Vizianagaram District MLA List 2024 : 2024 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గెలుపొందిన విజయనగరం జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితాను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Vizianagaram District MLA List 2024
2024 లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో గెలిచిన విజయనగరం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ, ప్రస్తుతానికి కూడా తమ పదవుల్లో కొనసాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో గెలిచిన ఎమ్మెల్యేల పేర్లు, నియోజకవర్గాల పేర్లు మరియు పార్టీ పేర్లను ఇక్కడ చూడండి.
| S.NO. | MLA Name | Constituency | Party Name |
| 1 | R.V.S.K. Ranga Rao | Bobbili | TDP |
| 2 | Kondapalli Srinivas | Gajapathinagaram | TDP |
| 3 | Kondru Murali Mohan | Rajam (SC) | TDP |
| 4 | Kimidi Kalavenkata Rao | Cheepurupalli | TDP |
| 5 | Pusapati Aditi Vijayalakshmi | Vizianagaram | TDP |
| 6 | Lokam Naga Madhavi | Nellimarla | JSP |
| 7 | Kolla Lalitha Kumari | Srungavarapukota | TDP |
Source: ఈ పట్టికలోని వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా సేకరించబడినవి.
Bobbili MLA 2024 | పూర్తి జాబితా

బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆయనకు 2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2004 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బొబ్బిలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన అప్పలనాయుడు పైన 12,690 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అదే బొబ్బిలి నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన తెంటు లక్ష్మునాయుడు 24,172 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు.
2012 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2014 శాసనసభ ఎన్నికలలో బొబ్బిలి నియోజకవర్గానికి గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన తెంటు లక్ష్మునాయుడు పైన 6,958 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2016 సంవత్సరంలో వైకాపా లో గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. అలా ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో చేరడంతో చంద్రబాబు మంత్రివర్గంలో గనులు, జియాలజీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
అనంతరం 2019 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు చేతిలో 8,352 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ బొబ్బిలి నియోజకవర్గం నుంచి టిడిపి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు పైన 44,648 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి నాలుగో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఆయన బొబ్బిలి నియోజకవర్గం నుంచి ఐదు సర్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, ఒకసారి ఓటమి పాలయ్యారు. మిగతా నాలుగుసార్లు ఘనవిజయం సాధించారు. అంతేకాకుండా బొబ్బిలి నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సృష్టించారు.
బొబ్బిలి నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 44,648 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన ఒక అరుదైన రికార్డుని తన సొంతం చేసుకున్నారు.
బొబ్బిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా 1994 ఎన్నికల్లో చివరిసారిగా ఎగిరింది. ఆ తర్వాత మళ్లీ రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు గెలుపుతో తెలుగుదేశం పార్టీ జయకేతనం ఎగురవేసింది.
Gajapathinagaram MLA 2024 | పూర్తి జాబితా

గజపతినగరం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ గారిది రాజకీయ నేపథ్యం గల కుటుంబం. ఆయన తాత కొండపల్లి పైడితల్లి నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ లోక్ సభ ఎంపీ.
పైడితల్లి నాయుడు గారు బొబ్బిలి లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున 1996, 1998 మరియు 2004 లోక్ సభ ఎన్నికలలో మూడుసార్లు ఎంపీగా ఘనవిజయం సాధించారు.
కొండపల్లి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2024 శాసనసభ ఎన్నికలలో ఆయనకు టిడిపి గజపతినగరం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో గజపతినగరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన బొత్స అప్పల నరసయ్య పైన 25,301 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ప్రస్తుతానికి ఆయన చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఎం.ఎస్.ఎం.ఈ, సెర్ప్, ఎన్.ఆర్.ఐ. సాధికారత, సంబంధాలు శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Rajam MLA 2024 | పూర్తి జాబితా

రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 1999 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
1999 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన కావలి ప్రతిభా భారతి చేతిలో 10,790 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
2004 శాసనసభ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన కావలి ప్రతిభా భారతి పైన 5,689 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన కావలి ప్రతిభా భారతి పైన 27,133 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున రాజాం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, ఆయనకు కేవలం 4,790 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. వైకాపాకు మరియు టిడిపి మధ్య గట్టి పోటీ ఉండడంతో ఆయనకు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి.
2018 సంవత్సరంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కంబాల జోగులు చేతిలో 16,848 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో రాజాం నియోజకవర్గానికి గాను టిడిపి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన టేల్ రాజేష్ పైన 20,722 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
రాజాం నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 27,133 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన చారిత్రాత్మక రికార్డ్ సృష్టించారు.
రాజాం నియోజకవర్గం 2009 లో ఏర్పడినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. 2024 శాసనసభ ఎన్నికల్లో కోండ్రు మురళీమోహన్ గెలుపుతో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది.
ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, అందులో మూడుసార్లు విజయం సాధించారు. మిగతా మూడుసార్లు పరాజయం పాలయ్యారు.
Cheepurupalli MLA 2024 | పూర్తి జాబితా

చీపురుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. ఆయన తెలుగుదేశం పార్టీ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే రాజకీయాల్లో ఉన్నారు.
1983 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉణుకూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన పాలావలస రాజశేఖరం పైన 23,381 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
1985 శాసనసభ ఎన్నికలలో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన కెంబురు రావు పైన 27,345 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
1989 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన పాలావలస రాజశేఖరం పైన 2,237 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు.
1994 శాసనసభ ఎన్నికలలో నాలుగో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన పాలవలస రాజశేఖరం చేతిలో 4,258 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఐదోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన పాలవలస రాజశేఖరం పైన 11,488 ఓట్ల మెజారిటీతో గెలిచి నాలుగో సారి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు.
2004 శాసనసభ ఎన్నికలలో ఆరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన పాలవలస రాజశేఖరం పైన 12,886 ఓట్ల మెజారిటీతో గెలిచి ఐదోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2009 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, 29,957 ఓట్లు మాత్రమే నమోదు అయ్యాయి. తెలుగుదేశం మరియు కాంగ్రెస్ పార్టీకి మధ్య గట్టి పోటీ ఉండడంతో ఆయన గెలవలేక పోయారు.
2014 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన గొర్లె కిరణ్ కుమార్ పైన 4,741 ఓట్ల మెజారిటీతో గెలిచి ఆరోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన గొర్లె కిరణ్ కుమార్ చేతిలో 18,711 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన బొత్స సత్యనారాయణ పైన 11,971 ఓట్ల మెజారిటీతో గెలిచి ఏడో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
Vizianagaram MLA 2024 | పూర్తి జాబితా

విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆమెది రాజకీయ నేపథ్యం గల కుటుంబం. ఆమె తాతగారు విజయనగరం నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఆమె తండ్రి అశోక్ గజపతి రాజు గారు విజయనగరం నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 లోక్ సభ ఎన్నికలలో విజయనగరం లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఎంపీగా కూడా విజయం సాధించారు.
అశోక్ గజపతి రాజు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గాను మరియు కేంద్ర మంత్రిగాను బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతానికి ఆయన గోవా గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తాత మరియు తండ్రిగారి రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. 2019 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆమెకు విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన వీరభద్ర స్వామి చేతిలో 6,400 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన వీరభద్ర స్వామి పైన 60,609 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
విజయనగరం నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 60,609 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఒక అరుదైన రికార్డుని సృష్టించారు.
Nellimarla MLA 2024 | పూర్తి జాబితా

నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లోకం నాగ మాధవి గారు జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2019 శాసనసభ ఎన్నికలలో జనసేన పార్టీ ఆమెకు నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2019 శాసనసభ ఎన్నికలలో నెల్లిమర్ల నియోజకవర్గానికి గాను జనసేన పార్టీ తరపున మొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం 7,633 ఓట్లు మాత్రమే వచ్చాయి. వైకాపా వర్సెస్ టిడిపి గట్టి పోటీ ఉండడంతో ఆమెకు తక్కువ ఓట్లు నమోదు అయ్యాయి.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున నెల్లిమర్ల నియోజవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన అప్పలనాయుడు బడ్డుకొండ పైన 39,829 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయింది.
నెల్లిమర్ల నియోజకవర్గం రాజకీయ చరిత్రలో గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యేగా ఆమె సంచలన రికార్డ్ సృష్టించారు.
Srungavarapukota MLA 2024 | పూర్తి జాబితా

శృంగవరపుకోట నియోజకవర్గం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి గారిది రాజకీయ నేపథ్యం గల కుటుంబం.
ఆమె తాతగారు కోళ్ల అప్పలనాయుడు శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి 1967 శాసనసభ ఎన్నికలలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన పద్మనాభ పైన 2,572 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఆమె తన తాత గారి అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2009 శాసనసభ ఎన్నికలలో భాగంగా ఆమెకు తెలుగుదేశం పార్టీ శృంగవరపుకోట నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన అల్లు కేశవ వెంకట జోగినాయుడు పైన 3,440 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయింది.
2014 అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన రొంగలి జగన్నాధం పైన 28,537 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2019 శాసనసభ ఎన్నికలలో వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కడుబండి శ్రీనివాస రావు చేతిలో 11,365 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి నాలుగో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కడుబండి శ్రీనివాస రావు పైన 38,790 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
Comparison Table 2024
| Constituency | Winner | Runner | Margin |
| Bobbili | R.V.S.K. Ranga Rao | Venkata Chinna Appala Naidu Sambangi | 44,648 |
| Gajapathinagaram | Kondapalli Srinivas | Appalanarasayya Botcha | 25,301 |
| Rajam | Kondru Murali Mohan | Tale Rajesh | 20,722 |
| Cheepurupalli | Kimidi Kala Venkata Rao | Botcha Satyanarayana | 11,971 |
| Vizianagaram | Pusapati Aditi Vijayalakshmi | Kolagatla Veerabhadra Swamy | 60,609 |
| Nellimarla | Lokam Naga Madhavi | Appalanaidu Baddukonda | 39,829 |
| Srungavarapukota | Kolla Lalitha Kumari | Kadubandi Srinivas Rao | 38,790 |
ఆధారాలు (Source): పై పట్టికలోని అభ్యర్థుల మెజారిటీలు మరియు ఎన్నికల ఫలితాల వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా ఇవ్వబడినవి.
Previous Election Comparison ( 2019 VS 2024 )
2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయనగరం జిల్లాకు సంబంధించిన మొత్తం ఏడు నియోజకవర్గాల్లో వైకాపా క్లీన్ స్వీప్ చేసి ప్రభంజనం సృష్టించింది. తెలుగుదేశం పార్టీ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది.
2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో విజయనగరం జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసి చారిత్రాత్మక రికార్డుని సృష్టించారు. వైకాపా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేక పోయింది.
Alliance Impact 2024
తెలుగుదేశం, జనసేన మరియు బిజెపి పార్టీలు కలిసి పనిచేయడం వల్ల ఓట్లు చీలిపోకుండా అభ్యర్థులకు భారీ మెజారిటీ వచ్చాయి. ఈ విజయంలో మరి ముఖ్యంగా యువత మరియు తటస్థ ఓటర్లు కీలక పాత్ర పోషించారు. కూటమి ఐక్యత ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది.
ముగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో భాగంగా విజయనగరం జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసి సంచలన రికార్డ్ సృష్టించింది.
వైకాపా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేక పోయింది. ఈ విజయంతో టిడిపి జిల్లాలో తమ పట్టును మరోసారి నిరూపించుకుంది. జనసేన పార్టీ కూడా ఒక స్థానాన్ని గెలిచి తన ఉనికిని చాటుకుంది.
ముఖ్య గమనిక (Disclaimer & Credits) :
సమాచార సేకరణ : ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం మరియు ఫోటోలు కేవలం పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మరియు విద్యా ప్రయోజనాల (Informational and Educational Purposes) కోసం మాత్రమే సేకరించబడినవి.
ఫోటో సౌజన్యం : ఇందులో ఉపయోగించిన చిత్రాలు సంబంధిత ఎమ్మెల్యేల అధికారిక Facebook/Social Media ఖాతాల నుండి సేకరించబడినవి. వీటిపై పూర్తి హక్కులు ఆయా వ్యక్తులకు మాత్రమే ఉంటాయి.
మా ఉద్దేశ్యం : ఎటువంటి కాపీరైట్ నియమాలను ఉల్లంఘించడం మా ఉద్దేశ్యం కాదు. కేవలం పాఠకులకు లేటెస్ట్ సమాచారాన్ని అందించడమే UU News లక్ష్యం.
తరచుగా అడిగే ప్రశ్నలు
విజయనగరం జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి 2024?
విజయనగరం జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి
విజయనగరం జిల్లాలోని నియోజకవర్గాల పేర్లు?
విజయనగరం, శృంగవరపుకోట, బొబ్బిలి, గజపతినగరం, రాజాం, చీపురుపల్లి మరియు నెల్లిమర్ల
విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
పూసపాటి అదితి విజయలక్ష్మి (టిడిపి పార్టీ)
శృంగవరపుకోట నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
కోళ్ల లలిత కుమారి (టిడిపి పార్టీ)
బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు (టిడిపి పార్టీ)
గజపతినగరం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
కొండపల్లి శ్రీనివాస్ (టిడిపి పార్టీ)
రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
కోండ్రు మురళీమోహన్ (టిడిపి పార్టీ)
చీపురుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
కిమిడి కళ వెంకటరావు (టిడిపి పార్టీ)
నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
లోకం నాగ మాధవి (జనసేన పార్టీ)
