Tirupati District MLA List 2024 ( Latest Update ) | తిరుపతి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

Tirupati District MLA List 2024 : 2024 లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన తిరుపతి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేల పూర్తి జాబితాను తెలుసుకుందాం.

Tirupati District MLA List 2024

2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో గెలిచిన తిరుపతి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ, ప్రస్తుతానికి కూడా తమ పదవుల్లో కొనసాగుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో గెలిచిన నియోజకవర్గాల పేర్లు, ఎమ్మెల్యేల పేర్లు మరియు పార్టీ పేర్లను ఇక్కడ చూడండి.

S.NO.MLA NameConstituencyParty Name
1Arani SrinivasuluTirupatiJSP
2Koneti AdimulamSatyavedu (SC)TDP
3Kurugondla RamakrishnaVenkatagiriTDP
4Bojjala Venkata Sudhir ReddySrikalahastiTDP
5Nelavala Vijayasree Sullurpeta (SC)TDP
6Pulivarthi Venkata Mani PrasadChandragiriTDP
7Arava SreedharKodurJSP

Source: ఈ పట్టికలోని వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా సేకరించబడినవి.

Tirupati MLA 2024 | పూర్తి జాబితా

Tirupati MLA 2024 Arani Srinivasulu
తిరుపతి ఎమ్మెల్యే 2024 ఆరణి శ్రీనివాసులు | Tirupati MLA 2024 Arani Srinivasulu (Source: Facebook Public Domain)

తిరుపతి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో చాలా కాలం పాటు పనిచేశారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఆశించిన స్థాయిలో ఆయనకు దక్కలేదు. అందుకే వేరే పార్టీల వైపు మొగ్గు చూపారు.

2009 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని వీడి ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ ఆయనకు చిత్తూరు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2009 శాసనసభ ఎన్నికల్లో చిత్తూరు శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రజా రాజ్యం పార్టీ తరపున మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన సికె జయచంద్ర రెడ్డి చేతిలో 1,710 అతి తక్కువ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

2014 శాసనసభ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ టిడిపి పార్టీ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన టిడిపి పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2014 శాసనసభ ఎన్నికలలో ఆయనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2014 శాసనసభ ఎన్నికలలో చిత్తూరు నియోజకవర్గానికి గాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన డిఎ సత్య ప్రభ చేతిలో 6,799 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.

2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున మొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అలానే 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్లీ పరాజయం పాలయ్యారు.

2019 శాసనసభ ఎన్నికలలో చిత్తూరు నియోజకవర్గం నుంచి వైకాపా పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి టిడిపి పార్టీకి చెందిన ఎఎస్ మనోహర్ పైన 39,968 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2024 ఎన్నికలలో వైకాపా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసింది. అలా శ్రీనివాసులు గారికి కాకుండా వేరే వాళ్ళకు చిత్తూరు శాసనసభ నియోజకవర్గం ఇన్ చార్జ్ ని వైకాపా పార్టీ ప్రకటించడంతో ఆయన అసంతృప్తి చెంది జనసేన పార్టీలో చేరారు.

2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున తిరుపతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన భూమన అభినయ్ రెడ్డి పైన 61,956 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

శ్రీనివాసులు గారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అందులో రెండుసార్లు విజయం సాధించారు. మిగతా రెండుసార్లు పరాజయం పాలయ్యారు. అందులో ఒకసారి వైకాపా పార్టీ తరపున గెలిస్తే, మరొకసారి జనసేన పార్టీ తరపున గెలిచారు.

Satyavedu MLA 2024 | పూర్తి జాబితా

Satyavedu MLA 2024 Koneti Adimulam
సత్యవేడు ఎమ్మెల్యే 2024 కోనేటి ఆదిమూలం | Satyavedu MLA 2024 Koneti Adimulam (Source: Facebook Public Domain)

సత్యవేడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. సత్యవేడు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారి శాసనసభ ఎన్నికల ప్రస్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రారంభమైంది. 2014 ఎన్నికల్లో ఆయనకు వైకాపా పార్టీ సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సత్యవేడు నియోజకవర్గం నుంచి వైకాపా పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన తలారి ఆదిత్య తార చంద్రకాంత్ చేతిలో 4,227 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

అనంతరం 2019 శాసనసభ ఎన్నికలలో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన జడ్డా రాజశేఖర్ పైన 44,744 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.

2024 ఎన్నికల్లో వైకాపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు ఎన్డీయే కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున సత్యవేడు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన నూకతోటి రాజేష్ పైన 3739 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు.

ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, అందులో ఒకసారి ఓడిపోయారు. మిగతా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Venkatagiri MLA 2024 | పూర్తి జాబితా

Venkatagiri MLA 2024 Kurugondla RamaKrishna
వెంకటగిరి ఎమ్మెల్యే 2024 కురుగొండ్ల రామకృష్ణ | Venkatagiri MLA 2024 Kurugondla RamaKrishna (Source : Facebook)

వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. అంతేకాకుండా ఆయన టిడిపి పార్టీ సీనియర్ నాయకులు మరియు రాజకీయ అనుభవజ్ఞులు.

ఆయన ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చారు. 2009 శాసనసభ ఎన్నికలలో టిడిపి పార్టీ కురుగొండ్ల రామకృష్ణ గారికి వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన నేదురుమల్లి రాజ్యలక్ష్మి పైన 6,766 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

అనంతరం 2014 శాసనసభ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొమ్మి లక్ష్మీ నాయుడు పైన 5,635 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన ఆనం రామనారాయణ రెడ్డి చేతిలో 38,720 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.

West Godavari District MLA List 2024
West Godavari District MLA List 2024 (Latest Update ) | పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గానికి గాను నాలుగో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పైన 16,294 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

కురుగొండ్ల రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, అందులో ఒకసారి ఓటమి పాలయ్యారు. మిగతా మూడుసార్లు విజయం సాధించారు.

అంతేకాకుండా ఆయన ఒక అరుదైన రికార్డు సృష్టించారు. అదేంటంటే వెంకటగిరి నియోజకవర్గం రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీ తరపున అత్యధికంగా మూడుసార్లు గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా అరుదైన రికార్డుని తన సొంతం చేసుకున్నారు.

ఇతర ఏ పార్టీ నాయకులు ఈ నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవలేదు. ప్రస్తుతానికి కురుగొండ్ల రామకృష్ణ గారికే ఆ రికార్డు దక్కింది.

Srikalahasti MLA 2024 | పూర్తి జాబితా

Srikalahasti MLA 2024 Bojjala Venkata Sudhir Reddy
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే 2024 బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి | Srikalahasti MLA 2024 Bojjala Venkata Sudhir Reddy (Source : Facebook)

శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారిది రాజకీయ నేపథ్యం గల కుటుంబం. సుధీర్ రెడ్డి నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. రాజకీయ అనుభవజ్ఞులు మరియు అంతేకాకుండా చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు.

బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున 1989,1994,1999 శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టించారు.

2004 అసెంబ్లీ ఎన్నికల్లో గోపాలకృష్ణ రెడ్డి గారు నాలుగో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్ సి వి నాయుడు చేతిలో 13,078 ఓట్ల తేడాతో మొదటిసారి ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యారు.

ఆ తర్వాత ఆయన 2009 మరియు 2014 శాసనసభ ఎన్నికలలో వరుసగా మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అందులో ఒకసారి ఓడిపోయారు. మిగతా ఐదు సార్లు గెలిచి ఘనవిజయం సాధించారు. అంతేకాకుండా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అత్యధిక సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డుని సొంతం చేసుకున్నారు.

బొజ్జల సుధీర్ రెడ్డి గారు తండ్రి రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ 2019 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2019 ఎన్నికల్లో సుధీర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన బియ్యపు మధుసూదన్ రెడ్డి చేతిలో 38,141 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.

2024 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన బియ్యపు మధుసూదన్ రెడ్డి పైన 43,304 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.

ఆయన 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 38,141 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. కానీ 2024 శాసనసభ ఎన్నికల్లో 43,304 బలమైన భారీ మెజారిటీతో గెలిచి తన సత్తా చాటుకున్నారు.

Sullurpeta MLA 2024 | పూర్తి జాబితా

Sullurpeta MLA 2024 Nelavala Vijayasree
సూళ్లూరుపేట ఎమ్మెల్యే 2024 నెలవల విజయశ్రీ | Sullurpeta MLA 2024 Nelavala Vijayasree (Source : Facebook)

సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వ్ శాసనసభ నియోజకవర్గం. సూళ్లూరుపేట నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆమె రాజకీయ ప్రస్థానం 2024 శాసనసభ ఎన్నికల్లో ప్రారంభమైంది.

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు తెలుగుదేశం పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2024 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ తరపున మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన సంజీవయ్య పైన 29,118 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు.

గత 2014 మరియు 2019 శాసనసభ ఎన్నికల్లో వరుసగా గెలిచిన వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి సంజీవయ్య ను 2024 ఎన్నికల్లో ఎదుర్కొని తొలి ప్రయత్నంలోనే భారీ మెజారిటీతో ఆమె విజయం సాధించింది. అంతేకాకుండా సూళ్లూరుపేట నియోజకవర్గం రాజకీయ చరిత్రలో గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యేగా ఆమె రికార్డుని తన సొంతం చేసుకున్నారు.

Chandragiri MLA 2024 | పూర్తి జాబితా

Chandragiri MLA 2024 Pulivarthi Venkata Mani Prasad
చంద్రగిరి ఎమ్మెల్యే 2024 పులివర్తి వెంకట మణి ప్రసాద్ | Chandragiri MLA 2024 Pulivarthi Venkata Mani Prasad (Source : Facebook)

చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం ముందుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల పునర్విభజనలో భాగంగా 2022 సంవత్సరంలో ఏప్రిల్ 4 వ తేదీన చంద్రగిరి నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లా నుండి వేరు చేసి కొత్త జిల్లా అయిన తిరుపతి జిల్లాలో కలిపారు.

చంద్రగిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 1978 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి జనతా పార్టీకి చెందిన కొంగర పట్టాభి రామ చౌదరి పైన 2,494 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి శాసనసభకు ఎన్నికయ్యారు.

చంద్రగిరి నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో టిడిపి పార్టీ ఆయనకు చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో 41,755 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

అనంతరం 2024 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పైన 43,852 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు.

ఆయన 2019 శాసనసభ ఎన్నికల్లో 41,755 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన కూడా ఐదేళ్లలో ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలపై పోరాడారు. 2024 ఎన్నికల్లో 43,852 ఓట్ల బలమైన మెజారిటీతో విజయం సాధించారు.

చంద్రగిరి నియోజకవర్గంలో 1994 ఎన్నికల్లో పసుపు జెండా ఎగిరింది. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో పులివర్తి నాని గారి గెలుపుతో మళ్లీ పసుపు జెండా రెపరెపలాడింది. సుదీర్ఘ కాలం తర్వాత తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో గెలిచింది. 1999 నుంచి 2019 వరకు చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవలేదు.

2024 శాసనసభ ఎన్నికల ఫలితాలలో గెలిచి తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక విజయం సాధించింది.

Kodur MLA 2024 | పూర్తి జాబితా

Kodur MLA 2024 Arava Sreedhar
కోడూరు ఎమ్మెల్యే 2024 అరవ శ్రీధర్ | Kodur MLA 2024 Arava Sreedhar (Source: Facebook Public Domain)

కోడూరు శాసనసభ నియోజకవర్గం ముందుగా కడప జిల్లాలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 2022 సంవత్సరంలో జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా కోడూరు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో చేర్చారు.

కోడూరు నియోజకవర్గం ప్రజల కోరిక మేరకు, పరిపాలన సౌలభ్యం కోసం 2025 డిసెంబర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోకి చేర్చారు. ప్రస్తుతం కోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లా పరిధిలో ఉంది.

East Godavari District MLA List 2024
East Godavari District MLA List 2024 | తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

కోడూరు శాసనసభ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ప్రస్తుతం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2024 శాసనసభ ఎన్నికల్లో ఆయనకు జనసేన పార్టీ కోడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో కోడూరు శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన కొరముట్ల శ్రీనివాసులు పైన 11,101 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు.

గత 2009,2012,2014 మరియు 2019 ఎన్నికల్లో వరుస విజయాలతో నియోజకవర్గంలో పట్టు ఉన్న కొరముట్ల శ్రీనివాసులు ని ఓడించి మొదటి ప్రయత్నంలోనే అరవ శ్రీధర్ గారు గెలవడం విశేషం.

Comparison Table 2024

ConstituencyWinnerRunnerMargin
TirupatiArani SrinivasuluBhumana Abhinay Reddy61,956
Satyavedu (SC)Koneti AdhimulamNukathoti Rajesh3,739
VenkatagiriKurugondla RamakrishnaNedurumalli Ramkumar Reddy16,294
SrikalahastiBojjala Venkata Krishna ReddyBiyyapu Madhusudhan Reddy43,304
Sullurpeta (SC)Nelavala VijayasreeSanjeevaiah Kiliveti29,118
ChandragiriPulivarthi Venkata Mani PrasadChevireddy Mohit Reddy43,852
KodurArava SreedharKoramutla Srinivasulu11,101

ఆధారాలు (Source): పై పట్టికలోని అభ్యర్థుల మెజారిటీలు మరియు ఎన్నికల ఫలితాల వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా ఇవ్వబడినవి.

Previous Election Comparison ( 2019 VS 2024 )

2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భాగంగా తిరుపతి జిల్లాకు సంబంధించిన ఏడు నియోజకవర్గాల్లోనూ వైకాపా పార్టీ క్లీన్ స్వీప్ చేసి సంచలనం సృష్టించింది. తెలుగుదేశం మన జనసేన పార్టీలు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేక పోయారు.

2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తిరుపతి జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసి ప్రభంజనం సృష్టించింది. వైకాపా పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేక పోయింది.

2019 శాసనసభ ఎన్నికలలో వైకాపా ఫ్యాన్ గాలి గట్టిగానే వీచింది. కానీ 2024 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. ఎన్డీయే కూటమి ప్రభంజనం వైకాపా పార్టీ నిలువ లేకపోయింది.

Alliance Impact 2024

తిరుపతి జిల్లాలో 2024 శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి కలిసి పోటీ చేయడంతో ఓట్లు అనేది చీలడం తగ్గి అభ్యర్థులు మెజారిటీ లు ఊహించని రీతిలో పెరిగాయి. అంతేకాకుండా ఈసారి ఓటర్ల తీర్పు కూడా ప్రభావం చూపించింది.

అంతేకాకుండా తిరుపతి జిల్లాలో జనసేన పార్టీ రెండు చోట్ల పోటీ చేస్తే, రెండు చోట్ల విజయం సాధించింది. మిగతా ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జయకేతనం ఎగురవేసింది.

ముగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో తిరుపతి జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించడం ఒక చారిత్రాత్మక మైలురాయి. వైకాపా పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కలేదు.

ముఖ్య గమనిక (Disclaimer & Credits) :

సమాచార సేకరణ : ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం మరియు ఫోటోలు కేవలం పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మరియు విద్యా ప్రయోజనాల (Informational and Educational Purposes) కోసం మాత్రమే సేకరించబడినవి.

ఫోటో సౌజన్యం : ఇందులో ఉపయోగించిన చిత్రాలు సంబంధిత ఎమ్మెల్యేల అధికారిక Facebook/Social Media ఖాతాల నుండి సేకరించబడినవి. వీటిపై పూర్తి హక్కులు ఆయా వ్యక్తులకు మాత్రమే ఉంటాయి.

మా ఉద్దేశ్యం : ఎటువంటి కాపీరైట్ నియమాలను ఉల్లంఘించడం మా ఉద్దేశ్యం కాదు. కేవలం పాఠకులకు లేటెస్ట్ సమాచారాన్ని అందించడమే UU News లక్ష్యం.

తరచుగా అడిగే ప్రశ్నలు

తిరుపతి జిల్లాలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నాయి?

తిరుపతి జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి.

తిరుపతి జిల్లాలోని నియోజకవర్గాల పేర్లు?

తిరుపతి, సత్యవేడు, సూళ్లూరుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, చంద్రగిరి మరియు కోడూరు.

తిరుపతి ఎమ్మెల్యే ఎవరు 2024?

ఆరణి శ్రీనివాసులు (జనసేన పార్టీ)

సత్యవేడు ఎమ్మెల్యే ఎవరు 2024?

కోనేటి ఆదిమూలం (టిడిపి పార్టీ)

సూళ్లూరుపేట ఎమ్మెల్యే ఎవరు 2024?

నెలవల విజయశ్రీ (టిడిపి పార్టీ)

వెంకటగిరి ఎమ్మెల్యే ఎవరు 2024?

కురుగొండ్ల రామకృష్ణ (టిడిపి పార్టీ)

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఎవరు 2024?

బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి (టిడిపి పార్టీ)

చంద్రగిరి ఎమ్మెల్యే ఎవరు 2024?

పులివర్తి నాని (టిడిపి పార్టీ)

కోడూరు ఎమ్మెల్యే ఎవరు 2024?

అరవ శ్రీధర్ (జనసేన పార్టీ)

Leave a Comment