Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్ : మాజీ మంత్రి వైసిపి నాయకుడు జోగి రమేష్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన కూటమి మంత్రి వాసంశెట్టి సుభాష్. జోగి రమేష్ సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్నాడని అంతే కాకుండా కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడని వాసంశెట్టి సుభాష్ గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్

గతంలో జోగి రమేష్ నోటికి వచ్చింది మాట్లాడటమే కాకుండా సీఎం నారా చంద్రబాబునాయుడు గారి ఇంటి పైన దాడికి పాల్పడ్డాడు. నిత్యం బూతుల మీద బ్రతికే జోగి రమేష్ ఒక్కసారిగా అవినీతి కేసుల్లో ఇరుక్కొని జైలు కి వెళ్లిన సంగతి అందరికి తెలిసిందే. దాని నిమిత్తం 83 రోజులు జైలు జీవితం గడిపాడు. మరి బయటికి వచ్చి సిగ్గు లేకుండా బీసీ కార్డు గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు గుర్తొచ్చిందా బీసీ కార్డు.

యువత వ్యవసాయం వైపు మరలాలి
Kinjarapu Atchannaidu : యువత వ్యవసాయం వైపు మరలాలి.. రైతును రాజుగా చేయటానికి పంచసూత్రాలు

ఈరోజు బూతులు మాట్లాడి దాడులు చేసి అవినీతి చేసి జైలు కి వెళ్తుంటే, బయటికి వచ్చి కులం కార్డులు వాడుతున్నారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ మరియు పవన్ కళ్యాణ్ గారిని అనేక తప్పుడు మాటలు మాట్లాడి, ఇష్టానుసారంగా మాట్లాడేవారు. వాళ్లందరికీ మంత్రి పదవి ఇచ్చేవారు జగన్. ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీలో కులం కార్డు వాడి కులాలను రెచ్చగొట్టలేదు. అని వాసంశెట్టి సుభాష్ గారు పేర్కొన్నారు.

Leave a Comment