Nellore District MLA List 2024 : 2024 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గెలుపొందిన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితాను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Nellore District MLA List 2024
2024 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ, ప్రస్తుతానికి కూడా తమ పదవుల్లో కొనసాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో గెలుపొందిన ఎమ్మెల్యేల పేర్లు, నియోజకవర్గాల పేర్లు మరియు పార్టీ పేర్లను ఇక్కడ చూడండి.
| S.NO. | MLA Name | Constituency | Party Name |
| 1 | Kotamreddy Sridhar Reddy | Nellore Rural | TDP |
| 2 | Ponguru Narayana | Nellore City | TDP |
| 3 | Somireddy Chandra Mohan Reddy | Sarvepalli | TDP |
| 4 | Dagumati Venkata Krishna Reddy | Kavali | TDP |
| 5 | Anam Ramanarayana Reddy | Atmakur | TDP |
| 6 | Kakarla Suresh | Udayagiri | TDP |
| 7 | Vemireddy Prashanthi Reddy | Kovur | TDP |
| 8 | Pasam Sunil Kumar | Gudur (SC) | TDP |
Source: ఈ పట్టికలోని వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా సేకరించబడినవి.
Nellore Rural MLA 2024 | పూర్తి జాబితా

నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2014 శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ఆయనకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2014 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు నియోజకవర్గం నుంచి వైకాపా పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి బిజెపి పార్టీకి చెందిన సన్నపురెడ్డి సురేష్ రెడ్డి పైన 25,653 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.
అనంతరం 2019 శాసనసభ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన అబ్దుల్ అజీజ్ పైన 20,776 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
వైకాపా పార్టీతో కొన్ని విభేదాల కారణంగా ఆయన వైఎస్ఆర్సిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన ఆదాల ప్రభాకర్ రెడ్డి పైన 34,480 ఓట్ల మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం 2009 సంవత్సరంలో ఏర్పడినప్పటికీ, 2009,2014 మరియు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. 2024 శాసనసభ ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గెలుపుతో తెలుగుదేశం పసుపు జెండా రెపరెపలాడింది.
ఆయనకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటంటే మొదటిది ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
రెండవది నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 34,480 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన సంచలన రికార్డ్ సృష్టించారు.
Nellore City MLA 2024 | పూర్తి జాబితా

నెల్లూరు సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారు అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది నారాయణ విద్యాసంస్థలు. ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు.
2014 సంవత్సరం లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీ అయ్యి, 2014 నుంచి 2019 సంవత్సరం వరకు చంద్రబాబు గారి మంత్రివర్గంలో ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన అనిల్ కుమార్ చేతిలో 2,988 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
అనంతరం 2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన మొహమ్మద్ ఖలీల్ అహ్మద్ పైన 72,489 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
నెల్లూరు సిటీ నియోజకవర్గం 2009 సంవత్సరం ఏర్పడినప్పటికీ, 2009,2014 మరియు 2019 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా గెలవలేదు. 2024 శాసనసభ ఎన్నికల్లో నారాయణ గారి గెలుపుతో తెలుగుదేశం జయకేతనం ఎగురవేసింది.
అంతేకాకుండా నెల్లూరు సిటీ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 72,489 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా నారాయణ గారు అరుదైన రికార్డుని తన సొంతం చేసుకున్నారు.
ఆయన 2019 మరియు 2024 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి, మొదటిసారి ఓటమి పాలయ్యారు. రెండోసారి భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ప్రస్తుతానికి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Sarvepalli MLA 2024 | పూర్తి జాబితా

సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. చంద్రమోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు రాజకీయ అనుభవజ్ఞులు.
నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కీలక నాయకుల్లో ఆయన ఒకరు. చంద్రబాబు గారి మంత్రివర్గంలో కూడా ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
1994 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తూరు వెంకట శేషారెడ్డి పైన 33,775 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
అనంతరం 1999 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తూరు వెంకట శేషారెడ్డి పైన 16,092 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు.
ఆ తర్వాత 2004 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా పోటీచేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో 7,625 ఓట్ల తేడాతో మొదటిసారి ఎమ్మెల్యేగా పరాజయం పాలయ్యారు.
2009 శాసనసభ ఎన్నికల్లో నాలుగో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో 10,284 ఓట్ల తేడాతో వరుసగా మళ్లీ చిత్తుగా ఓడిపోయారు.
2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సారి ఎమ్మెల్యే గా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన కాకాని గోవర్దన్ రెడ్డి చేతిలో 5,446 ఓట్ల తేడాతో మూడోసారి కూడా ఓడిపోయారు.
2019 శాసనసభ ఎన్నికలలో మళ్ళీ ఆరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన కాకాని గోవర్దన్ రెడ్డి చేతిలో 13,973 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.
ఆయన వరుసగా నాలుగుసార్లు ఓడిపోయిన కూడా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. 2024 శాసనసభ ఎన్నికలలో వరుసగా ఏడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన కాకాని గోవర్దన్ రెడ్డి పైన 16,288 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఆయన సర్వేపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, అందులో మూడుసార్లు విజయం సాధించారు. మిగతా నాలుగు సార్లు పరాజయం పాలయ్యారు.
సర్వేపల్లి నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 33,775 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సంచలన రికార్డ్ సృష్టించారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో 2004,2009,2014 మరియు 2019 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. 2024 శాసనసభ ఎన్నికల్లో చంద్రమోహన్ రెడ్డి గారి గెలుపుతో తెలుగుదేశం పార్టీ పసుపు జెండా రెపరెపలాడింది.
Kavali MLA 2024 | పూర్తి జాబితా

కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆయన ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చారు.
2024 శాసనసభ ఎన్నికలలో ఆయనకు తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పైన 30,948 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2014 మరియు 2019 శాసనసభ ఎన్నికల్లో వరుసగా గెలిచిన వైకాపా అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఓడించి, తొలి ప్రయత్నంలోనే భారీ మెజారిటీతో కృష్ణారెడ్డి గారు గెలవడం విశేషం. అంతేకాకుండా కావలి నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 30,948 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన సంచలన రికార్డ్ సృష్టించారు.
కావలి నియోజకవర్గంలో చివరిసారిగా 2009 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం జెండా ఎగిరింది. ఆ తర్వాత 2014 మరియు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేదు. 2024 ఎన్నికల్లో వెంకట కృష్ణారెడ్డి గారి గెలుపుతో తెలుగుదేశం జయకేతనం ఎగురవేసింది.
Atmakur MLA 2024 | పూర్తి జాబితా

ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయ అనుభవజ్ఞులు మరియు అంతేకాకుండా ఆయన ఎన్టీఆర్ గారి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆయన తెలుగుదేశం, కాంగ్రెస్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. నెల్లూరు జిల్లాలోని సీనియర్ రాజకీయ నాయకులలో ఆయన ఒకరు. ఆయనకు తెలుగుదేశం పార్టీ ద్వారా మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభించింది.
1985 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాపూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన నువ్వుల వెంకటరత్నం నాయుడు పైన 4,912 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
1989 శాసనసభ ఎన్నికలలో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన నువ్వుల వెంకటరత్నం నాయుడు చేతిలో 4,654 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.
1994 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1994 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన వై శ్రీనివాసులు రెడ్డి చేతిలో 8,389 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
ఆ తర్వాత 1999 శాసనసభ ఎన్నికలలో రాపూరు నియోజకవర్గానికి గాను కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి టిడిపి పార్టీకి చెందిన వై శ్రీనివాసులు రెడ్డి పైన 18,644 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2004 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాపూరు నియోజకవర్గానికి గాను కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన వై శ్రీనివాసులు రెడ్డి పైన 5,838 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.
2009 శాసనసభ ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన కొమ్మి లక్ష్మయ్య నాయుడు పైన 18,644 ఓట్ల మెజారిటీతో గెలిచి నాలుగో సారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు.
2019 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వెంకటగిరి నియోజకవర్గం నుంచి వైకాపా పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన కురుగొండ్ల రామకృష్ణ పైన 38,720 ఓట్ల మెజారిటీతో గెలిచి ఐదోసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు.
2024 ఎన్నికల్లో వైకాపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2024 శాసనసభ ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన మేకపాటి విక్రమ్ రెడ్డి పైన 7,576 ఓట్ల మెజారిటీతో గెలిచి ఆరోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఆయన పలుసార్లు మంత్రిగాను కూడా పనిచేశారు. ప్రస్తుతానికి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆయన ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మీ, అందులో ఆరుసార్లు విజయం సాధించారు. మిగతా రెండుసార్లు ఓటమి పాలయ్యారు.
Udayagiri MLA 2024 | పూర్తి జాబితా

ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2024 శాసనసభ ఎన్నికలలో భాగంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో ఉదయగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి పైన 9,621 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
Kovur MLA 2024 | పూర్తి జాబితా

కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆమెకు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పైన 54,583 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
కోవూరు నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 54,583 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డుని తన సొంతం చేసుకుంది. అంతేకాకుండా కోవూరు శాసనసభ నియోజకవర్గంలో గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యేగా సంచలన రికార్డుని సృష్టించారు.
Gudur MLA 2024 | పూర్తి జాబితా

గూడూరు నియోజకవర్గం ముందుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండేది. 2022 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల పునర్విభజనలో భాగంగా గూడూరు ని కొత్త జిల్లా అయిన తిరుపతి జిల్లాలో కలిపారు.
ప్రజల కోరిక మేరకు పరిపాలన సౌలభ్యం కోసం గూడూరు నియోజకవర్గాన్ని 2026 సంవత్సరంలో తిరిగి నెల్లూరు జిల్లాలో చేర్చారు. ప్రస్తుతానికి గూడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఉంది.
గూడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ప్రస్తుత ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆయన పార్టీ తరపున వివిధ హోదాల్లో పనిచేశారు. రాజకీయ సమీకరణాల వల్ల ఆయనకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు.
ఆ తర్వాత ఆయన 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 శాసనసభ ఎన్నికల్లో ఆయనకు వైకాపా పార్టీ గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో గూడూరు నియోజకవర్గం నుంచి వైకాపా పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన బత్తల రాధా జ్యోత్స్న లత పైన 9,048 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
అనంతరం ఆయన 2016 సంవత్సరంలో వైకాపా పార్టీని వీడి తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన వర ప్రసాద్ రావు చేతిలో 45,459 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.
2024 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన మెరిగా మురళీధర్ పైన 21,192 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.
సునీల్ గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, అందులో ఒకసారి పరాజయం పాలయ్యారు. మిగతా రెండుసార్లు ఘనవిజయం సాధించారు.
Comparison Table 2024
| Constituency | Winner | Runner | Margin |
| Nellore Rural | Kotamreddy Sridhar Reddy | Adala Prabhakara Reddy | 34,480 |
| Nellore City | Ponguru Narayana | Mohammad Khaleel Ahmad | 72,489 |
| Sarvepalli | Somireddy Chandra Mohan Reddy | Kakani Govardhan Reddy | 16,288 |
| Kavali | Dagumati Venkata Krishna Reddy | Ramireddy Pratap Kumar Reddy | 30,948 |
| Atmakur | Anam Ramanarayana Reddy | Mekapati Vikram Reddy | 7,576 |
| Udayagiri | Kakarla Suresh | Mekapati Rajagopal Reddy | 9,621 |
| Kovur | Vemireddy Prashanthi Reddy | Nallapareddy Prasanna Kumar Reddy | 54,583 |
| Gudur | Pasam Sunil Kumar | Meriga Muralidhar | 21,192 |
ఆధారాలు (Source): పై పట్టికలోని అభ్యర్థుల మెజారిటీలు మరియు ఎన్నికల ఫలితాల వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా ఇవ్వబడినవి.
Previous Election Comparison ( 2019 VS 2024 )
2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి సంచలన రికార్డ్ సృష్టించింది. తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేక పోయారు.
2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లో ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసి ప్రభంజనం సృష్టించింది. అన్ని సీట్లను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. వైకాపా పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కలేదు.
2019 శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తే, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసి చారిత్రాత్మక విజయం సాధించింది.
Alliance Impact 2024
నెల్లూరు జిల్లాలో 2024 శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తెలుగుదేశం జనసేన మరియు బిజెపి పార్టీల ఓట్లు బదిలీ సరిగ్గా జరగడంతో నెల్లూరు సిటీ మరియు కోవూరు నియోజకవర్గాల్లో భారీ మెజారిటీ లు నమోదు అయ్యాయి. అంతేకాకుండా యువత ఓటర్లు మరియు తటస్థ ఓటర్లు తీర్పు కూటమి వైపే మొగ్గు చూపారు. అందువలన నెల్లూరు జిల్లాలో ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసి చారిత్రాత్మక రికార్డుని అందుకుంది.
ముగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 వ సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో భాగంగా నెల్లూరు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేక పోయింది.
2024 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కొత్త వారిని ప్రోత్సహించింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో మొదటిసారి ఎమ్మెల్యేలు గెలవడం విశేషం.
ముఖ్య గమనిక (Disclaimer & Credits) :
సమాచార సేకరణ : ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం మరియు ఫోటోలు కేవలం పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మరియు విద్యా ప్రయోజనాల (Informational and Educational Purposes) కోసం మాత్రమే సేకరించబడినవి.
ఫోటో సౌజన్యం : ఇందులో ఉపయోగించిన చిత్రాలు సంబంధిత ఎమ్మెల్యేల అధికారిక Facebook/Social Media ఖాతాల నుండి సేకరించబడినవి. వీటిపై పూర్తి హక్కులు ఆయా వ్యక్తులకు మాత్రమే ఉంటాయి.
మా ఉద్దేశ్యం : ఎటువంటి కాపీరైట్ నియమాలను ఉల్లంఘించడం మా ఉద్దేశ్యం కాదు. కేవలం పాఠకులకు లేటెస్ట్ సమాచారాన్ని అందించడమే UU News లక్ష్యం.
తరచుగా అడిగే ప్రశ్నలు
నెల్లూరు జిల్లాలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి?
నెల్లూరు జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గాల పేర్లు
నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, కావలి, కోవూరు, ఉదయగిరి, ఆత్మకూరు మరియు గూడూరు
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ఎవరు 2024?
పొంగూరు నారాయణ
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఎవరు 2024?
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
సర్వేపల్లి ఎమ్మెల్యే ఎవరు 2024?
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఆత్మకూరు ఎమ్మెల్యే ఎవరు 2024?
ఆనం రామనారాయణ రెడ్డి
కావలి ఎమ్మెల్యే ఎవరు 2024?
దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి
ఉదయగిరి ఎమ్మెల్యే ఎవరు 2024?
కాకర్ల సురేష్
కోవూరు ఎమ్మెల్యే ఎవరు 2024?
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
గూడూరు ఎమ్మెల్యే ఎవరు 2024?
పాశిం సునీల్ కుమార్
నెల్లూరు జిల్లాలోని మంత్రులు ఎవరు 2024?
పొంగూరు నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి.
