.
Rajanagaram MLA 2024 | పూర్తి జాబితా

రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆయన సతీమణి వైకాపా తరపున ఎంపీటీసీ సభ్యురాలిగా గెలవడం లో ఆయన గారి పాత్ర కీలకం.
వైకాపాను వీడి జనసేన పార్టీలో చేరారు. 2024 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భాగంగా ఆయనకు జనసేన పార్టీ రాజానగరం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో రాజానగరం నియోజకవర్గం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన జక్కంపూడి రాజా పైన 34,049 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.
రాజానగరం నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 34,049 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన రికార్డు సృష్టించారు.
Rajahmundry Rural MLA 2024 | పూర్తి జాబితా

రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. తెలుగుదేశం పార్టీ స్థాపకులు ఎన్టీ రామారావు గారి అత్యంత సన్నిహితుడు. ఆయన అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు.
ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. రాజమండ్రి నియోజకవర్గంలో స్థానికంగా మంచి పట్టు ఉన్న నాయకుడు. 1983 శాసనసభ ఎన్నికలలో ఆయనకు తెలుగుదేశం పార్టీ రాజమండ్రి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
1983 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో రాజమండ్రి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన చల్లా అప్పారావు పైన 37,351 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
1985 అసెంబ్లీ ఎన్నికలలో రాజమండ్రి నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏసివై రెడ్డి పైన 7,239 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
1989 శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో రాజమండ్రి నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏసివై రెడ్డి చేతిలో 13,142 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
1994 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున రాజమండ్రి నియోజకవర్గం నుంచి నాలుగో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉండవల్లి అరుణ్ కుమార్ పైన 6,620 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
1996 లోక్ సభ ఎన్నికలలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎంపీగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన చిట్టూరి రవీంద్ర చేతిలో 2,31,162 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
1999 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో రాజమండ్రి నియోజకవర్గానికి గాను ఐదోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉండవల్లి అరుణ్ కుమార్ పైన 23,027 ఓట్ల మెజారిటీతో గెలిచి నాలుగో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.
2004 శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున రాజమండ్రి నియోజకవర్గం నుంచి ఆరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన రౌతు సూర్యప్రకాశరావు చేతిలో 7,554 ఓట్ల తేడాతో పరాజయం చెందారు.
2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన రౌతు సూర్యప్రకాశరావు చేతిలో 1,284 అతి తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
2014 శాసనసభ ఎన్నికలలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి టిడిపి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ఆకుల వీర్రాజు పైన 18,058 ఓట్ల మెజారిటీతో గెలిచి ఐదోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2019 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి గాను ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ఆకుల వీర్రాజు పైన 10,404 ఓట్ల మెజారిటీతో గెలిచి ఆరోసారి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు.
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన చెల్లు బోయిన వేణుగోపాల కృష్ణ పైన 64,090 అతి పెద్ద భారీ మెజారిటీతో గెలిచి ఏడో సారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఆయన రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టించారు. అంతేకాకుండా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో 64,090 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే గా ఆయన అరుదైన రికార్డు సృష్టించారు.
ఆయన టిడిపి పార్టీ తరపున పదిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అందులో ఏడు సార్లు ఘనవిజయం సాధించారు. ఒకసారి ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకులు అంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు.
Anaparthy MLA 2024 | పూర్తి జాబితా

అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిది రాజకీయ నేపథ్యం గల కుటుంబం. ఆయన తండ్రి నల్లమిల్లి మూలా రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు అనపర్తి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు.
తండ్రిగారి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి ,ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. 2014 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆయనకు అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అనపర్తి నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పైన 1,373 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనపర్తి నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి చేతిలో 55,207 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
2024 శాసనసభ ఎన్నికలలో టిడిపి జనసేన బిజెపి పార్టీలు ఎన్డీయే కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేయడం వలన అనపర్తి శాసనసభ నియోజకవర్గం బిజెపికి ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మద్దతుతో కూటమి అభ్యర్థిగా బిజెపి గుర్తుపై పోటీ చేశారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బిజెపి పార్టీ తరపున అనపర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పైన 20,850 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా, అందులో తెలుగుదేశం పార్టీ తరపున ఒకసారి విజయం సాధించారు. ఒకసారి బిజెపి పార్టీ తరపున గెలిచారు.
Rajahmundry City MLA 2024 | పూర్తి జాబితా

రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2019 శాసనసభ ఎన్నికల్లో ఆయన భార్య ఆదిరెడ్డి భవాని గారికి తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2019 శాసనసభ ఎన్నికలలో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ తరపున ఆదిరెడ్డి భవాని గారు మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన రౌతు సూర్యప్రకాశరావు పైన 30,065 ఓట్ల మెజార్టీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయింది.
భవాని గారు 2019 ఎన్నికల్లో గెలవడం లో ఆయన కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా ఆమెకు సపోర్టుగా నిలబడ్డారు.
2024 శాసనసభ ఎన్నికలలో ఆయనకు తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన మార్గాని భరత్ పైన 71,404 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.
రాజమండ్రి సిటీ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 71,404 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన రికార్డు సృష్టించారు.
2019 మరియు 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది.
Nidadavole MLA 2024 | పూర్తి జాబితా

నిడదవోలు నియోజకవర్గం ఎమ్మెల్యే కందుల దుర్గేష్ గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గా కూడా పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడిగా మరియు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.
2014 లోక్ సభ ఎన్నికలలో రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మొదటిసారి ఎంపీగా పోటీ చేసి కేవలం 21,243 ఓట్లు మాత్రమే నమోదు అయ్యాయి. టిడిపి మరియు వైకాపాకు గట్టి పోటీ ఉండటంతో, ఆ ఎన్నికలలో ఆయన మూడవ స్థానంలో నిలిచారు.
ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైకాపాలో వివిధ హోదాల్లో కొన్నాళ్లపాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని, ఆ తర్వాత ఆయన వైకాపాను వీడి జనసేన పార్టీలో చేరారు.
2019 శాసనసభ ఎన్నికల్లో ఆయనకు జనసేన పార్టీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతిలో 31,481 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో నిడదవోలు నియోజకవర్గం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన గడ్డం శ్రీనివాస నాయుడు పైన 33,304 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.
నిడదవోలు శాసనసభ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 33,304 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన రికార్డుని తన సొంతం చేసుకున్నారు.
ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Gopalapuram MLA 2024 | పూర్తి జాబితా

గోపాలపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు.
2014 మరియు 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవి ఆశించిన దక్కలేదు. అయిన ఆయన ఎక్కడ నిరాశ పడలేదు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆయన సేవలను గుర్తించి 2024 శాసనసభ ఎన్నికలలో గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో గోపాలపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన తానేటి వనిత పైన 26,784 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
Kovvur MLA 2024 | పూర్తి జాబితా

కొవ్వూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. కొవ్వూరు నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు.
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో గోపాలపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన తలారి వెంకట్రావు పైన 11,540 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2019 శాసనసభ ఎన్నికలలో గోపాలపురం నియోజకవర్గానికి గాను వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన తలారి వెంకట్రావు చేతిలో 37,461 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
2024 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆయనకు కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన తలారి వెంకట్రావు పైన 33,946 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఆయన తెలుగుదేశం పార్టీ తరపున మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా, ఒకసారి ఓటమి పాలయ్యారు. మిగతా రెండుసార్లు ( 2014,2024 ) ఘనవిజయం సాధించారు.
Mandapeta MLA 2024 | పూర్తి జాబితా

మండపేట నియోజకవర్గం గతంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండేది. ప్రజల కోరిక మేరకు 2025 సంవత్సరంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాలో చేర్చడం జరిగింది. కావున ప్రస్తుతానికి మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా కిందికి వస్తుంది.
మండపేట నియోజకవర్గం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర రావు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2004 శాసనసభ ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ ఆలమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఆలమూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన కృష్ణార్జున చౌదరి చేతిలో 8,120 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో మండపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీకి చెందిన వి.వి.ఎస్.ఎస్ చౌదరి పైన 17,440 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2014 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో మండపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన జి.వి. స్వామి నాయుడు పైన 36,014 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2019 అసెంబ్లీ ఎన్నికలలో మండపేట నియోజకవర్గానికి గాను ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ పైన 10,600 ఓట్ల మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు ఆయన పేరిట ఉంది.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో మండపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన తోట త్రిమూర్తులు పైన 44,435 ఓట్ల మెజారిటీతో నాలుగో సారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఆయన తెలుగుదేశం పార్టీ తరపున ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా, అందులో నాలుగుసార్లు ఘనవిజయం సాధించారు. ఒకసారి పరాజయం పాలయ్యారు.
అంతేకాకుండా మండపేట శాసనసభ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 44,435 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డును తన సొంతం చేసుకున్నాడు.
మండపేట శాసనసభ నియోజకవర్గం 2009 లో ఏర్పడినప్పటి నుంచి, ( 2009,2014,2019,2024 ) శాసనసభ ఎన్నికలలో అన్ని సార్లు వరుసగా తెలుగుదేశం పార్టీ జెండా జయకేతనం ఎగురవేసింది.
Comparison Table 2024
| Constituency | Winner | Runner | Margin |
| Rajanagaram | Bathula Balaramakrishna | Jakkampudi Raja | 34,049 |
| Rajahmundry Rural | Gorantla Butchaiah Chowdary | Chelluboyina Venugopala Krishna | 64,090 |
| Anaparthy | Nallamilli Ramakrishna Reddy | Dr. Sathi Suryanarayana Reddy | 20,850 |
| Rajahmundry City | Adireddy Srinivas | Margani Bharat | 71,404 |
| Nidadavole | Kandula Durgesh | Geddam Srinivas Naidu | 33,304 |
| Gopalapuram | Maddipati Venkata Raju | Taneti Vanitha | 26,784 |
| Kovvur | Muppidi Venkateswara Rao | Talari Venkat Rao | 33,946 |
| Mandapeta | V. Jogeswara Rao | Thota Trimurthulu | 44,435 |
ఆధారాలు (Source): పై పట్టికలోని అభ్యర్థుల మెజారిటీలు మరియు ఎన్నికల ఫలితాల వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా ఇవ్వబడినవి.
Previous Election Comparison ( 2019 VS 2024 )
2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఐదు స్థానాల్లో వైకాపా కైవసం చేసుకోగా, తెలుగుదేశం పార్టీ మిగతా మూడు స్థానాల్లో పరిమితమైంది.
2024 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ ప్రభంజనం సృష్టించింది. ప్రత్యర్థి పార్టీ వైకాపాకు కనీసం ఒక్క సీటు కూడా దక్కకుండా ప్రజలు కూటమికి పట్టం కట్టారు.
Alliance Impact 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో ఎన్డీయే కూటమి ( తెలుగుదేశం, జనసేన మరియు బిజెపి ) మూడు పార్టీల ఓట్లు చెల్లాచెదురు కాకుండా ఒకే దగ్గరకు చేరడం.
రాజమండ్రి సిటీ మరియు రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల భారీ మెజారిటీ గాని, మండపేట లో వేగుళ్ల జోగేశ్వర రావు వరుసగా గెలిచి సృష్టించిన రికార్డు గాని, యువత మరియు తటస్థ ఓటర్లు కూటమి వైపు మొగ్గు చూపారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
ముగింపు
ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తూర్పుగోదావరి జిల్లా రాజకీయ రూపురేఖలను పూర్తిగా మార్చేశాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా గతంతో పోలిస్తే గణనీయంగా మారింది.
మూడు పార్టీల ఓటు బ్యాంకు కలవడంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. ఒక్క సీటు కూడా ప్రతిపక్షానికి దక్కకుండా క్లీన్ స్వీప్ చేయడం విశేషం.
ముఖ్య గమనిక (Disclaimer & Credits) :
సమాచార సేకరణ : ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం మరియు ఫోటోలు కేవలం పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మరియు విద్యా ప్రయోజనాల (Informational and Educational Purposes) కోసం మాత్రమే సేకరించబడినవి.
ఫోటో సౌజన్యం : ఇందులో ఉపయోగించిన చిత్రాలు సంబంధిత ఎమ్మెల్యేల అధికారిక Facebook/Social Media ఖాతాల నుండి సేకరించబడినవి. వీటిపై పూర్తి హక్కులు ఆయా వ్యక్తులకు మాత్రమే ఉంటాయి.
మా ఉద్దేశ్యం : ఎటువంటి కాపీరైట్ నియమాలను ఉల్లంఘించడం మా ఉద్దేశ్యం కాదు. కేవలం పాఠకులకు లేటెస్ట్ సమాచారాన్ని అందించడమే UU News లక్ష్యం.
తరచుగా అడిగే ప్రశ్నలు
తూర్పుగోదావరి జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి?
తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి.
తూర్పుగోదావరి జిల్లాలో టిడిపి పార్టీ గెలిచిన నియోజకవర్గాలు ఎన్ని 2024?
తూర్పుగోదావరి జిల్లాలో టిడిపి పార్టీ ఐదు నియోజకవర్గాల్లో గెలిచింది.
తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ గెలిచిన నియోజకవర్గాలు ఎన్ని 2024?
తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ రెండు నియోజకవర్గాల్లో గెలిచింది.
రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
బత్తుల బలరామకృష్ణ ( జనసేన పార్టీ )
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( టిడిపి పార్టీ )
అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి ( బిజెపి పార్టీ )
రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
ఆదిరెడ్డి శ్రీనివాస్ ( టిడిపి పార్టీ )
నిడదవోలు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
కందుల దుర్గేష్ ( జనసేన పార్టీ )
గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
మద్దిపాటి వెంకట రాజు ( టిడిపి పార్టీ )
కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
ముప్పిడి వెంకటేశ్వర రావు ( టిడిపి పార్టీ )
మండపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
వేగుళ్ల జోగేశ్వర రావు ( టిడిపి పార్టీ )
