Sri Sathya Sai District MLA List 2024 : 2024 లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో గెలుపొందిన శ్రీ సత్యసాయి జిల్లా ఎమ్మెల్యేల పూర్తి జాబితాను తెలుసుకుందాం.
Sri Sathya Sai District MLA List 2024
2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో గెలిచిన శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ, ప్రస్తుతానికి కూడా తమ పదవుల్లో కొనసాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలో మొత్తం ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో గెలుపొందిన శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేల పేర్లు, నియోజకవర్గాల పేర్లు మరియు పార్టీ పేర్లను ఇక్కడ చూడండి.
| S.NO. | MLA Name | Constituency | Party Name |
| 1 | Nandamuri Balakrishna | Hindupur | TDP |
| 2 | Palle Sindhura Reddy | Puttaparthi | TDP |
| 3 | M.S. Raju | Madakasira (SC) | TDP |
| 4 | Kandikunta Venkata Prasad | Kadiri | TDP |
| 5 | S. Savitha | Penukonda | TDP |
| 6 | Satya Kumar Yadav | Dharmavaram | BJP |
Source: ఈ పట్టికలోని వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా సేకరించబడినవి.
Hindupur MLA 2024 | పూర్తి జాబితా

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ సుపరిచితమే. నటుడిగాను అలరిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా మరియు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సీనియర్ హీరో తెలుగుదేశం పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు గారి తనయుడు నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ గారి క్రేజ్ ప్రపంచం మొత్తం మామూలుగా లేదు. ఎక్కడ చూసినా జై బాలయ్య అంటూ నినాదాలు.
నందమూరి రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో బాలకృష్ణ గారు కూడా ప్రచారం చేశారు. కానీ ఎప్పుడూ ఆయన పార్టీ కార్యక్రమాల ప్రచారాల్లోనే పాల్గొన్నారు. కానీ పదవి ఎప్పుడూ ఆశించలేదు.
నందమూరి తారక రామారావు గారు హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున 1985, 1989 మరియు 1994 శాసనసభ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు పోటీ చేసి, మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
బాలకృష్ణ గారు తండ్రి గారి స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి కూడా అరంగేట్రం చేశారు.
ఆయనకు 2014 ఎన్నికల్లో టిడిపి పార్టీ హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున హిందూపురం నియోజకవర్గానికి గాను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన నవీన్ నిశ్చల్ పైన 16,196 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
అనంతరం 2019 శాసనసభ ఎన్నికలలో హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన షేక్ మొహమ్మద్ ఇక్బాల్ పైన 18,028 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఆ తర్వాత 2024 శాసనసభ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన తిప్పెగౌడ నారాయణ్ దీపిక పైన 32,597 ఓట్ల మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.
హిందూపురం నియోజకవర్గం చరిత్రలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేలుగా గెలిచింది ఇద్దరే, ఆ ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే ఒకరేమో నందమూరి తారక రామారావు గారు, మరొకరు నందమూరి బాలకృష్ణ గారు.
హిందూపురం నియోజకవర్గంలో ప్రధాన సమస్య తాగునీటి సమస్య. తాగునీటి సమస్య ఎన్నో ఏళ్ల తరబడి నుంచి ప్రజల్ని వెంటాడుతూనే ఉంది. ఆయన ఎమ్మెల్యే అయ్యాక హంద్రీ నీవా ప్రాజెక్టు ద్వారా నీళ్లను హిందూపురంకు తీసుకురావడానికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
హిందూపురంలో గతంలో 10 నుంచి 20 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చే పరిస్థితి నుండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో వారానికి రెండు మూడుసార్లు లేదా అంతకంటే మెరుగైన నీళ్ల సరఫరా జరుగుతుంది.
Puttaparthi MLA 2024 | పూర్తి జాబితా

పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గారిది రాజకీయ నేపథ్యం గల కుటుంబం. ఆమె మామగారు పల్లె రఘునాథ్ రెడ్డి గారు టిడిపి పార్టీ సీనియర్ నాయకులు మరియు అంతేకాకుండా ఆయన చంద్రబాబు గారి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు.
మామ పల్లె రఘునాథ్ రెడ్డి గారి రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ ఆమె రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆమె తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆమెకు పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 శాసనసభ ఎన్నికలలో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన దుడ్డుకుంట శ్రీధర్ రెడ్డి పైన 8,760 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
పుట్టపర్తి నియోజకవర్గం రాజకీయ చరిత్రలో గెలిచిన ఏకైక మహిళ ఎమ్మెల్యేగా పల్లె సింధూర రెడ్డి గారు ఒక అరుదైన రికార్డు సృష్టించారు.
Madakasira MLA 2024 | పూర్తి జాబితా

మడకశిర నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే ఎం ఎస్ రాజు గారు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని సాధారణ కుటుంబం నుంచి వచ్చారు.
నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో భాగంగా ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన పనితీరుని చూసి టిడిపి పార్టీ 2024 ఎన్నికలలో మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 ఎన్నికలలో మడకశిర నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన ఎర్ర లక్కప్ప పైన 351 ఓట్ల అతి తక్కువ మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.
ఎం ఎస్ రాజు గారు ప్రస్తుతానికి టీటీడీ బోర్డు సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Kadiri MLA 2024 | పూర్తి జాబితా

కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గారు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 2004 శాసనసభ ఎన్నికల్లో ఆయన మొదటిసారి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని సాధారణ కుటుంబం నుంచి వచ్చారు.
2004 శాసనసభ ఎన్నికలలో కదిరి నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన జొన్న రామయ్య చేతిలో 8,938 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
2009 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన బట్టల వెంకటరమణ పైన 14,977 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2014 శాసనసభ ఎన్నికలలో టిడిపి పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన అత్తర్ చాంద్ భాష చేతిలో 968 అతి తక్కువ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
అనంతరం 2019 శాసనసభ ఎన్నికల్లో వరుసగా మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన పివి సిద్ధా రెడ్డి చేతిలో 27,243 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.
ఆ తర్వాత 2024 శాసనసభ ఎన్నికలలో కదిరి నియోజకవర్గానికి గాను తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన మక్బూల్ అహ్మద్ పైన 6,265 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఆయన ఎమ్మెల్యేగా ఐదు సార్లు పోటీ చేస్తే, అందులో మూడుసార్లు ఓటమి పాలయ్యారు. మిగతా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ రెండుసార్లు కూడా తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు.
Penukonda MLA 2024 | పూర్తి జాబితా

పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే సంజీవరెడ్డి గారి సవిత గారిది రాజకీయ నేపథ్యం గల కుటుంబం. ఆమె తండ్రి ఎస్ రామచంద్ర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు అంతేకాకుండా ఆయన టిడిపి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు.
ఆమె తండ్రి గారి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఆమె పనిచేసింది. 2024 ఎన్నికలలో ఆమెకు టిడిపి పార్టీ పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 శాసనసభ ఎన్నికలలో పెనుకొండ శాసనసభ నియోజకవర్గం గురించి టిడిపి పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన కెవి ఉషశ్రీ చరణ్ పైన 33,388 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.
పెనుకొండ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ నియోజకవర్గంలో గెలుపొందిన రెండవ మహిళా ఎమ్మెల్యేగా ఎస్ సవిత గుర్తింపు పొందారు. అంతకుముందు 2005 ఉప ఎన్నికల్లో పెనుకొండ నియోజకవర్గం నుంచి పరిటాల సునీత గారు మొదటి మహిళా ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు.
మళ్ళీ 19 సంవత్సరాల తరువాత పెనుకొండ నియోజకవర్గంలో మహిళా ఎమ్మెల్యే విజయం సాధించింది. ప్రస్తుతానికి ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Dharmavaram MLA 2024 | పూర్తి జాబితా

ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ గారు బిజెపి పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. బిజెపి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి దగ్గర చాలా సంవత్సరాలు పాటు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు.
2024 ఎన్నికల్లో టిడిపి జనసేన మరియు బిజెపి పార్టీలు ఎన్డీయే కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేశారు. 2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బిజెపి పార్టీ తరపున ఆయనకు ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
2024 శాసనసభ ఎన్నికలలో ధర్మవరం నియోజకవర్గం నుంచి బిజెపి పార్టీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పైన 3,734 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.
ధర్మవరం నియోజకవర్గం రాజకీయ చరిత్రలో గెలిచిన మొదటి మరియు ఏకైక బిజెపి ఎమ్మెల్యేగా సత్య కుమార్ యాదవ్ గారు ఒక అరుదైన రికార్డు సృష్టించారు. ప్రస్తుతానికి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Comparison Table 2024
| Constituency | Winner | Runner | Margin |
| Hindupur | Nandamuri Balakrishna | Tippegowda Narayan Deepika | 32,597 |
| Puttaparthi | Palle Sindhura Reddy | Duddukunta Sreedhar Reddy | 8,760 |
| Madakasira (SC) | M.S. Raju | Erra Lakkappa | 351 |
| Kadiri | Kandikunta Venkata Prasad | BS Maqbool Ahmed | 6,265 |
| Penukonda | S. Savitha | K.V. Ushashri Charan | 33,388 |
| Dharmavaram | Satya Kumar Yadav | Kethireddy Venkatarami Reddy | 3,734 |
ఆధారాలు (Source): పై పట్టికలోని అభ్యర్థుల మెజారిటీలు మరియు ఎన్నికల ఫలితాల వివరాలు భారత ఎన్నికల సంఘం (ECI) మరియు వికీపీడియా అధికారిక గణాంకాల ఆధారంగా ఇవ్వబడినవి.
Previous Election Comparison ( 2019 VS 2024 )
2019 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించిన ఆరు నియోజకవర్గాలలో వైఎస్సార్సీపీ పార్టీ ఐదు నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మిగతా ఒక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.
2024 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో శ్రీ సత్యసాయి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసింది. వైకాపా పార్టీకి ఒక్క నియోజకవర్గం కూడా దక్కలేదు.
2019 శాసనసభ ఎన్నికల ఫలితాల్లో వైకాపా పార్టీ ఐదు నియోజకవర్గాల్లో గెలిచి సత్తా చాటుకుంది. 2024 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. ఎన్డీయే కూటమి ప్రభంజనం ముందు వైకాపా పార్టీ నిలవ లేకపోయింది.
Alliance Impact 2024
2024 శాసనసభ ఎన్నికల్లో శ్రీ సత్యసాయి జిల్లాలో టిడిపి, జనసేన మరియు బిజెపి పార్టీలు ఎన్డీయే కూటమిగా ఏర్పడి క్లీన్ స్వీప్ చేసి భారీ ప్రభావాన్ని చూపింది. అంతేకాకుండా ఓట్లు పక్కకు పోకుండా మూడు పార్టీలు కలిసికట్టుగా పోటీ చేసేసరికి ఓట్ల మెజారిటీ గణనీయంగా పెరిగింది.
అంతేకాకుండా ఈ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో మొదటిసారి నలుగురు కొత్తవారు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కొత్త అభ్యర్థుల ప్రభావం, యువత మరియు తటస్థ ఓటర్లు ప్రభావం కూడా కూటమికి మెరుగైన మెజారిటీ రావడానికి దోహదపడ్డాయి.
ముగింపు
2024 శాసనసభ ఎన్నికల ఫలితాల్లో శ్రీ సత్య సాయి జిల్లాలో ఎన్డీయే కూటమి హవా ముందు వైసిపి పార్టీ నిలువ లేకపోయింది. కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా వైసీపీ పార్టీ గెలవలేక పోయింది. ఎన్డీయే కూటమి శ్రీ సత్యసాయి జిల్లాలోనూ క్లీన్ స్వీప్ చేసింది. అందులో ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే, మిగతా ఒకచోట బిజెపి పార్టీ విజయం సాధించింది.
ముఖ్య గమనిక (Disclaimer & Credits) :
సమాచార సేకరణ : ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం మరియు ఫోటోలు కేవలం పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మరియు విద్యా ప్రయోజనాల (Informational and Educational Purposes) కోసం మాత్రమే సేకరించబడినవి.
ఫోటో సౌజన్యం : ఇందులో ఉపయోగించిన చిత్రాలు సంబంధిత ఎమ్మెల్యేల అధికారిక Facebook/Social Media ఖాతాల నుండి సేకరించబడినవి. వీటిపై పూర్తి హక్కులు ఆయా వ్యక్తులకు మాత్రమే ఉంటాయి.
మా ఉద్దేశ్యం : ఎటువంటి కాపీరైట్ నియమాలను ఉల్లంఘించడం మా ఉద్దేశ్యం కాదు. కేవలం పాఠకులకు లేటెస్ట్ సమాచారాన్ని అందించడమే UU News లక్ష్యం.
తరచుగా అడిగే ప్రశ్నలు
హిందూపురం ఎమ్మెల్యే ఎవరు 2024?
నందమూరి బాలకృష్ణ ( టిడిపి పార్టీ )
పుట్టపర్తి ఎమ్మెల్యే ఎవరు 2024?
పల్లె సింధూర రెడ్డి ( టిడిపి పార్టీ )
మడకశిర ఎమ్మెల్యే ఎవరు 2024?
ఎం.ఎస్. రాజు ( టిడిపి పార్టీ )
కదిరి ఎమ్మెల్యే ఎవరు 2024?
కందికుంట వెంకట ప్రసాద్ ( టిడిపి పార్టీ )
పెనుకొండ ఎమ్మెల్యే ఎవరు 2024?
ఎస్. సవిత
ధర్మవరం ఎమ్మెల్యే ఎవరు 2024?
సత్య కుమార్ యాదవ్ ( బిజెపి పార్టీ )
శ్రీ సత్యసాయి జిల్లాలో అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి?
మొత్తం ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి.
శ్రీ సత్యసాయి జిల్లాలో టిడిపి పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో గెలిచింది 2024?
2024 ఎన్నికల్లో శ్రీ సత్యసాయి జిల్లాలో టిడిపి పార్టీ ఐదు నియోజకవర్గాల్లో గెలిచింది.
శ్రీ సత్యసాయి జిల్లాలో వైకాపా పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో గెలిచింది 2024?
2024 ఎన్నికల్లో శ్రీ సత్యసాయి జిల్లాలో వైకాపా పార్టీ ఒక్క నియోజకవర్గంలో కూడా గెలవలేదు.
