Chittoor District MLA List 2024 ( Latest Update ) | చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

Chittoor District MLA List 2024 : 2024 లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితాను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Table of Contents

Chittoor District MLA List 2024

2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో గెలిచిన చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ, ప్రస్తుతానికి కూడా తమ పదవుల్లో కొనసాగుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో మొత్తం ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో గెలుపొందిన చిత్తూరు జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల పేర్లు, ఎమ్మెల్యేల పేర్లు మరియు పార్టీ పేర్ల పూర్తి సమాచారాన్ని ఇక్కడ చూడండి.

S.NO.MLA NameConstituencyParty Name
1Gurajala Jagan MohanChittoorTDP
2Gali Bhanu PrakashNagariTDP
3Kalikiri Murali MohanPuthalapattu (SC)TDP
4V.M. ThomasGangadhara Nellore (SC)TDP
5Nara Chandrababu NaiduKuppamTDP
6N. Amarnath ReddyPalamanerTDP

Source: ఈ పట్టికలోని వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా సేకరించబడినవి.

Chittoor MLA 2024 | పూర్తి జాబితా

Chittoor MLA 2024 Gurajala Jagan Mohan
చిత్తూరు ఎమ్మెల్యే 2024 గురజాల జగన్ మోహన్ | Chittoor MLA 2024 Gurajala Jagan Mohan (Source: Facebook)

చిత్తూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. గురజాల జగన్ మోహన్ గారు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చారు.

ఆయనకు తెలుగుదేశం పార్టీ 2024 శాసనసభ ఎన్నికలలో చిత్తూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2024 శాసనసభ ఎన్నికలలో చిత్తూరు శాసనసభ నియోజకవర్గానికి గాను టిడిపి పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన ఎం.సి. విజయానంద రెడ్డి పైన 14,604 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

గురజాల జగన్ మోహన్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన ఒక తెలుగు సినిమా నిర్మించారు. మనలో ఒకడు అనే తెలుగు సినిమాకు నిర్మాతగా చేశారు.

Nagari MLA 2024 | పూర్తి జాబితా

Nagari MLA 2024 Gali Bhanu Prakash
నగరి ఎమ్మెల్యే 2024 గాలి భాను ప్రకాష్ | Nagari MLA 2024 Gali Bhanu Prakash (Source : Facebook)

నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గారిది రాజకీయ నేపథ్యం గల కుటుంబం. గాలి భాను ప్రకాష్ గారి నాన్నగారు గాలి ముద్దుకృష్ణమనాయుడు టిడిపి పార్టీ సీనియర్ నాయకులు అంతేకాకుండా టిడిపి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు.

ఆయన తండ్రి గారు పలుసార్లు ఎమ్మెల్యేగాను మరియు మంత్రిగాను పనిచేశారు. తండ్రి మరణానంతరం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు.

తండ్రి రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్న గాలి భాను ప్రకాష్. 2019 శాసనసభ ఎన్నికల్లో ఆయనకు టిడిపి పార్టీ నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2019 శాసనసభ ఎన్నికలలో నగరి శాసనసభ నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన ఆర్కే రోజా చేతిలో 2,708 అతి తక్కువ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

2024 శాసనసభ ఎన్నికలలో టిడిపి పార్టీ తరపున వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన ఆర్కే రోజా పైన 45,004 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

నగరి నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 45,004 అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా గాలి భాను ప్రకాష్ గారు ఒక అరుదైన రికార్డు సృష్టించారు. ఈ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కూడా అంత భారీ మెజారిటీతో గెలవలేదు.

Puthalapattu MLA 2024 | పూర్తి జాబితా

Puthalapattu MLA 2024 Kalikiri Murali Mohan
పూతలపట్టు ఎమ్మెల్యే 2024 కలికిరి మురళీ మోహన్ | Puthalapattu MLA 2024 Kalikiri Murali Mohan (Source : Facebook)

పూతలపట్టు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే కలికిరి మురళీ మోహన్ గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆయన ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చారు.

2024 ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశం పార్టీ పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. 2024 శాసనసభ ఎన్నికలలో పూతలపట్టు శాసనసభ నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన ఎం. సునీల్ కుమార్ పైన 15,634 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

పూతలపట్టు నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 2024 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక అరుదైన రికార్డు సృష్టించింది. అదేంటంటే పూతలపట్టు నియోజకవర్గం 2009 నుంచి 2019 వరకు టిడిపి పార్టీ జెండా ఎగరలేదు. ఎట్టకేలకు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సంచలన విజయం సాధించింది.

పూతలపట్టు 2009 లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి టిడిపి పార్టీ వరుసగా ఓడిపోతూనే వచ్చింది. 2024 శాసనసభ ఎన్నికలలో పూతలపట్టు నియోజకవర్గంలో మొదటిసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది.

Gangadhara Nellore MLA 2024 | పూర్తి జాబితా

Gangadhara Nellore MLA 2024 VM Thomas
గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే 2024 విఎం థామస్ | Gangadhara Nellore MLA 2024 VM Thomas (Source : Facebook)

గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ప్రస్తుత ఎమ్మెల్యే వి.ఎం. థామస్ గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఆయనకు 2024 ఎన్నికల్లో టిడిపి పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

2024 శాసనసభ ఎన్నికలలో గంగాధర నెల్లూరు శాసనసభ నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన కలతూరు కృప లక్ష్మి పైన 26,011 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

గంగాధర నెల్లూరు నియోజకవర్గం రాజకీయ చరిత్రలో 2024 శాసనసభ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ సంచలన రికార్డ్ సృష్టించింది. అదేంటంటే 2009 లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 2019 వరకు టిడిపి పార్టీ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు.

దాదాపు 15 ఏళ్ల తర్వాత 2024 శాసనసభ ఎన్నికల్లో వి.ఎం. థామస్ గెలుపుతో గంగాధర నెల్లూరు జిల్లాలో పసుపు జెండా మొదటిసారి ఎగిరింది. తెలుగుదేశం పార్టీకి ఇది ఒక చారిత్రాత్మక విజయం.

Kuppam MLA 2024 | పూర్తి జాబితా

Kuppam MLA 2024 Nara Chandrababu Naidu
కుప్పం ఎమ్మెల్యే 2024 నారా చంద్రబాబు నాయుడు | Kuppam MLA 2024 Nara Chandrababu Naidu (Source : Facebook)

కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యే అలియాస్ టిడిపి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ సుపరిచితమే. ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చారు.

West Godavari District MLA List 2024
West Godavari District MLA List 2024 (Latest Update ) | పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

1978 శాసనసభ ఎన్నికలలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. 1978 శాసనసభ ఎన్నికలలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి జనతా పార్టీకి చెందిన కొంగర పట్టాభి రామ చౌదరి పైన 2,494 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

1980 నుంచి 1983 మధ్య కాలంలో సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య పశు సంవర్ధక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు గారి కూతురు భువనేశ్వరి గారిని ఆయన పెళ్లి చేసుకున్నారు. పెళ్ళయ్యాక కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.

1983 శాసనసభ ఎన్నికల్లో మళ్లీ చంద్రగిరి నియోజకవర్గానికి గాను కాంగ్రెస్ పార్టీ తరపున వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన మేడసాని వెంకటరామ నాయుడు చేతిలో 17,429 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

ఆ తర్వాత ఆయన1985 నుంచి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి, పార్టీ కార్యక్రమాల ప్రచారంలో చురుగ్గా పాల్గొనేవారు. రామారావు గారికి చేదోడువాదోడుగా ఉండేవారు.

1989 శాసనసభ ఎన్నికల నుంచి ఆయన కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. 1989 శాసనసభ ఎన్నికలలో కుప్పం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన దొరస్వామి నాయుడు పైన 6,918 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ఆయన 1989 నుంచి 2024 శాసనసభ ఎన్నికలలో కుప్పం శాసనసభ నియోజకవర్గం నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎనిమిది సార్లు ఘనవిజయం సాధించారు. అంతేకాకుండా కుప్పం నియోజకవర్గం రాజకీయ చరిత్రలో అత్యధిక సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా సంచలన రికార్డ్ సృష్టించారు.

కుప్పం నియోజకవర్గం చరిత్రలో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన రికార్డ్ సృష్టించారు. ఆయన మొత్తం పదిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, అందులో తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒకసారి విజయం సాధించారు. మరొకసారి పరాజయం పాలయ్యారు.

కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా ఎనిమిది సార్లు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు ఎమ్మెల్యేగా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.

1995 సంవత్సరంలో 45 ఏళ్ల వయసులోనే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత మళ్లీ 1999 సంవత్సరంలో మళ్లీ వరుసగా రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.

2004 మరియు 2009 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలిచి విజయం సాధించడంతో టిడిపి పార్టీ అధికారం కోల్పోయింది.

మళ్లీ 2014 శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను మూడోసారి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత మళ్లీ 2019 శాసనసభ ఎన్నికలలో టిడిపి పార్టీ అధికారం కోల్పోయింది. వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చింది.

2024 శాసనసభ ఎన్నికలలో కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన కె ఆర్ జె భరత్ పైన 48,006 ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2024 సంవత్సరంలో టిడిపి జనసేన మరియు బిజెపి పార్టీలు ఎన్డీయే కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేశాయి. 2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Palamaner MLA 2024 | పూర్తి జాబితా

Palamaner MLA 2024 N Amarnath Reddy
పలమనేరు ఎమ్మెల్యే 2024 ఎన్ అమర్ నాథ్ రెడ్డి | Palamaner MLA 2024 N Amarnath Reddy (Source : Facebook)

పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారిది రాజకీయ నేపథ్యం గల కుటుంబం. అమర్నాథ్ రెడ్డి గారి తండ్రి గారు ఎన్ రామకృష్ణారెడ్డి టిడిపి పార్టీ సీనియర్ నాయకులు మరియు అంతేకాకుండా పుంగనూరు నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఆయన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 1996 ఉప ఎన్నికల్లో భాగంగా టిడిపి పార్టీ ఆయనకు పుంగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

1996 శాసనసభ ఉప ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం. కమల్ పైన 30,034 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

1999 శాసనసభ ఎన్నికలలో వరుసగా పుంగనూరు నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్. శ్రీధర్ రెడ్డి చేతిలో 5,746 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

2004 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున పుంగనూరు నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన రెడ్డప్ప రెడ్డి పైన 9,174 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.

2009 ఎన్నికల్లో ఆయన పలమనేరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2009 శాసనసభ ఎన్నికల్లో టిడిపి పార్టీ తరపున పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన రెడ్డప్ప రెడ్డి పైన 15,548 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడో సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి టిడిపి పార్టీకి చెందిన ఆర్. వి. సుభాష్ చంద్రబోస్ పైన 2,850 ఓట్ల మెజారిటీతో గెలిచి నాలుగో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

మళ్లీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి 2016 సంవత్సరంలో టిడిపి పార్టీలో చేరారు. ఆయన 2017 నుంచి 2019 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఆ తర్వాత 2019 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన వెంకటే గౌడ చేతిలో 32,246 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.

East Godavari District MLA List 2024
East Godavari District MLA List 2024 ( Latest Update ) | తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితా

2024 శాసనసభ ఎన్నికలలో మళ్ళీ పలమనేరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన వెంకటే గౌడ పైన 20,122 ఓట్ల మెజారిటీతో గెలిచి ఐదోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

అమర్నాథ్ రెడ్డి గారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, అందులో ఐదుసార్లు విజయం సాధించారు. ఒకసారి వైకాపా పార్టీ తరపున గెలిచారు. మిగతా నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు.

Comparison Table 2024

ConstituencyWinnerRunnerMargin
ChittoorGurajala Jagan MohanM.C. Vijayananda Reddy14,604
NagariGali Bhanu PrakashR.K. Roja45,004
Puthalapattu (SC)Kalikiri Murali MohanM. Suneel Kumar15,634
Gangadhara Nellore (SC)V.M. ThomasKalathuru Krupa Lakshmi26,011
KuppamNara Chandrababu NaiduK. R. J. Bharath48,006
PalamanerN. Amarnath ReddyN. Venkate Gowda20,122

ఆధారాలు (Source): పై పట్టికలోని అభ్యర్థుల మెజారిటీలు మరియు ఎన్నికల ఫలితాల వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా ఇవ్వబడినవి.

Previous Election Comparison ( 2019 VS 2024 )

2019 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో భాగంగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఆరు నియోజకవర్గాలలో వైఎస్సార్సీపీ ఐదు నియోజకవర్గాల్లో గెలిచింది. మిగతా ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆ ఒక్క నియోజకవర్గం కూడా చంద్రబాబు నాయుడు గారి కుప్పం నియోజకవర్గం.

2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేయగా, వైకాపా పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కలేదు. అన్ని నియోజకవర్గాల్లోనూ టిడిపి పసుపు జెండా రెపరెపలాడింది.

2019 ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్ గాలి గట్టిగానే వీచింది. 2024 ఎన్నికల్లో మాత్రం వైకాపా పార్టీ ఘోర పరాజయం పాలైంది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించి, చిత్తూరు జిల్లాలో టిడిపి తమ పట్టును మరోసారి నిరూపించుకుంది.

Alliance Impact 2024

2024 శాసనసభ ఎన్నికల ఫలితాలలో టిడిపి, జనసేన మరియు బిజెపి పార్టీలు కూటమిగా ఏర్పడి ఓట్లు చీలకుండా ప్రభావాన్ని చూపాయి. అందువలన టిడిపి పార్టీ చిత్తూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. అది కాకుండా చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మరియు గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో 2024 ఎన్నికల్లో టిడిపి మొదటిసారి కైవసం చేసుకుంది.

అదే విధంగా చిత్తూరు జిల్లా యువత ఓటర్లు మరియు తటస్థ ఓటర్లు ఎన్డీయే కూటమి వైపే మొగ్గు చూపారు. కొత్త ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రభావం కూటమి విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

ముగింపు

2024 శాసనసభ ఎన్నికల ఫలితాల్లో చిత్తూరు జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలలో వైకాపా పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేక పోయింది. ఎన్డీయే కూటమి అన్ని నియోజకవర్గాల్లో గెలిచి సంచలన రికార్డ్ సృష్టించింది. టిడిపి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ క్లీన్ స్వీప్ చేసి తన సత్తా మరొకసారి నిరూపించుకుంది.

ముఖ్య గమనిక (Disclaimer & Credits) :

సమాచార సేకరణ : ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం మరియు ఫోటోలు కేవలం పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మరియు విద్యా ప్రయోజనాల (Informational and Educational Purposes) కోసం మాత్రమే సేకరించబడినవి.

ఫోటో సౌజన్యం : ఇందులో ఉపయోగించిన చిత్రాలు సంబంధిత ఎమ్మెల్యేల అధికారిక Facebook/Social Media ఖాతాల నుండి సేకరించబడినవి. వీటిపై పూర్తి హక్కులు ఆయా వ్యక్తులకు మాత్రమే ఉంటాయి.

మా ఉద్దేశ్యం : ఎటువంటి కాపీరైట్ నియమాలను ఉల్లంఘించడం మా ఉద్దేశ్యం కాదు. కేవలం పాఠకులకు లేటెస్ట్ సమాచారాన్ని అందించడమే UU News లక్ష్యం.

తరచుగా అడిగే ప్రశ్నలు

చిత్తూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

గురజాల జగన్ మోహన్ (టిడిపి పార్టీ)

నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు 2024?

గాలి భాను ప్రకాష్ (టిడిపి పార్టీ)

పూతలపట్టు ఎమ్మెల్యే ఎవరు 2024?

కలికిరి మురళీ మోహన్ (టిడిపి పార్టీ)

గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే ఎవరు 2024?

వి.ఎం. థామస్ (టిడిపి పార్టీ)

కుప్పం ఎమ్మెల్యే ఎవరు 2024?

నారా చంద్రబాబు నాయుడు (టిడిపి పార్టీ)

పలమనేరు ఎమ్మెల్యే ఎవరు 2024?

ఎన్. అమర్నాథ్ రెడ్డి (టిడిపి పార్టీ)

చిత్తూరు జిల్లాలో మొత్తం ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి?

చిత్తూరు జిల్లాలో మొత్తం ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి.

2024 ఎన్నికలలో చిత్తూరు జిల్లాలో ఏ పార్టీ విజయం సాధించింది?

చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టిడిపి పార్టీనే ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుంది.

2024 ఎన్నికలలో గెలిచిన చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేల పేర్లు

నారా చంద్రబాబు నాయుడు, గాలి భాను ప్రకాష్, గురజాల జగన్ మోహన్, కలికిరి మురళీ మోహన్, వి.ఎం. థామస్ మరియు ఎన్. అమర్నాథ్ రెడ్డి

Leave a Comment