Anakapalli District MLA List 2024 | 2024 లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితాను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Anakapalli District MLA List 2024
2024 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గెలిచిన అనకాపల్లి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ, ప్రస్తుతానికి కూడా తమ పదవుల్లో కొనసాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో మొత్తం ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అనకాపల్లి జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేల పేర్లు, నియోజకవర్గాల పేర్లు మరియు పార్టీ పేర్లను ఇక్కడ చూడండి.
| S.NO. | MLA Name | Constituency | Party Name |
| 1 | Konathala Ramakrishna | Anakapalle | JSP |
| 2 | Chintakayala Ayyanna Patrudu | Narsipatnam | TDP |
| 3 | Sundarapu Vijay Kumar | Elamanchili | JSP |
| 4 | Bandaru Satyanarayana Murthy | Madugula | TDP |
| 5 | Vangalapudi Anitha | Payakaraopet (SC) | TDP |
| 6 | Kalidindi Surya Naga Sanyasi Raju | Chodavaram | TDP |
Source: ఈ పట్టికలోని వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా సేకరించబడినవి.
Anakapalle MLA 2024 | పూర్తి జాబితా

అనకాపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. కొణతాల రామకృష్ణ గారు సీనియర్ నాయకులు మరియు రాజకీయ అనుభవజ్ఞుడు.
అనకాపల్లిలో మంచి పట్టు ఉన్న నాయకుడు. 1989 లోక్ సభ ఎన్నికలలో భాగంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం ఎంపీ టికెట్ ఇచ్చింది.
1989 లోక్ సభ ఎన్నికలలో అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గానికి గాను కాంగ్రెస్ పార్టీ తరపున మొట్టమొదటిసారి ఎంపీగా పోటీ చేసి, తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన పెతకంశెట్టి అప్పల నరసింహం పైన అతి తక్కువ 9 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎంపీగా విజయం సాధించారు.
అనంతరం 1991 ఎన్నికలలో మళ్లీ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున వరుసగా రెండోసారి పోటీ చేసి, తన ప్రత్యర్థి టిడిపికి చెందిన పెతకంశెట్టి అప్పల నరసింహం పైన 11,158 ఓట్ల మెజారిటీతో వరుసగా రెండోసారి ఎంపీగా ఘనవిజయం సాధించారు.
1996 ఆంధ్రప్రదేశ్ లోక్ సభ ఎన్నికలలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున ముచ్చటగా మూడోసారి పోటీ చేసి, తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతిలో 50,172 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
1999 శాసనసభ ఎన్నికలలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
1999 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి, తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన దాడి వీరభద్రరావు చేతిలో 3711 ఓట్ల తేడాతో పరాజయం చెందారు.
2004 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో అనకాపల్లి నియోజకవర్గానికి గాను వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి టిడిపికి చెందిన దాడి వీరభద్రరావు పైన 17,033 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2009 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీకి చెందిన గంటా శ్రీనివాసరావు గారి చేతిలో 10,866 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత కొణతాల రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీని వీడి 2014 సంవత్సరంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనకాపల్లి జిల్లా రాజకీయాల్లో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు.
2024 శాసనసభ ఎన్నికలలో ఆయన జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ ఆయనకు అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన భరత్ కుమార్ పైన 65,764 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2004 నుంచి 2009 మధ్య కాలంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 65,764 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన ఒక అరుదైన రికార్డుని తన సొంతం చేసుకున్నారు.
Narsipatnam MLA 2024 | పూర్తి జాబితా

నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు రాజకీయాల్లో మంచి పట్టు ఉన్న నాయకుడు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటిదాకా పార్టీని వీడలేదు. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు.
ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపకుడు రామారావు గారికి అత్యంత సన్నిహితుడు. 1983 శాసనసభ ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆయనకు నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
ఆయన 1983 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో నర్సీపట్నం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన రామచంద్ర సాగి పైన అతి తక్కువ 992 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
1985 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీ రామమూర్తి పైన 811 అతి తక్కువ ఓట్ల మెజారిటీతో వరుసగా రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాక రామారావు గారి పిలిచి మరి మంత్రి పదవి ఇచ్చారని, చిన్న వయసులోనే మంత్రిగా చేసిన నాయకుడిగా రికార్డు అని చాలా సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది. ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో ఆయన సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
1989 శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన కృష్ణమూర్తి రాజు చేతిలో 10,955 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
1994 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో నర్సీపట్నం నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కృష్ణమూర్తి రాజు పైన 21,179 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
1996 లోక్ సభ ఎన్నికలలో ఆయనకు తెలుగుదేశం పార్టీ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి టికెట్ ఇచ్చింది.
1996 లోక్ సభ ఎన్నికలలో ఆయన తెలుగుదేశం పార్టీ తరపున అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎంపీగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొణతాల రామకృష్ణ పైన 50,172 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎంపీగా విజయం సాధించారు.
అనంతరం 1998 లోక్ సభ ఎన్నికలలో ఆయన అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన గుడివాడ గురునాథ రావు చేతిలో 25,925 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత 1999 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో నర్సీపట్నం శాసనసభ నియోజకవర్గం నుంచి టిడిపి తరపున ఐదోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన రామచంద్ర రాజు గారి పైన 8,559 ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీకి నాలుగో సారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు.
2004 శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఆరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి వెంకట సూర్యనారాయణ రాజు పైన 23,930 ఓట్ల మెజారిటీతో గెలిచి ఐదోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2009 శాసనసభ ఎన్నికలలో నర్సీపట్నం నియోజకవర్గం నుంచి వరుసగా ఏడో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన బోలెం ముత్యాల పాప చేతిలో 8,287 ఓట్ల తేడాతో పరాజయం చెందారు.
2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా ఎనిమిదో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ఉమాశంకర్ పైన 2,338 ఓట్ల మెజారిటీతో గెలిచి ఆరోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో నర్సీపట్నం నియోజకవర్గం నుంచి తొమ్మిదో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ఉమాశంకర్ చేతిలో 23,366 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో నర్సీపట్నం నియోజకవర్గం నుంచి పదో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ఉమాశంకర్ పైన 24,676 ఓట్ల మెజారిటీతో గెలిచి ఏడో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఆయన తెలుగుదేశం పార్టీ తరపున నర్సీపట్నం నియోజకవర్గం నుంచి పది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అందులో ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. అదేవిధంగా అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా రెండుసార్లు పోటీ చేస్తే, ఒకసారి విజయం సాధించారు. మరొకసారి ఓటమి పాలయ్యారు.
నర్సీపట్నం శాసనసభ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో అత్యధికంగా ఏడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు.
ఆయన తెలుగుదేశం పార్టీ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా, రోడ్లు మరియు భవనాలు శాఖ మంత్రిగా మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతానికి ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Elamanchili MLA 2024 | పూర్తి జాబితా

ఎలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2019 శాసనసభ ఎన్నికలలో జనసేన పార్టీ ఆయనకు ఎలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఎలమంచిలి నియోజకవర్గానికి గాను జనసేన పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేయగా కేవలం 20,074 ఓట్లు మాత్రమే నమోదు అయ్యాయి. ఎందుకంటే టిడిపి వర్సెస్ వైకాపా మధ్య గట్టి పోటీ ఉండడంతో ఆయనకు ఓట్లు తక్కువగా రావడం వల్ల ఓటమి పాలయ్యారు.
2024 అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి జనసేన మరియు బిజెపి కూటమి పొత్తు కలయికతో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ ఆయనకు ఎలమంచిలి శాసనసభ నియోజకవర్గం టికెట్ ఇచ్చింది.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో ఎలమంచిలి నియోజకవర్గం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నా బాబు) పైన 48,956 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఎలమంచిలి శాసనసభ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 48,956 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు ఆయన పేరిట ఉంది.
Madugula MLA 2024 | పూర్తి జాబితా

మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీలోని అత్యంత సీనియర్ నాయకులలో ఒకరు.
ఆయన పరవాడ శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున 1989, 1994 మరియు 1999 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టించారు.
2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పెందుర్తి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీకి చెందిన పంచకర్ల రమేష్ బాబు చేతిలో 8,239 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికలలో ఆయన మూడవ స్థానంలో నిలిచారు.
2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన గండి బాబ్జీ పైన 18,648 ఓట్ల మెజారిటీతో గెలిచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
2019 శాసనసభ ఎన్నికలలో పెందుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన అన్నం రెడ్డి అదీప్ రాజ్ చేతిలో 28,860 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో మాడుగుల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ఎర్లే అనురాధ పైన 28,026 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు.
Payakaraopet MLA 2024 | పూర్తి జాబితా

పాయకరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే వంగలపూడి అనిత గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం.
రాజకీయాల్లోకి రాకముందు ఆమె టీచర్ గా సేవలందించారు. ఆ తర్వాత ఆమె సమాజ సేవ పై ఉన్న ఆసక్తితో రాజకీయాల్లోకి ప్రవేశించారు.
2014 శాసనసభ ఎన్నికల్లో ఆమెకు తెలుగుదేశం పార్టీ పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన చెంగల వెంకటరావు పైన 2,828 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఆ తర్వాత 2019 శాసనసభ ఎన్నికల్లో ఆమెకు తెలుగుదేశం పార్టీ కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి టిడిపి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన తానేటి వనిత చేతిలో 25,248 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కంబాల జోగులు పైన 43,727 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 43,727 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డుని తన ఖాతాలో వేసుకున్నారు.
ఆమె ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోం వ్యవహారాలు మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది.
Chodavaram MLA 2024 | పూర్తి జాబితా

చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. టిడిపి సీనియర్ నాయకులు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎప్పుడు పార్టీ మారలేదు.
2009 శాసనసభ ఎన్నికలలో భాగంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో చోడవరం నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన కరణం ధర్మశ్రీ పైన 1,385 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో చోడవరం నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కరణం ధర్మశ్రీ పైన 612 అతి తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2019 శాసనసభ ఎన్నికలలో చోడవరం నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కరణం ధర్మశ్రీ చేతిలో 27,637 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో చోడవరం నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కరణం ధర్మశ్రీ పైన 42,189 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు.
ఆయన తెలుగుదేశం పార్టీ తరపున చోడవరం నియోజకవర్గం నుంచి ( 2009,2014, 2019 మరియు 2024 ) నాలుగు సార్లు పోటీ చేస్తే, అందులో మూడుసార్లు ఘనవిజయం సాధించారు. మిగతా ఒకసారి ఓటమి పాలయ్యారు.
చోడవరం శాసనసభ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 42,189 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా సంచలన రికార్డ్ సృష్టించారు.
Comparison Table 2024
| Constituency | Winner | Runner | Margin |
| Anakapalle | Konathala Ramakrishna | Malasala Bharath Kumar | 65,764 |
| Narsipatnam | Chintakayala Ayyanna Patrudu | Petla Uma Shankara Ganesh | 24,676 |
| Elamanchili | Sundarapu Vijay Kumar | Kanna Babu | 48,956 |
| Madugula | Bandaru Satyanarayana Murthy | Erli Anuradha | 28,026 |
| Payakaraopet | Vangalapudi Anitha | Kambala Jogulu | 43,727 |
| Chodavaram | Kalidindi Surya Naga Sanyasi Raju | Karanam Dharmasri | 42,189 |
ఆధారాలు (Source): పై పట్టికలోని అభ్యర్థుల మెజారిటీలు మరియు ఎన్నికల ఫలితాల వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా ఇవ్వబడినవి.
Previous Election Comparison ( 2019 VS 2024)
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో అనకాపల్లి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లోనూ వైకాపా క్లీన్ స్వీప్ చేసి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆ ఎన్నికలలో టిడిపి మరియు జనసేన పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేక పోయాయి.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్ అయ్యింది. ఈసారి అనకాపల్లి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసి ప్రభంజనం సృష్టించింది. వైకాపా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేక పోయింది.
Alliance Impact 2024
2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి పొత్తు కీలక పాత్ర పోషించింది. ఈ కూటమి పొత్తు ప్రభావంతోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం ఆగిపోయి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. అంతేకాకుండా అనకాపల్లి జిల్లా యువత మరియు తటస్థ ఓటర్లు కూటమి వైపే మొగ్గు చూపారు.
ముగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో అనకాపల్లి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేసి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. అందులో టిడిపి నాలుగు స్థానాల్లో విజయం సాధించగా, మిగతా రెండు స్థానాల్లో జనసేన పార్టీ జెండా ఎగురవేసింది. వైకాపా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కించుకోలేకపోయింది.
ముఖ్య గమనిక (Disclaimer & Credits) :
సమాచార సేకరణ : ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం మరియు ఫోటోలు కేవలం పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మరియు విద్యా ప్రయోజనాల (Informational and Educational Purposes) కోసం మాత్రమే సేకరించబడినవి.
ఫోటో సౌజన్యం : ఇందులో ఉపయోగించిన చిత్రాలు సంబంధిత ఎమ్మెల్యేల అధికారిక Facebook/Social Media ఖాతాల నుండి సేకరించబడినవి. వీటిపై పూర్తి హక్కులు ఆయా వ్యక్తులకు మాత్రమే ఉంటాయి.
మా ఉద్దేశ్యం : ఎటువంటి కాపీరైట్ నియమాలను ఉల్లంఘించడం మా ఉద్దేశ్యం కాదు. కేవలం పాఠకులకు లేటెస్ట్ సమాచారాన్ని అందించడమే UU News లక్ష్యం.
తరచుగా అడిగే ప్రశ్నలు
అనకాపల్లి జిల్లాలో మొత్తం ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి 2024?
అనకాపల్లి జిల్లాలో మొత్తం ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి.
2024 లో అనకాపల్లి జిల్లాలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచింది?
టిడిపి పార్టీ నాలుగు ఎమ్మెల్యే సీట్లను గెలిచింది.
2024 లో అనకాపల్లి జిల్లాలో వైకాపా పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది?
వైకాపా పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేక పోయింది.
అనకాపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
కొణతాల రామకృష్ణ ( జనసేన పార్టీ)
నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
చింతకాయల అయ్యన్నపాత్రుడు ( టిడిపి పార్టీ )
ఎలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
సుందరపు విజయ్ కుమార్ ( జనసేన పార్టీ )
మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
బండారు సత్యనారాయణ మూర్తి ( టిడిపి పార్టీ )
పాయకరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
వంగలపూడి అనిత ( టిడిపి పార్టీ )
చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు ( టిడిపి పార్టీ )
