Srikakulam District MLA List 2024 : 2024 లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితాను తెలుసుకుందాం.
Srikakulam District MLA List 2024
2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ, ప్రస్తుతానికి కూడా తమ పదవుల్లో కొనసాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల పేర్లు, ఎమ్మెల్యేల పేర్లు మరియు పార్టీ పేర్లను ఇక్కడ చూడండి.
| S.NO. | MLA Name | Constituency | Party Name |
| 1 | Gouthu Sireesha | Palasa | TDP |
| 2 | Kinjarapu Atchannaidu | Tekkali | TDP |
| 3 | Ashok Bendalam | Ichchapuram | TDP |
| 4 | Baggu Ramanamurthy | Narasannapeta | TDP |
| 5 | Gondu Shankar | Srikakulam | TDP |
| 6 | Mamidi Govinda Rao | Pathapatnam | TDP |
| 7 | Koona Ravi Kumar | Amadalavalasa | TDP |
| 8 | Nadukuditi Eswara Rao | Etcherla | BJP |
Source: ఈ పట్టికలోని వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా సేకరించబడినవి.
Palasa MLA 2024 పూర్తి జాబితా

పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శిరీష గారిది రాజకీయ నేపథ్యం గల కుటుంబం. శిరీష గారి తాత గౌతు లచ్చన్న స్వాతంత్ర్య సమర యోధుడు మరియు అంతేకాకుండా సీనియర్ రాజకీయ నాయకులు.
అలాగే ఆమె తండ్రి గారు గౌతు శ్యాం సుందర్ శివాజీ గారు కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. శ్యాం సుందర్ గారు సోంపేట నియోజకవర్గం నుంచి టిడిపి తరపున 1985 నుంచి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సృష్టించారు.
గౌతు శ్యాం సుందర్ గారు 2009 శాసనసభ ఎన్నికల్లో పలాస నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన జుట్టు జగన్నాయకులు చేతిలో 6,814 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
2014 శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో పలాస నియోజకవర్గానికి గాను ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన బాబురావు వజ్జా పైన 17,525 ఓట్ల మెజారిటీతో గెలిచి ఘనవిజయం సాధించారు.
తాత మరియు తండ్రి గారి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ గౌతు శిరీష గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2019 శాసనసభ ఎన్నికలలో భాగంగా ఆమెకు టిడిపి పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పలాస నియోజకవర్గం నుంచి టిడిపి తరపున ఆమె మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన సిదిరి అప్పలరాజు చేతిలో 16,247 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
ఆ తర్వాత 2024 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన సిదిరి అప్పలరాజు పైన 40,350 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఆమె పలాస నియోజకవర్గంలో రెండు అరుదైన రికార్డులను తన సొంతం చేసుకున్నారు. అవేంటంటే పలాస నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 40,350 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా సంచలన రికార్డు సృష్టించారు.
అంతేకాకుండా పలాస నియోజకవర్గంలో గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యేగా మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నారు.
Tekkali MLA 2024 పూర్తి జాబితా

టెక్కలి శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు పలుసార్లు మంత్రిగాను పనిచేశారు.
చంద్రబాబు నాయుడు గారి అత్యంత సన్నిహితుడు. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కీలక నాయకుల్లో ఆయన ఒకరు. ఆయనకు 1996 ఉప ఎన్నికల్లో భాగంగా టిడిపి హరిశ్చంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
1996, 1999 మరియు 2004 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సృష్టించారు.
ఆ తర్వాత ఆయన 2009 శాసనసభ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవతిపటి కొర్ల చేతిలో 1,893 ఓట్ల అతి తక్కువ తేడాతో పరాజయం పాలయ్యారు.
2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్ పైన 8,387 ఓట్ల మెజారిటీతో గెలిచి నాలుగో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
అనంతరం 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మళ్లీ వరుసగా టెక్కలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన పేరాడ తిలక్ పైన 8,545 ఓట్ల మెజారిటీతో గెలిచి ఐదోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఆ తర్వాత 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్ పైన 34,435 ఓట్ల మెజారిటీతో గెలిచి ఆరోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
అంతేకాకుండా ఆయన టెక్కలి నియోజకవర్గం నుంచి కూడా వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టించారు. ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, అందులో ఒకసారి ఓటమి పాలయ్యారు. మిగతా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ప్రస్తుతానికి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Ichchapuram MLA 2024 పూర్తి జాబితా

ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బెందాళం అశోక్ గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన నర్తు రామారావు పైన 25,278 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
అనంతరం 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన పిరియా సాయిరాజ్ పైన 7,145 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు.
ఆ తర్వాత 2024 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన పిరియా విజయ పైన 39,783 ఓట్ల మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డుని సొంతం చేసుకున్నారు.
ఇచ్చాపురం నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 39,783 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతేకాకుండా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇద్దరూ కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కావడం విశేషం. ఒకరేమో ఎమ్.వి. కృష్ణారావు మరియు మరొకరు బెందాళం అశోక్.
Narasannapeta MLA 2024 పూర్తి జాబితా

నరసన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2014 శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ నరసన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో నరసన్నపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ధర్మాన కృష్ణదాస్ పైన 4,800 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
అనంతరం 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ధర్మాన కృష్ణదాస్ చేతిలో 19,555 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.
2024 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ధర్మాన కృష్ణదాస్ పైన 29,371 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు.
ఆయన నరసన్నపేట నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, అందులో ఒకసారి ఓడిపోయారు. మిగతా రెండుసార్లు విజయం సాధించారు. అంతేకాకుండా ఆయన నరసన్నపేట నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 29,371 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఒక అరుదైన రికార్డుని సృష్టించారు.
Srikakulam MLA 2024 పూర్తి జాబితా

శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆయన రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ధర్మాన ప్రసాదరావు పైన 52,521 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
శ్రీకాకుళం నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 52,521 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన సంచలన రికార్డుని సృష్టించారు. అంతేకాకుండా ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగానే ఇంత భారీ మెజారిటీతో విజయం సాధించడం ఇది ఒక రికార్డుగా నిలిచింది.
Pathapatnam MLA 2024 పూర్తి జాబితా

పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన రెడ్డి శాంతి పైన 26,527 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2024 శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి 26,527 ఓట్ల భారీ మెజారిటీతో గెలవడం విశేషమైన విజయంగా పేర్కొనాలి.
Amadalavalasa MLA 2024 పూర్తి జాబితా

ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు రాజకీయ అనుభవజ్ఞుడు.
ఆయనకు తెలుగుదేశం పార్టీ 2009 శాసనసభ ఎన్నికల్లో ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. 2009 శాసనసభ ఎన్నికల్లో ఆమదాలవలస నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన బొడ్డేపల్లి సత్యవతి చేతిలో 18,697 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన తమ్మినేని సీతారాం పైన 5,449 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన తమ్మినేని సీతారాం చేతిలో 13,991 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా నాలుగో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన తమ్మినేని సీతారాం పైన 35,032 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఆయనకు కూడా 2024 శాసనసభ ఎన్నికల ఫలితాలు ప్రత్యేకం. ఎందుకంటే ఆమదాలవలస నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 35,032 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన సంచలన రికార్డ్ సృష్టించారు.
Etcherla MLA 2024 పూర్తి జాబితా

ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే నడుకుడిటి ఈశ్వరరావు గారు బిజెపి పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2024 శాసనసభ ఎన్నికల్లో ఆయనకు ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బిజెపి పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బిజెపి పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన గొర్లె కిరణ్ కుమార్ పైన 29,089 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి 29,089 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం ఇది ఒక అరుదైన రికార్డుగా నిలిచింది.
Comparison Table 2024
| Constituency | Winner | Runner | Margin |
| Palasa | Gouthu Sireesha | Seediri Appalaraju | 40,350 |
| Tekkali | Kinjarapu Atchannaidu | Duvvada Srinivas | 34,435 |
| Ichchapuram | Ashok Bendalam | Piriya Vijaya | 39,783 |
| Narasannapeta | Baggu Ramamurthy | Dharmana Krishna Das | 29,371 |
| Srikakulam | Gondu Shankar | Dharmana Prasada Rao | 52,521 |
| Pathapatnam | Mamidi Govinda Rao | Reddy Shanthi | 26,527 |
| Amadalavalasa | Koona Ravi Kumar | Thammineni Seetharam | 35,032 |
| Etcherla | Nadukuditi Eswara Rao | Gorle Kiran Kumar | 29,089 |
ఆధారాలు (Source): పై పట్టికలోని అభ్యర్థుల మెజారిటీలు మరియు ఎన్నికల ఫలితాల వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా ఇవ్వబడినవి.
Previous Election Comparison ( 2019 VS 2024 )
2019 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎనిమిది నియోజకవర్గాలలో వైకాపా ఆరు స్థానాలను కైవసం చేసుకోగా, తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలకే పరిమితమైంది.
2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో శ్రీకాకుళం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసి ప్రభంజనం సృష్టించింది. వైకాపాకు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కలేదు.
2019 శాసనసభ ఎన్నికలలో వైకాపా ప్రభంజనం ముందు తెలుగుదేశం పార్టీ కనీసం రెండు ఎమ్మెల్యే సీట్లను అయిన దక్కించుకుంది. కానీ 2024 ఎన్నికల ఫలితాల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. వైకాపా ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది.
Alliance Impact 2024
2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో శ్రీకాకుళం జిల్లాలో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించడానికి ఓట్ల చీలిక నివారించడమే కీలక పాత్ర పోషించింది. తెలుగుదేశం జనసేన మరియు బిజెపి పార్టీల ఐక్యత వల్ల ఓటు ఎక్కడ చీలిపోకుండా అంతటా కూటమి అభ్యర్థులకు ఓట్లు పడటం ఈ విజయానికి దోహదపడింది.
ముగింపు
2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి కలిసి పోటీ చేయడం వలన ఓట్లు చీలిపోకుండా శ్రీకాకుళం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. గత ఎన్నికల్లో కోల్పోయిన పట్టును తిరిగి తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో సాధించింది. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు ఎన్డీయే కూటమి కొత్త అభ్యర్థులు మొదటిసారి బరిలోకి దిగి భారీ మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు. వైకాపా తన ఉనికిని చాటుకోలేకపోయింది.
ముఖ్య గమనిక (Disclaimer & Credits) :
సమాచార సేకరణ : ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం మరియు ఫోటోలు కేవలం పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మరియు విద్యా ప్రయోజనాల (Informational and Educational Purposes) కోసం మాత్రమే సేకరించబడినవి.
ఫోటో సౌజన్యం : ఇందులో ఉపయోగించిన చిత్రాలు సంబంధిత ఎమ్మెల్యేల అధికారిక Facebook/Social Media ఖాతాల నుండి సేకరించబడినవి. వీటిపై పూర్తి హక్కులు ఆయా వ్యక్తులకు మాత్రమే ఉంటాయి.
మా ఉద్దేశ్యం : ఎటువంటి కాపీరైట్ నియమాలను ఉల్లంఘించడం మా ఉద్దేశ్యం కాదు. కేవలం పాఠకులకు లేటెస్ట్ సమాచారాన్ని అందించడమే UU News లక్ష్యం.
తరచుగా అడిగే ప్రశ్నలు
శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి 2024?
శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉన్నాయి
శ్రీకాకుళం జిల్లాలోని నియోజకవర్గాల పేర్లు 2024?
శ్రీకాకుళం, పలాస, టెక్కలి, ఇచ్చాపురం, నరసన్నపేట, పాతపట్నం, ఆముదాలవలస మరియు ఎచ్చెర్ల
శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
గొండు శంకర్ ( తెలుగుదేశం పార్టీ )
పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
గౌతు శిరీష ( తెలుగుదేశం పార్టీ )
టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
కింజరాపు అచ్చెన్నాయుడు ( తెలుగుదేశం పార్టీ )
ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
బెందాళం అశోక్ ( తెలుగుదేశం పార్టీ )
నరసన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
బగ్గు రమణమూర్తి ( తెలుగుదేశం పార్టీ )
పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
మామిడి గోవిందరావు ( తెలుగుదేశం పార్టీ )
ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
కూన రవికుమార్ ( తెలుగుదేశం పార్టీ )
ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
నడుకుడిటి ఈశ్వరరావు ( బిజెపి పార్టీ )
