West Godavari District MLA List 2024 | 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో గెలుపొందిన పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితాను తెలుసుకుందాం.
West Godavari District MLA List 2024
2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా గెలిచిన పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ, ప్రస్తుతం జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో భాగంగా గెలుపొందిన పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల పేర్లు, ఎమ్మెల్యేల పేర్లు మరియు పార్టీ పేర్లను ఇక్కడ చూడండి.
| S.NO. | MLA Name | Constituency | Party Name |
| 1 | Nimmala Rama Naidu | Palakollu | TDP |
| 2 | Pulaparthi Ramanjaneyulu | Bhimavaram | JSP |
| 3 | Pithani Satyanarayana | Achanta | TDP |
| 4 | Raghu Rama Krishna Raju | Undi | TDP |
| 5 | Bolisetti Srinivas | Tadepalligudem | JSP |
| 6 | Bommidi Narayana Nayakar | Narasapuram | JSP |
| 7 | Arimilli Radha Krishna | Tanuku | TDP |
Source: ఈ పట్టికలోని వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా సేకరించబడినవి.
Palakollu MLA 2024 | పూర్తి జాబితా

నిమ్మల రామానాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ సుపరిచితమే. పాలకొల్లు నియోజకవర్గం ప్రజలతో మమేకమై, అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రామానాయుడు గారు ప్రజల నాయకుడు.
పాలకొల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2014 శాసనసభ ఎన్నికలలో భాగంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ పాలకొల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పాలకొల్లు నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన మేక శేషుబాబు పైన 6,383 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పాలకొల్లు నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన సత్యనారాయణ మూర్తి పైన 17,809 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో పాలకొల్లు నియోజకవర్గం నుంచి టిడిపి తరపున ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన గూడల శ్రీ హరి గోపాలరావు పైన 67,945 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టించారు.
నిమ్మల రామానాయుడు గారు పాలకొల్లు నియోజకవర్గం నుంచి మూడుసార్లు వరుసగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి మూడుసార్లు ఘనవిజయం సాధించారు. అంతేకాకుండా ( 2014,2019,2024 ) శాసనసభ ఎన్నికల్లో వరుసగా గెలిచి తెలుగుదేశం పార్టీ జెండా జయకేతనం ఎగురవేసింది.
పాలకొల్లు నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 67,945 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన సంచలన రికార్డ్ సృష్టించారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Bhimavaram MLA 2024 | పూర్తి జాబితా

భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2009 శాసనసభ ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2009 శాసనసభ ఎన్నికలలో భీమవరం నియోజకవర్గానికి గాను కాంగ్రెస్ పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీకి చెందిన వేగేశ్న సూర్యనారాయణ రాజు పైన 22,099 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున భీమవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన గ్రంధి శ్రీనివాస్ పైన 13,726 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.
2019 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన గ్రంధి శ్రీనివాస్ చేతిలో 16,606 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేయడంతో ఆయన మూడవ స్థానంలో నిలిచారు.
2024 ఎన్నికల పొత్తులో భాగంగా భీమవరం నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించడంతో, కూటమి నిర్ణయం మేరకు ఆయన జనసేన పార్టీలో చేరారు. ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ గుర్తుపై పోటీ చేశారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున భీమవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన గ్రంధి శ్రీనివాస్ పైన 66,974 ఓట్ల అతిపెద్ద భారీ మెజారిటీతో గెలిచి మూడోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా, అందులో మూడుసార్లు ఘనవిజయం సాధించారు. మిగతా ఒకసారి పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Achanta MLA 2024 | పూర్తి జాబితా

ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. 2004 శాసనసభ ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2004 శాసనసభ ఎన్నికలలో పెనుగొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన వీర రాఘవేంద్రరావు పైన 18,020 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆచంట నియోజకవర్గానికి గాను కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన కర్రీ రాధాకృష్ణా రెడ్డి పైన 15,755 ఓట్ల మెజారిటీతో వరుసగా రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఆచంట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ప్రసాద్ రాజు పైన 3,920 ఓట్ల మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆచంట నియోజకవర్గం నుంచి టిడిపి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు చేతిలో 12,886 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆచంట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు పైన 26,554 ఓట్ల మెజారిటీతో గెలిచి నాలుగోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఎన్నికయ్యారు.
పితాని సత్యనారాయణ ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, అందులో ఒకసారి పరాజయం చెందారు. మిగతా నాలుగు సార్లు ఘనవిజయం సాధించారు.
Undi MLA 2024 | పూర్తి జాబితా

ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘు రామ కృష్ణ రాజు గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2014 లోక్ సభ ఎన్నికలలో భాగంగా వైకాపా ఆయనకు టికెట్ ఇవ్వలేదు.
ఆ తర్వాత బిజెపి తెలుగుదేశం అటు ఇటు పార్టీలు మారారు. మళ్లీ 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు వైకాపా 2019 ఎన్నికలలో నరసాపురం లోక్ సభ నియోజకవర్గం ఎంపీ టికెట్ ఇచ్చింది.
2019 లోక్ సభ ఎన్నికలలో నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మొదటిసారి ఎంపీగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన వేటూకూరి వెంకట శివరామరాజు గారి పైన 31,909 ఓట్ల మెజారిటీతో మొదటిసారి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత 2024 సంవత్సరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కొన్ని విభేదాల కారణంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. 2024 శాసనసభ ఎన్నికలలో ఆయనకు తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో ఉండి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన పి.వి.ఎల్. నరసింహ రాజు పైన 56,777 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Tadepalligudem MLA 2024 | పూర్తి జాబితా

తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ గారు యువజన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. కొన్నాళ్లపాటు అక్కడే ఆయన వివిధ హోదాల్లో పని చేశారు. ఆ తర్వాత 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు.
2019 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. 2019 ఎన్నికలలో ఆయనకు జనసేన పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి గాను జనసేన పార్టీ తరపున మొట్టమొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కొట్టు సత్యనారాయణ చేతిలో 34,544 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. వైకాపా వర్సెస్ టిడిపి మధ్య గట్టి పోటీ ఉండడంతో ఆ ఎన్నికల్లో ఆయన మూడవ స్థానంలో నిలిచారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కొట్టు సత్యనారాయణ పైన 62,492 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ప్రస్తుతం ఆయన శాసనసభలో విప్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Narasapuram MLA 2024 | పూర్తి జాబితా

నరసాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు జనసేన పార్టీ నరసాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో నరసాపురం నియోజకవర్గానికి గాను జనసేన పార్టీ తరపున మొట్టమొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన ముదునూరి ప్రసాద్ రాజు చేతిలో 6,436 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా నరసాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ముదునూరి ప్రసాద్ రాజు పైన 49,738 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ప్రస్తుతం ఆయన శాసనసభలో విప్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Tanuku MLA 2024 | పూర్తి జాబితా

తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2014 ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తణుకు నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున మొట్టమొదటి సారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన చీర్ల రాధాకృష్ణ పైన 30,948 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తణుకు నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు చేతిలో 2,195 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో తణుకు నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు పైన 72,121 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
తణుకు నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 72,121 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన సంచలన రికార్డ్ సృష్టించారు.
Comparison Table 2024
| Constituency | Winner | Runner | Margin |
| Palakollu | Nimmala Rama Naidu | Gudala Srihari Gopala Rao | 67,945 |
| Bhimavaram | Pulaparthi Ramanjaneyulu | Grandhi Srinivas | 66,974 |
| Achanta | Pithani Satyanarayana | Cherukuvada Sri Ranganadha Raju | 26,554 |
| Undi | Raghu Rama Krishna Raju | P. V. L. Narasimha Raju | 56,777 |
| Tadepalligudem | Bolisetti Srinivas | Kottu Satyanarayana | 62,492 |
| Narasapuram | Bommidi Narayana Nayakar | Mudunuri Prasad Raju | 49,738 |
| Tanuku | Arimilli Radha Krishna | Karumuri Venkata Nageswara Rao | 72,121 |
ఆధారాలు (Source): పై పట్టికలోని అభ్యర్థుల మెజారిటీలు మరియు ఎన్నికల ఫలితాల వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా ఇవ్వబడినవి.
Previous Election Comparison ( 2019 VS 2024 )
2019 తో పోలిస్తే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి.
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించిన ఏడు నియోజకవర్గాల్లో, జిల్లా అంతా ఫ్యాన్ గాలి బలంగా వీచింది. ఐదు స్థానాల్లో వైకాపా కైవసం చేసుకోగా, తెలుగుదేశం పార్టీ కేవలం రెండు స్థానాలనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
2024 శాసనసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో సీన్ మొత్తం మారిపోయింది. పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించిన ఏడు నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసి ప్రభంజనం సృష్టించింది. ఒక్క నియోజకవర్గంలో కూడా వైకాపా జెండా ఎగరకపోవడం జిల్లా రాజకీయాల్లోనే చర్చనీయాంశం అయ్యింది.
Alliance Impact 2024
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ( తెలుగుదేశం, జనసేన మరియు బిజెపి ) కలయిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కూటమి ప్రభావం బలంగా కనిపించింది.
జిల్లాలోని యువత మరియు తటస్థ ఓటర్లు కూటమి వైపే మొగ్గు చూపారు. దీని ఫలితం గానే ఎన్డీయే కూటమి అభ్యర్థులు చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. తణుకు, పాలకొల్లు మరియు భీమవరం నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో మెజారిటీలు నమోదు అయ్యాయి.
ముగింపు
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి అభ్యర్థులు ప్రభంజనం సృష్టించి క్లీన్ స్వీప్ చేయడం అనేది ఒక చారిత్రాత్మక రికార్డు. వైకాపా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కించుకోలేకపోయింది.
ముఖ్య గమనిక (Disclaimer & Credits) :
సమాచార సేకరణ : ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం మరియు ఫోటోలు కేవలం పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మరియు విద్యా ప్రయోజనాల (Informational and Educational Purposes) కోసం మాత్రమే సేకరించబడినవి.
ఫోటో సౌజన్యం : ఇందులో ఉపయోగించిన చిత్రాలు సంబంధిత ఎమ్మెల్యేల అధికారిక Facebook/Social Media ఖాతాల నుండి సేకరించబడినవి. వీటిపై పూర్తి హక్కులు ఆయా వ్యక్తులకు మాత్రమే ఉంటాయి.
మా ఉద్దేశ్యం : ఎటువంటి కాపీరైట్ నియమాలను ఉల్లంఘించడం మా ఉద్దేశ్యం కాదు. కేవలం పాఠకులకు లేటెస్ట్ సమాచారాన్ని అందించడమే UU News లక్ష్యం.
తరచుగా అడిగే ప్రశ్నలు
పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి?
పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో గెలిచింది 2024?
జనసేన పార్టీ మూడు నియోజకవర్గాల్లో గెలిచింది.
పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో గెలిచింది 2024?
టిడిపి పార్టీ నాలుగు నియోజకవర్గాల్లో గెలిచింది.
పాలకొల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
నిమ్మల రామానాయుడు ( టిడిపి పార్టీ )
భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
పులపర్తి రామాంజనేయులు ( జనసేన పార్టీ )
ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
పితాని సత్యనారాయణ ( టిడిపి పార్టీ )
ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
రఘు రామ కృష్ణ రాజు ( టిడిపి పార్టీ )
తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
బోలిశెట్టి శ్రీనివాస్ ( జనసేన పార్టీ )
నరసాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
బొమ్మిడి నారాయణ నాయకర్ ( జనసేన పార్టీ )
తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
ఆరిమిల్లి రాధాకృష్ణ ( టిడిపి పార్టీ )
