NTR District MLA List 2024 | 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితాను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
NTR District MLA List 2024
2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గెలిచిన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ, ప్రస్తుతం జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో విజయం సాధించిన ఎమ్మెల్యేల పేర్లు, నియోజకవర్గాల పేర్లు మరియు పార్టీ పేర్లను ఇక్కడ చూడండి.
| S.NO. | MLA Name | Constituency | Party Name |
| 1 | Sujana Chowdary | Vijayawada West | BJP |
| 2 | Gadde Rama Mohan | Vijayawada East | TDP |
| 3 | Kolikapudi Srinivasa Rao | Tiruvuru (SC) | TDP |
| 4 | Tangirala Sowmya | Nandigama (SC) | TDP |
| 5 | Bonda Umamaheswara Rao | Vijayawada Central | TDP |
| 6 | Rajagopal Sreeram | Jaggayyapeta | TDP |
| 7 | Vasantha Krishna Prasad | Mylavaram | TDP |
Source: ఈ పట్టికలోని వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా సేకరించబడినవి.
Vijayawada West MLA 2024 | పూర్తి జాబితా

విజయవాడ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ప్రముఖ బిజినెస్ మ్యాన్. ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు.
ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. అంతేకాక ఆయన 2014-2018 మధ్య కాలంలో కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 సంవత్సరంలో ఆయన బిజెపిలో చేరారు.
2024 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన మరియు బిజెపి ఎన్డీయే కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేశాయి. ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఆయనకు బిజెపి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బిజెపి తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన షేక్ ఆసిఫ్ పైన 47,032 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
విజయవాడ వెస్ట్ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో బిజెపి మొదటిసారి విజయం సాధించడం విశేషం.
Vijayawada East MLA 2024 | పూర్తి జాబితా

విజయవాడ ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 1994 శాసనసభ ఎన్నికల్లో ఆయన గన్నవరం నియోజకవర్గం (కృష్ణా జిల్లా) నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.
1994 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన దాసరి వెంకట బాలవర్థన రావు పైన 10,703 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 1999 లోక్ సభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆయనకు విజయవాడ లోక్ సభ నియోజకవర్గం ఎంపీ టికెట్ ఇచ్చింది.
1999 లోక్ సభ ఎన్నికలలో విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎంపీగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన పి. ఉపేంద్ర పైన 87,096 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయగా, 52,274 ఓట్లు నమోదు అయ్యాయి. ప్రజారాజ్యం పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీకి మధ్య గట్టి పోటీ ఉండడంతో, ఆ ఎన్నికల్లో ఆయన మూడవ స్థానంలో నిలిచారు.
2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన వంగవీటి రాధాకృష్ణ పైన 15,503 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన బొప్పన భవ కుమార్ పైన 15,164 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడో సారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన దేవినేని అవినాష్ పైన 49,640 ఓట్ల మెజారిటీతో గెలిచి నాలుగో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఆయన విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున (2014,2019,2024) శాసనసభ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సరికొత్త రికార్డుని సృష్టించారు.
అంతేకాక విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో 2014 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ జెండా జయకేతనం ఎగురవేసింది.
Tiruvuru MLA 2024 | పూర్తి జాబితా

తిరువూరు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు గారు రాజకీయాల్లోకి రాకముందు ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఆయనకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉండటంతో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. తిరువూరు ఎస్సీ రిజర్వ్ శాసనసభ నియోజకవర్గం.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన నల్లగట్ల స్వామిదాస్ పైన 21,874 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
తిరువూరు శాసనసభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా చివరిసారిగా 1999 ఎన్నికలలో ఎగురవేసింది. దాదాపు పాతికేళ్ళ తర్వాత 2024 శాసనసభ ఎన్నికల ఫలితాల్లో శ్రీనివాస రావు గెలుపుతో తెలుగుదేశం పార్టీ జెండా జయకేతనం ఎగురవేసింది.
Nandigama MLA 2024 | పూర్తి జాబితా

నందిగామ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చారు. నందిగామ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం.
ఆమె తంగిరాల ప్రభాకరరావు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు అంతేకాక ఆయన 2009 మరియు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి రెండుసార్లు ఘనవిజయం సాధించారు.
దురదృష్టవశాత్తు ఆయన 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత మరణించారు. ఆయన మరణానంతరం నందిగామ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఆమెకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ ఇచ్చింది.
2014 ఉప ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన బోడపాటి బాబురావు పైన 74,827 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన మొండితోక జగన్ మోహనరావు చేతిలో 10,881 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన మొండితోక జగన్ మోహనరావు పైన 27,395 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
నందిగామ శాసనసభ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యేగా ఆమె ఒక అరుదైన రికార్డుని సృష్టించారు.
నందిగామ శాసనసభ నియోజకవర్గంలో 1983 నుంచి 2024 వరకు జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కేవలం రెండు సార్లు ( 1989,2019 శాసనసభ ఎన్నికలు) మాత్రమే ఓటమి పాలయ్యింది. మిగతా అన్ని సార్లు ఘనవిజయం సాధించడం విశేషం.
Vijayawada Central MLA 2024 | పూర్తి జాబితా

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు.
ఆయన తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2014 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆయనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన పి. గౌతం రెడ్డి పైన 27,161 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన మల్లాది విష్ణు చేతిలో 25 అతి తక్కువ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన వెల్లంపల్లి శ్రీనివాస రావు పైన 68,886 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
విజయవాడ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 68,886 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన నూతన రికార్డును సృష్టించారు. ప్రస్తుతం ఆయన శాసనసభలో విప్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Jaggayyapeta MLA 2024 | పూర్తి జాబితా

జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజగోపాల్ శ్రీరాం గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి వివిధ హోదాల్లో పనిచేశారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
2009 శాసనసభ ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన సామినేని ఉదయభాను పైన 9,678 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన సామినేని ఉదయభాను పైన 1,846 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2019 శాసనసభ ఎన్నికల్లో జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన సామినేని ఉదయభాను చేతిలో 4,778 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన సామినేని ఉదయభాను పైన 15,977 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడో సారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
Mylavaram MLA 2024 | పూర్తి జాబితా

మైలవరం శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు గారు నందిగామ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు.
ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 1999 శాసనసభ ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నందిగామ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
1999 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన దేవినేని ఉమామహేశ్వర రావు చేతిలో 23,511 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
ఆ తర్వాత ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. 2014 లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 నందిగామ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున కీలక పాత్ర పోషించారు. తర్వాత తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మైలవరం శాసనసభ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన దేవినేని ఉమామహేశ్వర రావు పైన 12,653 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తిరిగి తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు.
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన తిరుపతి రావు పైన 42,829 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
మైలవరం శాసనసభ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 42,829 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు ఆయన పేరిట ఉంది.
Comparison Table 2024
| Constituency | Winner | Runner | Margin |
| Vijayawada West | Sujana Chowdary | Shaik Asif | 47,032 |
| Vijayawada East | Gadde Rama Mohan | Devineni Avinash | 49,640 |
| Tiruvuru (SC) | Kolikapudi Srinivasa Rao | Nallagatla Swamy Das | 21,874 |
| Nandigama (SC) | Tangirala Sowmya | Monditoka Jagan Mohana Rao | 27,395 |
| Vijayawada Central | Bonda Umamaheswara Rao | Vellampalli Srinivasa Rao | 68,886 |
| Jaggayyapeta | Rajagopal Sreeram | Samineni Udayabhanu | 15,977 |
| Mylavaram | Vasantha Krishna Prasad | Tirupathi Rao Sarnala | 42,829 |
ఆధారాలు (Source): పై పట్టికలోని అభ్యర్థుల మెజారిటీలు మరియు ఎన్నికల ఫలితాల వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా ఇవ్వబడినవి.
Previous Election Comparison ( 2019 VS 2024 )
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను కనబరిచి, జిల్లాలోని ఆరు స్థానాలు కైవసం చేసుకోగా, మిగతా ఒక్క స్థానంలో ( విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం) తెలుగుదేశం పార్టీ గెలిచి తన ఉనికిని చాటుకుంది.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో లెక్కలు తారుమారు అయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకోగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయింది.
Alliance Impact 2024
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎన్టీఆర్ జిల్లాలో ఎన్డీయే కూటమి ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ క్లీన్ స్వీప్ చేయడంలో కూటమి పొత్తు కీలక పాత్ర పోషించింది. అంతేకాక జిల్లా యువత మరియు తటస్థ ఓటర్లు కూటమి వైపే మొగ్గు చూపారు.
ఎన్డీయే కూటమి మధ్య ఐక్యత, ఓట్ల చీలికను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించింది. దీనివల్ల విజయవాడ సెంట్రల్, ఈస్ట్ మరియు వెస్ట్ నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో మెజారిటీలు నమోదు అయ్యాయి.
ముగింపు
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త రికార్డుని సృష్టించింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి అభ్యర్థులు సాధించిన విజయం.
అందులో తెలుగుదేశం పార్టీ ఆరు స్థానాల్లో ఘనవిజయం సాధించగా, బిజెపి ఒక్క స్థానంలో విజయం సాధించి తన సత్తా నిరూపించుకుంది. వైకాపా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేక పోయింది.
ముఖ్య గమనిక (Disclaimer & Credits) :
సమాచార సేకరణ : ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం మరియు ఫోటోలు కేవలం పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మరియు విద్యా ప్రయోజనాల (Informational and Educational Purposes) కోసం మాత్రమే సేకరించబడినవి.
ఫోటో సౌజన్యం : ఇందులో ఉపయోగించిన చిత్రాలు సంబంధిత ఎమ్మెల్యేల అధికారిక Facebook/Social Media ఖాతాల నుండి సేకరించబడినవి. వీటిపై పూర్తి హక్కులు ఆయా వ్యక్తులకు మాత్రమే ఉంటాయి.
మా ఉద్దేశ్యం : ఎటువంటి కాపీరైట్ నియమాలను ఉల్లంఘించడం మా ఉద్దేశ్యం కాదు. కేవలం పాఠకులకు లేటెస్ట్ సమాచారాన్ని అందించడమే UU News లక్ష్యం.
తరచుగా అడిగే ప్రశ్నలు
ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో గెలిచింది?
ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆరు నియోజకవర్గాల్లో విజయం సాధించింది.
ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యే ఎవరు?
బోండా ఉమామహేశ్వర రావు ( విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం – 68,886 ఓట్లు ) తెలుగుదేశం పార్టీ.
నందిగామ నియోజకవర్గం నుంచి గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యే ఎవరు?
తంగిరాల సౌమ్య ( తెలుగుదేశం పార్టీ )
తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎన్ని ఏళ్ల తర్వాత విజయం సాధించింది?
తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ దాదాపు పాతికేళ్ళ తర్వాత ఘనవిజయం సాధించింది.
విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
సుజనా చౌదరి ( బిజెపి )
విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
గద్దె రామ్మోహన్ ( తెలుగుదేశం పార్టీ )
జగ్గయ్యపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
రాజగోపాల్ శ్రీరాం ( తెలుగుదేశం పార్టీ )
మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
వసంత కృష్ణ ప్రసాద్ ( తెలుగుదేశం పార్టీ )
