Krishna District MLA List 2024 | 2024 లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన కృష్ణా జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితాను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Krishna District MLA List 2024
2024 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో గెలిచిన ఎమ్మెల్యేలందరూ, ప్రస్తుతం జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో మొత్తం ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గెలిచిన ఎమ్మెల్యేల పేర్లు, నియోజకవర్గాల పేర్లు మరియు పార్టీ పేర్లను ఇక్కడ చూడండి.
| S.NO. | MLA Name | Constituency | Party Name |
| 1 | Kagitha Krishna Prasad | Pedana | TDP |
| 2 | Mandali Buddha Prasad | Avanigadda | JSP |
| 3 | Venigandla Ramu | Gudivada | TDP |
| 4 | Kollu Ravindra | Machilipatnam | TDP |
| 5 | Bode Prasad | Penamaluru | TDP |
| 6 | Varla Kumar Raja | Pamarru (SC) | TDP |
| 7 | Yarlagadda Venkata Rao | Gannavaram | TDP |
Source: ఈ పట్టికలోని వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా సేకరించబడినవి.
Pedana MLA 2024 | పూర్తి జాబితా

పెడన శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి కాగిత వెంకట్రావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యే. కాగిత వెంకట్రావు గారు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు.
ఆయన తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ప్రవేశించి, తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయనకు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన జోగి రమేష్ చేతిలో 7,839 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ఉప్పల రమేష్ పైన 38,123 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
పెడన శాసనసభ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 38,123 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు.
పెడన శాసనసభ నియోజకవర్గం 2009 లో ఏర్పడినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ చివరిసారిగా 2014 ఎన్నికల్లో జెండా ఎగురవేసింది. మళ్లీ 2024 శాసనసభ ఎన్నికల్లో కాగిత కృష్ణ ప్రసాద్ గెలుపుతో దాదాపు పదేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా జయకేతనం ఎగురవేసింది.
Avanigadda MLA 2024 | పూర్తి జాబితా

అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ గారు రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి మండలి వెంకట కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.
మండలి వెంకట కృష్ణారావు గారు కాంగ్రెస్ పార్టీ తరపున అవనిగడ్డ నియోజకవర్గం నుంచి 1972,1978 మరియు 1983 శాసనసభ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టించారు.
తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ప్రవేశించి, కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
1994 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన సింహాద్రి సత్యనారాయణ రావు చేతిలో 5,377 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
1999 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన బూరగడ్డ రమేష్ నాయుడు పైన 794 అతి తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన బూరగడ్డ రమేష్ నాయుడు పైన 8,482 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వరుసగా నాలుగో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన అంబటి బ్రహ్మయ్య చేతిలో 417 అతి తక్కువ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
2014 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన సింహాద్రి రమేష్ బాబు పైన 5,958 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడో సారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
2019 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన సింహాద్రి రమేష్ బాబు చేతిలో 20,725 ఓట్ల తేడాతో పరాజయం చెందారు.
ఆ తర్వాత 2024 ఎన్నికల్లో టిడిపిని వీడి జనసేన పార్టీలో చేరారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన సింహాద్రి రమేష్ బాబు పైన 46,434 ఓట్ల మెజారిటీతో గెలిచి నాలుగోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
అవనిగడ్డ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు ఆయన పేరిట ఉంది. ఆయన 2014 – 2019 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
Gudivada MLA 2024 | పూర్తి జాబితా

గుడివాడ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అమెరికాలో ఒక ఐటీ కంపెనీకి సిఇఒ గా పనిచేశారు. రాజకీయాల పట్ల ఆసక్తితో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 2024 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆయనకు గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు పైన 53,040 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2004 నుంచి 2019 ఎన్నికల వరకు వరుసగా నాలుగు సార్లు గెలిచిన బలమైన అభ్యర్థి కొడాలి వెంకటేశ్వరరావు పైన 2024 ఎన్నికల్లో 53,040 ఓట్ల మెజారిటీతో గెలిచి ఆయన ఒక అరుదైన రికార్డుని సృష్టించారు.
2009 శాసనసభ ఎన్నికల్లో చివరిసారిగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది. 2024 ఎన్నికల్లో వెనిగండ్ల రాము గెలుపుతో దాదాపు పదిహేనేళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది.
Machilipatnam MLA 2024 | పూర్తి జాబితా

మచిలీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి, వివిధ హోదాల్లో పనిచేసి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 2009 శాసనసభ ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన పేర్ని వెంకట్రామయ్య చేతిలో 11,499 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
2014 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన పేర్ని వెంకట్రామయ్య పైన 15,806 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2019 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన పేర్ని వెంకట్రామయ్య చేతిలో 3,909 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున నాలుగో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన పేర్ని కృష్ణమూర్తి ( కిట్టు ) పైన 50,242 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఆయన 2014-2019 మధ్య కాలంలో ఉపాధి, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి మరియు న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాక నైపుణ్యాభివృద్ధి, యువజన క్రీడలు శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ గనులు మరియు భూగర్భ శాఖ మంత్రిగా మరియు ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మచిలీపట్నం నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 50,242 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన ఒక నూతన రికార్డును సృష్టించారు.
Penamaluru MLA 2024 | పూర్తి జాబితా

పెనమలూరు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి, వివిధ హోదాల్లో పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన విద్యాసాగర్ కుక్కల పైన 31,448 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కొలుసు పార్థసారథి చేతిలో 11,317 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన జోగి రమేష్ పైన 59,915 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
పెనమలూరు శాసనసభ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 59,915 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన సంచలన రికార్డ్ సృష్టించారు.
2014 శాసనసభ ఎన్నికల్లో చివరిసారిగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది. దాదాపు పదేళ్ల తర్వాత 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బోడె ప్రసాద్ గెలుపుతో మళ్లీ పసుపు జెండా రెపరెపలాడింది.
Pamarru MLA 2024 | పూర్తి జాబితా

పామర్రు నియోజకవర్గం ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆయనకు 2024 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పామర్రు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. పామర్రు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో పామర్రు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కైలే అనిల్ కుమార్ పైన 29,690 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
పామర్రు శాసనసభ నియోజకవర్గం 1952 నుంచి 1972 వరకు ఇక్కడ శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 37 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పామర్రు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం గా ఏర్పాటైంది.
పామర్రు నియోజకవర్గం 2009 పునర్విభజనలో ఏర్పడినప్పటి నుంచి, 2009,2014 మరియు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. 2024 శాసనసభ ఎన్నికల ఫలితాల్లో వర్ల కుమార్ రాజా గెలుపుతో తెలుగుదేశం పార్టీ జెండా జయకేతనం ఎగురవేసింది.
Gannavaram MLA 2024 | పూర్తి జాబితా

గన్నవరం నియోజకవర్గం ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పరిధిలో ఉన్నప్పటికీ, గన్నవరం, బాపులపాడు మరియు ఉంగుటూరు మండలాలు కృష్ణా జిల్లా కిందికి వస్తాయి. కానీ విజయవాడ రూరల్ మండలం NTR జిల్లా పరిధిలోకి వస్తుంది. పరిపాలన పరంగా ఈ నియోజకవర్గం కృష్ణా జిల్లా పరిధిలోకి వస్తుంది.
గన్నవరం శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2019 శాసనసభ ఎన్నికలలో ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన వల్లభనేని వంశీ మోహన్ చేతిలో 838 అతి తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
2023 లో ఆయన వైకాపాకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2024 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆయనకు గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన వల్లభనేని వంశీ మోహన్ పైన 37,628 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో విప్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Comparison Table 2024
| Constituency | Winner | Runner | Margin |
| Pedana | Kagitha Krishna Prasad | Uppala Ramesh | 38,123 |
| Avanigadda | Mandali Buddha Prasad | Simhadri Ramesh Babu | 46,434 |
| Gudivada | Venigandla Ramu | Kodali Sri Venkateswara Rao | 53,040 |
| Machilipatnam | Kollu Ravindra | Perni Vaka Sai Krishna Murthy | 50,242 |
| Penamaluru | Bode Prasad | Jogi Ramesh | 59,915 |
| Pamarru (SC) | Varla Kumar Raja | Kaile Anil Kumar | 29,690 |
| Gannavaram | Yarlagadda Venkata Rao | Vallabhaneni Vamsi Mohan | 37,628 |
ఆధారాలు (Source): పై పట్టికలోని అభ్యర్థుల మెజారిటీలు మరియు ఎన్నికల ఫలితాల వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా ఇవ్వబడినవి.
Previous Election Comparison ( 2019 VS 2024 )
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా కృష్ణా జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను కనబరిచి, జిల్లాలోని ఆరు నియోజకవర్గాలు కైవసం చేసుకోగా, తెలుగుదేశం పార్టీ కేవలం ఒక్క నియోజకవర్గం తోనే సరిపెట్టుకుంది.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. కృష్ణాజిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసి అన్ని స్థానాలను కైవసం చేసుకోగా, వైకాపా ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది.
Alliance Impact 2024
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ప్రభావం బలంగా కనిపించింది. తెలుగుదేశం,జనసేన మరియు బిజెపి కలయిక ఓట్లు చీలికను అరికట్టడమే కాకుండా, పెనమలూరు గుడివాడ మరియు మచిలీపట్నం నియోజకవర్గాలలో రికార్డు స్థాయిలో మెజారిటీలు నమోదు అయ్యాయి. ఇంతటి భారీ విజయాన్ని ఎన్డీయే కూటమికి అందించిన జిల్లాలోని యువత మరియు తటస్థ ఓటర్లు కీలక పాత్ర పోషించారు.
ముగింపు
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాగంగా కృష్ణా జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసి చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. అందులో తెలుగుదేశం పార్టీ ఆరు స్థానాలు కైవసం చేసుకోగా, మిగతా ఒక్క స్థానంలో జనసేన పార్టీ విజయం సాధించింది. వైకాపా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేక పోయింది.
ముఖ్య గమనిక (Disclaimer & Credits) :
సమాచార సేకరణ : ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం మరియు ఫోటోలు కేవలం పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మరియు విద్యా ప్రయోజనాల (Informational and Educational Purposes) కోసం మాత్రమే సేకరించబడినవి.
ఫోటో సౌజన్యం : ఇందులో ఉపయోగించిన చిత్రాలు సంబంధిత ఎమ్మెల్యేల అధికారిక Facebook/Social Media ఖాతాల నుండి సేకరించబడినవి. వీటిపై పూర్తి హక్కులు ఆయా వ్యక్తులకు మాత్రమే ఉంటాయి.
మా ఉద్దేశ్యం : ఎటువంటి కాపీరైట్ నియమాలను ఉల్లంఘించడం మా ఉద్దేశ్యం కాదు. కేవలం పాఠకులకు లేటెస్ట్ సమాచారాన్ని అందించడమే UU News లక్ష్యం.
తరచుగా అడిగే ప్రశ్నలు
కృష్ణా జిల్లాలో టిడిపి ఎన్ని నియోజకవర్గాల్లో గెలిచింది 2024?
కృష్ణా జిల్లాలో టిడిపి మొత్తం ఆరు నియోజకవర్గాల్లో గెలిచింది.
కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో గెలిచింది 2024?
కృష్ణా జిల్లాలో జనసేన ఒక నియోజకవర్గంలో గెలిచింది. ( అవనిగడ్డ నియోజకవర్గం)
కృష్ణా జిల్లాలో అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యే ఎవరు?
పెనమలూరు నియోజకవర్గానికి చెందిన బోడె ప్రసాద్ తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన జోగి రమేష్ పైన 59,915 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
కృష్ణా జిల్లాలో ప్రస్తుతం ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నది ఎవరు?
మచిలీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గనులు మరియు భూగర్భ శాఖ మంత్రిగా మరియు ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
గుడివాడ ఎమ్మెల్యే ఎవరు 2024?
వెనిగండ్ల రాము ( తెలుగుదేశం పార్టీ )
అవనిగడ్డ ఎమ్మెల్యే ఎవరు 2024?
మండలి బుద్ధ ప్రసాద్ ( జనసేన పార్టీ )
గన్నవరం ఎమ్మెల్యే ఎవరు 2024?
యార్లగడ్డ వెంకట రావు ( తెలుగుదేశం పార్టీ )
