Visakhapatnam District MLA List 2024 ( Latest Update ) | విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

Visakhapatnam District MLA List 2024 | 2024 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితాను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Table of Contents

Visakhapatnam District MLA List 2024

2024 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గెలిచిన విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ, ప్రస్తుతానికి కూడా తమ పదవుల్లో కొనసాగుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భాగంగా విశాఖపట్నం జిల్లాలోని గెలిచిన ఎమ్మెల్యేల పేర్లు, నియోజకవర్గాల పేర్లు మరియు పార్టీ పేర్లను ఇక్కడ చూడండి.

S.NO.MLA NameConstituencyParty Name
1Vamsi Krishna SrinivasVisakhapatnam SouthJSP
2P.G.V.R. NaiduVisakhapatnam WestTDP
3Velagapudi Ramakrishna BabuVisakhapatnam EastTDP
4Penmetsa Vishnu Kumar RajuVisakhapatnam NorthBJP
5Ganta Srinivasa RaoBheemiliTDP
6Palla Srinivas RaoGajuwakaTDP
7Panchakarla Ramesh BabuPendurthiJSP

Source: ఈ పట్టికలోని వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా సేకరించబడినవి.

visakhapatnam South MLA 2024 | పూర్తి జాబితా

Visakhapatnam South MLA 2024 Vamsi Krishna Srinivas
విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే 2024 వంశీ కృష్ణ శ్రీనివాస్ | Visakhapatnam South MLA 2024 Vamsi Krishna Srinivas (Source : Facebook)

విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు 2009 శాసనసభ ఎన్నికలలో భాగంగా ప్రజారాజ్యం పార్టీ విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గానికి గాను ప్రజారాజ్యం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన వెలగపూడి రామకృష్ణ బాబు చేతిలో 4,031 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

2011 సంవత్సరంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి వెలగపూడి రామకృష్ణ బాబు చేతిలో 47,883 ఓట్ల తేడాతో పరాజయం చెందారు.

2019 శాసనసభ ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. 2021 సంవత్సరంలో వైసిపి పార్టీ ఆయన్ని విశాఖపట్నం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది.2021 సంవత్సరంలో ఆయన ఎమ్మెల్సీ గా ఏకగ్రీవంగా ఎన్నికై, శాసనమండలిలో ఎమ్మెల్సీ సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం ఆయన 2023 సంవత్సరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. 2024 శాసనసభ ఎన్నికలలో ఆయనకు జనసేన పార్టీ విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన గణేష్ కుమార్ వాసుపల్లి పైన 64,594 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 64,594 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన సంచలన రికార్డ్ సృష్టించారు.

Visakhapatnam West MLA 2024 | పూర్తి జాబితా

Visakhapatnam West MLA 2024 PGVR Naidu
విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే 2024 పి.జి.వి.ఆర్. నాయుడు | Visakhapatnam West MLA 2024 PGVR Naidu (Source : Facebook)

విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్. నాయుడు గారు తన తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తండ్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ ఎంపీ.

ఆయన తండ్రి పెతకంశెట్టి అప్పల నరసింహం గారు 1984 లోక్ సభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున అనకాపల్లి ఎంపీ గా గెలిచారు.

ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 1999 శాసనసభ ఎన్నికలలో ఆయనకు తెలుగుదేశం పార్టీ పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

1999 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పెందుర్తి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ద్రోణంరాజు శ్రీనివాసరావు పైన 23,589 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2004 శాసనసభ ఎన్నికలలో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. ఆ తర్వాత 2009 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరడంతో, 2009 శాసనసభ ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ ఆయనకు విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లా విజయ ప్రసాద్ చేతిలో 4,144 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

ఆ తర్వాత మళ్లీ ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికలలో భాగంగా టిడిపి ఆయనకు విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గానికి గాను టిడిపి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన దాడి రత్నాకర్ పైన 30,857 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన విజయ్ ప్రసాద్ పైన 18,981 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ఆడారి ఆనంద్ కుమార్ పైన 35,184 ఓట్ల మెజారిటీతో గెలిచి నాలుగో సారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు.

ఆయన విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా 2014,2019 మరియు 2024 శాసనసభ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టించారు.

విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 35,184 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన ఒక అరుదైన రికార్డుని సృష్టించారు.

Visakhapatnam East MLA 2024 | పూర్తి జాబితా

Visakhapatnam East MLA 2024 Velagapudi Ramakrishna Babu
విశాఖపట్నం ఈస్ట్ ఎమ్మెల్యే 2024 వెలగపూడి రామకృష్ణ బాబు | Visakhapatnam East MLA 2024 Velagapudi Ramakrishna Babu (Source : Facebook)

విశాఖపట్నం ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2009 శాసనసభ ఎన్నికల్లో ఆయనకు టిడిపి విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ పైన 4,031 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ పైన 47,883 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2019 శాసనసభ ఎన్నికలలో టిడిపి తరపున ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన విజయ నిర్మల పైన 26,474 ఓట్ల మెజారిటీతో వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డుని తన సొంతం చేసుకున్నారు.

West Godavari District MLA List 2024
West Godavari District MLA List 2024 (Latest Update ) | పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున నాలుగో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ఎమ్.వి.వి. సత్యనారాయణ పైన 70,877 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి నాలుగో సారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు.

ఆయన విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 70,877 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా అదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి, నాలుగు సార్లు ఘనవిజయం సాధించారు.

అంతేకాకుండా విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ నియోజకవర్గం 2009 లో ఏర్పడినప్పటి నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ జెండా జయకేతనం ఎగుర వేస్తూనే ఉంది.

Visakhapatnam North MLA 2024 | పూర్తి జాబితా

Visakhapatnam North MLA 2024 Penmetsa Vishnu Kumar Raju
విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే 2024 పెన్మెత్స విష్ణు కుమార్ రాజు | Visakhapatnam North MLA 2024 Penmetsa Vishnu Kumar Raju (Source : Facebook)

విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు బిజెపి పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2014 శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఆయనకు బిజెపి విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విశాఖపట్నం నార్త్ నియోజకవర్గానికి గాను బిజెపి పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన చొక్కాకుల వెంకటరావు పైన 18,240 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2019 శాసనసభ ఎన్నికలలో వరుసగా విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం నుంచి బిజెపి తరపున రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, ఈసారి కేవలం ఆయనకు 18,790 అతి తక్కువ ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. టిడిపి మరియు వైకాపాకు మధ్య పోటీ గట్టి పోటీ ఉండడంతో ఆయన గెలవలేక పోయారు.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బిజెపి తరపున పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కమ్మిల కన్నపరాజు పైన 47,534 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు.

విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 47,534 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నారు.

Bheemili MLA 2024 | పూర్తి జాబితా

Bheemili MLA 2024 Ganta Srinivasa Rao
భీమిలి ఎమ్మెల్యే 2024 గంటా శ్రీనివాసరావు | Bheemili MLA 2024 Ganta Srinivasa Rao (Source : Facebook)

భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 1999 లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి టికెట్ ఇచ్చింది.

1999 లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎంపీగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన గుడివాడ గురునాథ రావు పైన 58,464 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎంపీ గా విజయం సాధించారు.

ఆ తర్వాత 2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఆయనకు తెలుగుదేశం పార్టీ చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2004 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో చోడవరం నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన బాలిరెడ్డి సత్య రావు పైన 9,601 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ఆయన 2009 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరపున అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొణతాల రామకృష్ణ పైన 10,866 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

అనంతరం 2014 సంవత్సరంలో ఆయన తిరిగి మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు టిడిపి 2014 శాసనసభ ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2014 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి టిడిపి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కర్రీ సీతారాం పైన 37,226 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు.

ఆయన చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో 2014-2019 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

2019 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కమ్మిల కన్నపరాజు పైన 1,944 అతి తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచి నాలుగో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు పైన 92,401 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి ఐదోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. అవేంటంటే భీమిలి నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 92,401 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఒక రికార్డు. మరో రికార్డు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యధిక ఓట్ల మెజారిటీ 92,401 టాప్ 2 ఎమ్మెల్యేగా ఆయన నిలిచారు.

Gajuwaka MLA 2024 | పూర్తి జాబితా

Gajuwaka MLA 2024 Palla Srinivas Rao
గాజువాక ఎమ్మెల్యే 2024 పల్లా శ్రీనివాస్ రావు | Gajuwaka MLA 2024 Palla Srinivas Rao (Source : Facebook)

గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారిది రాజకీయ నేపథ్యం గల కుటుంబం. ఆయన తండ్రి గారు పల్లా సింహాచలం గారు 1994 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున విశాఖపట్నం -2 నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

తండ్రి రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ 2009 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.

2009 లోక్ సభ ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరపున విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎంపీగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరి చేతిలో 66,686 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

అనంతరం 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున గాజువాక నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన తిప్పల నాగిరెడ్డి పైన 21,712 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో గాజువాక నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన తిప్పల నాగిరెడ్డి చేతిలో 16,753 ఓట్ల తేడాతో పరాజయం చెందారు.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన గుడివాడ అమర్నాథ్ పైన 95,235 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

గాజువాక నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 95,235 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో 95,235 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే టాప్ 1 ఎమ్మెల్యేగా నిలిచారు. ప్రస్తుతానికి ఆయన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

East Godavari District MLA List 2024
East Godavari District MLA List 2024 | తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

Pendurthi MLA 2024 | పూర్తి జాబితా

Pendurthi MLA 2024 Panchakarla Ramesh Babu
పెందుర్తి ఎమ్మెల్యే 2024 పంచకర్ల రమేష్ బాబు | Pendurthi MLA 2024 Panchakarla Ramesh Babu (Source : Facebook)

గమనిక : పెందుర్తి నియోజకవర్గం కొన్ని మండలాలు విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. మరికొన్ని మండలాలు అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి. కానీ ప్రధానంగా ఎమ్మెల్యే జాబితా కోసం విశాఖపట్నం జిల్లా కిందికి చేర్చబడుతుంది.

పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగ్రేటం చేశారు.

2009 శాసనసభ ఎన్నికలలో పెందుర్తి నియోజకవర్గానికి గాను ప్రజారాజ్యం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన గండి బాబ్జీ పైన 3,272 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ఆయన 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎలమంచిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ప్రగడ నాగేశ్వరరావు పైన 8,375 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఎలమంచిలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కన్నా బాబు చేతిలో 4,146 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

2021 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మళ్లీ వైకాపా నుంచి 2023 సంవత్సరంలో జనసేన పార్టీలో చేరారు.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో పెందుర్తి నియోజకవర్గం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన అన్నం రెడ్డి అదీప్ రాజ్ పైన 81,870 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

పెందుర్తి నియోజకవర్గం చరిత్రలో 81,870 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన సంచలన రికార్డుని సృష్టించారు.

Comparison Table 2024

ConstituencyWinnerRunnerMargin
Visakhapatnam SouthVamsi Krishna SrinivasGanesh Kumar Vasupalli64,594
Visakhapatnam WestP.G.V.R. NaiduAdari Anand Kumar35,184
Visakhapatnam EastVelagapudi Ramakrishna BabuMVV Satyanarayana70,877
Visakhapatnam NorthPenmetsa Vishnu Kumar RajuKannaparaju Kammila47,534
BheemiliGanta Srinivasa RaoMuttamsetti Srinivasa Rao92,401
GajuwakaPalla Srinivas RaoAmarnath Gudivada95,235
PendurthiPanchakarla Ramesh BabuAnnamreddy Adeep Raj81,870

ఆధారాలు (Source): పై పట్టికలోని అభ్యర్థుల మెజారిటీలు మరియు ఎన్నికల ఫలితాల వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా ఇవ్వబడినవి.

Previous Election Comparison ( 2019 VS 2024 )

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విశాఖపట్నం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో వైకాపా మూడు స్థానాలు దక్కించుకుంది. మిగతా నాలుగు స్థానాలు గెలిచి తెలుగుదేశం పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో విశాఖపట్నం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు. వైకాపా ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది.

Alliance Impact 2024

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం, జనసేన మరియు బిజెపి కలయిక ఓట్లు చీలిక నివారించడమే కాకుండా, జిల్లాలోని యువత మరియు తటస్థ ఓటర్లు కూటమి వైపే మొగ్గు చూపారు. అందుకే విశాఖపట్నం జిల్లా అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. మరి ముఖ్యంగా గాజువాక మరియు భీమిలి నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో మెజారిటీలు నమోదు అయ్యాయి.

ముగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసి సంచలన రికార్డ్ సృష్టించారు. తెలుగుదేశం- 4 స్థానాలు జనసేన – 2 స్థానాలు బిజెపి – 1 స్థానం గెలుచుకున్నాయి. వైకాపా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేక పోయారు.

ముఖ్య గమనిక (Disclaimer & Credits) :

సమాచార సేకరణ : ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం మరియు ఫోటోలు కేవలం పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మరియు విద్యా ప్రయోజనాల (Informational and Educational Purposes) కోసం మాత్రమే సేకరించబడినవి.

ఫోటో సౌజన్యం : ఇందులో ఉపయోగించిన చిత్రాలు సంబంధిత ఎమ్మెల్యేల అధికారిక Facebook/Social Media ఖాతాల నుండి సేకరించబడినవి. వీటిపై పూర్తి హక్కులు ఆయా వ్యక్తులకు మాత్రమే ఉంటాయి.

మా ఉద్దేశ్యం : ఎటువంటి కాపీరైట్ నియమాలను ఉల్లంఘించడం మా ఉద్దేశ్యం కాదు. కేవలం పాఠకులకు లేటెస్ట్ సమాచారాన్ని అందించడమే UU News లక్ష్యం.

తరచుగా అడిగే ప్రశ్నలు

విశాఖపట్నం జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి?

విశాఖపట్నం జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి.

విశాఖపట్నం జిల్లాలోని నియోజకవర్గాల పేర్లు?

విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం వెస్ట్, విశాఖపట్నం నార్త్, భీమిలి, గాజువాక మరియు పెందుర్తి

విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

వంశీకృష్ణ శ్రీనివాస్ (జనసేన పార్టీ)

విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

వెలగపూడి రామకృష్ణ బాబు (టిడిపి పార్టీ)

విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

పి.జి.వి.ఆర్. నాయుడు ( టిడిపి పార్టీ)

విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

విష్ణు కుమార్ రాజు ( బిజెపి పార్టీ )

భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

గంటా శ్రీనివాసరావు ( టిడిపి పార్టీ )

గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

పల్లా శ్రీనివాసరావు ( టిడిపి పార్టీ )

పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

పంచకర్ల రమేష్ బాబు ( జనసేన పార్టీ )

Leave a Comment