Kurnool District MLA List 2024 | 2024 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గెలుపొందిన కర్నూలు జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితాను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
Kurnool District MLA List 2024
2024 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన కర్నూలు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ, ప్రస్తుతం జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన కర్నూలు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేల పేర్లు, పార్టీ పేర్లు మరియు నియోజకవర్గాల పేర్లను ఇక్కడ చూడండి.
| S.NO. | MLA Name | Constituency | Party Name |
| 1 | P. V. Parthasarathi | Adoni | BJP |
| 2 | T. G. Bharath | Kurnool | TDP |
| 3 | Busine Virupakshi | Alur | YSRCP |
| 4 | K. E. Shyam Kumar | Pattikonda | TDP |
| 5 | Jaya Nageswara Reddy | Yemmiganur | TDP |
| 6 | Boggula Dastagiri | Kodumur (SC) | TDP |
| 7 | Y. Balanagi Reddy | Mantralayam | YSRCP |
Source: ఈ పట్టికలోని వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా సేకరించబడినవి.
Adoni MLA 2024 | పూర్తి జాబితా

ఆదోని శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి గారు బిజెపి ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన వివిధ హోదాల్లో పనిచేసి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 2019 లోక్ సభ ఎన్నికలలో ఆయనకు బిజెపి కర్నూలు లోక్ సభ నియోజకవర్గం ఎంపీ టికెట్ ఇచ్చింది.
2019 లోక్ సభ ఎన్నికలలో కర్నూలు లోక్ సభ నియోజకవర్గం నుంచి బిజెపి తరపున మొదటిసారి ఎంపీగా పోటీ చేయగా, కేవలం ఆయనకు 24,348 ఓట్లు మాత్రమే నమోదు అయ్యాయి. ఆ ఎన్నికలలో ఆయన నాల్గవ స్థానంలో నిలిచారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన మరియు బిజెపి కలిసి పోటీ చేయడం. ఆయనకు ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బిజెపి ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో ఆదోని నియోజకవర్గం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బిజెపి తరపున పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన వై సాయి ప్రసాద్ రెడ్డి పైన 18,164 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2014 మరియు 2019 శాసనసభ ఎన్నికలలో వరుసగా గెలిచిన వైకాపా అభ్యర్థి వై సాయి ప్రసాద్ రెడ్డి పైన పార్థసారథి గెలవడం విశేషం.
Kurnool MLA 2024 | పూర్తి జాబితా

కర్నూలు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే టిజి భరత్ గారిది రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి టిజి వెంకటేష్ గారు సీనియర్ రాజకీయ నాయకులు మరియు అంతేకాక ఆయన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు.
తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ప్రవేశించి, తెలుగుదేశం పార్టీ ద్వారా ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. 2019 శాసనసభ ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ కర్నూలు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన అబ్దుల్ హాఫీజ్ ఖాన్ చేతిలో 5,353 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు శాసనసభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ఇంతియాజ్ పైన 18,876 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
కర్నూలు శాసనసభ నియోజకవర్గంలో 1999 లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది. దాదాపు (1999-2024) పాతికేళ్ళ తర్వాత టిజి భరత్ గెలుపుతో కర్నూలు గడ్డపైన తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది.
ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు & వాణిజ్యం, ఆహార శుద్ది శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Alur MLA 2024 | పూర్తి జాబితా

ఆలూరు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే బి విరూపాక్షి గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. 2024 శాసనసభ ఎన్నికలలో ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గం నుంచి వైకాపా తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన బి. వీరభద్ర గౌడ్ పైన 2,831 ఓట్ల మెజారిటీతో మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఆలూరు శాసనసభ నియోజకవర్గంలో చివరిసారిగా 1994 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది. గత ముప్పై ఏళ్లుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు.
Pattikonda MLA 2024 | పూర్తి జాబితా

పత్తికొండ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే కెఇ శ్యామ్ కుమార్ గారు రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి కెఇ కృష్ణమూర్తి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు అంతేకాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ( 2014-2019 ) లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
కెఇ కృష్ణమూర్తి గారు పలుసార్లు ఎమ్మెల్యేగాను, ఎంపీ గాను మరియు మంత్రిగాను బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ప్రవేశించి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు.
2019 శాసనసభ ఎన్నికలలో ఆయనకు తెలుగుదేశం పార్టీ పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కంగాటి శ్రీదేవి చేతిలో 42,065 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కంగాటి శ్రీదేవి పైన 14,211 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
Yemmiganur MLA 2024 | పూర్తి జాబితా

ఎమ్మిగనూరు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి గారు రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి బి.వి. మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు.
అంతేకాక మోహన్ రెడ్డి గారు ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున (1985,1989,1994,1999 ) అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు.
ఆ తర్వాత ( 2004,2009,2012) శాసనసభ ఎన్నికలలో వరుసగా మోహన్ రెడ్డి గారు పరాజయం చెందారు.
ఆయన తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి, తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. 2014 శాసనసభ ఎన్నికలలో ఆయనకు తెలుగుదేశం పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కె జగన్ మోహన్ రెడ్డి పైన 14,365 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2019 శాసనసభ ఎన్నికలలో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన కె చెన్నకేశవ రెడ్డి చేతిలో 25,610 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన బుట్టా రేణుక పైన 15,837 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
Kodumur MLA 2024 | పూర్తి జాబితా

కోడుమూరు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2024 శాసనసభ ఎన్నికలలో భాగంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కోడుమూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపాకు చెందిన ఆదిమూలపు సతీష్ పైన 21,583 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
కోడుమూరు నియోజకవర్గంలో 1985 శాసనసభ ఎన్నికలలో చివరిసారిగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది. దాదాపు ముప్పై తొమ్మిది ఏళ్ల తర్వాత 2024 ఎన్నికల్లో దస్తగిరి గెలుపుతో తెలుగుదేశం పార్టీ జెండా జయకేతనం ఎగురవేసింది.
Mantralayam MLA 2024 | పూర్తి జాబితా

మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే వై బాలనాగి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. 2009 శాసనసభ ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన రామయ్య పైన 10,697 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2014 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గం నుంచి వైకాపా తరపున పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన పి. తిక్కా రెడ్డి పైన 7,462 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2019 శాసనసభ ఎన్నికలలో వైకాపా తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన పి. తిక్కా రెడ్డి పైన 23,879 ఓట్ల మెజారిటీతో గెలిచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన రాఘవేంద్ర రెడ్డి పైన 12,805 ఓట్ల మెజారిటీతో గెలిచి నాలుగో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
మంత్రాలయం నియోజకవర్గం 2009 లో ఏర్పడినప్పటి నుంచి 2024 శాసనసభ ఎన్నికల వరకు వరుసగా నాలుగు సార్లు ఆయన ఘనవిజయం సాధించడం విశేషం. మంత్రాలయం నియోజకవర్గంలో బలమైన పట్టు ఉందని ఆయన విజయాలే స్పష్టం చేస్తున్నాయి.
Comparison Table 2024
| Constituency | Winner | Runner | Margin |
| Adoni | P.V. Parthasarathi | Y. Sai Prasad Reddy | 18,164 |
| Kurnool | T.G. Bharath | A. Md. Imtiaz | 18,876 |
| Alur | Busine Virupakshi | B. Veerabhadra Gowd | 2,831 |
| Pattikonda | K. E. Shyam Kumar | Kangati Sreedevi | 14,211 |
| Yemmiganur | Jaya Nageswara Reddy | Butta Renuka | 15,837 |
| Kodumur (SC) | Boggula Dastagiri | Dr. Adimulapu Sathish | 21,583 |
| Mantralayam | Y. Balanagi Reddy | Nallagowni Raghavendra Reddy | 12,805 |
ఆధారాలు (Source): పై పట్టికలోని అభ్యర్థుల మెజారిటీలు మరియు ఎన్నికల ఫలితాల వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా ఇవ్వబడినవి.
Previous Election Comparison ( 2019 VS 2024 )
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను కనబరిచి, జిల్లాలోని అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేసి కైవసం చేసుకోగా, తెలుగుదేశం, బిజెపి మరియు జనసేన పార్టీలు ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయారు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలలో ఐదు స్థానాల్లో ఎన్డీయే కూటమి కైవసం చేసుకోగా, మిగతా రెండు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
Alliance Impact 2024
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభావం బలంగా కనిపించింది. కర్నూలు జిల్లాలోని యువత మరియు తటస్థ ఓటర్లు కూటమి వైపే మొగ్గు చూపారు. ఓట్లు చెల్లాచెదురు కాకుండా కలిసి పడటం వల్ల ఎన్డీయే కూటమి ఈ స్థాయిలో గెలిచింది. అంతేకాక కోడుమూరు నియోజకవర్గంలో 39 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం విశేషం.
ముగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కర్నూలు జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల్లో, ఐదు నియోజకవర్గాల్లో ఎన్డీయే కూటమి గెలిచి ప్రభంజనం సృష్టించగా, మిగతా రెండు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తన ఉనికిని చాటుకుంది.
ముఖ్య గమనిక (Disclaimer & Credits) :
సమాచార సేకరణ : ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం మరియు ఫోటోలు కేవలం పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మరియు విద్యా ప్రయోజనాల (Informational and Educational Purposes) కోసం మాత్రమే సేకరించబడినవి.
ఫోటో సౌజన్యం : ఇందులో ఉపయోగించిన చిత్రాలు సంబంధిత ఎమ్మెల్యేల అధికారిక Facebook/Social Media ఖాతాల నుండి సేకరించబడినవి. వీటిపై పూర్తి హక్కులు ఆయా వ్యక్తులకు మాత్రమే ఉంటాయి.
మా ఉద్దేశ్యం : ఎటువంటి కాపీరైట్ నియమాలను ఉల్లంఘించడం మా ఉద్దేశ్యం కాదు. కేవలం పాఠకులకు లేటెస్ట్ సమాచారాన్ని అందించడమే UU News లక్ష్యం.
తరచుగా అడిగే ప్రశ్నలు
కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎన్ని ఏళ్ల తర్వాత విజయం సాధించింది ?
దాదాపు 39 ఏళ్ల తర్వాత కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా జయకేతనం ఎగురవేసింది.
కర్నూలు జిల్లాలో ఎన్డీయే కూటమి ఎన్ని నియోజకవర్గాల్లో గెలిచింది?
కర్నూలు జిల్లాలో ఎన్డీయే కూటమి ఐదు నియోజకవర్గాల్లో విజయం సాధించింది.
కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో గెలిచింది?
కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించింది.
ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
పి.వి. పార్థసారథి ( బిజెపి )
కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
టిజి భరత్ ( తెలుగుదేశం పార్టీ )
ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
బి. విరూపాక్షి ( వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ )
పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
కె.ఇ. శ్యామ్ కుమార్ ( తెలుగుదేశం పార్టీ )
ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
జయనాగేశ్వర రెడ్డి ( తెలుగుదేశం పార్టీ )
కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
బొగ్గుల దస్తగిరి ( తెలుగుదేశం పార్టీ )
మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?
వై. బాలనాగి రెడ్డి ( వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ )
