వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ బాహుబలి ఒప్పందం : ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మూడవరోజు ప్రారంభమయ్యాయి. మూడవరోజు అసెంబ్లీలో 2026-2027 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ని ప్రవేశపెట్టిన ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల్ కేశవ్. వైజాగ్ లో పెట్టబోతున్న గూగుల్ డేటా సెంటర్ పైన పయ్యావుల కేశవ్ గారు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ ని బాహుబలి ఒప్పందంగా పేర్కొనవచ్చని పయ్యావుల కేశవ్ గారు అన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ బాహుబలి ఒప్పందం
భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రపంచ వేదికపైన వెలుగులీనుతుంది. విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలన్న గ్లోబల్ దిగ్గజం గూగుల్ నిర్ణయం ఒక్కసారి ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు తలెత్తి చూసేలా చేశాయి. దాన్ని బాహుబలి ఒప్పందంగా పేర్కొనవచ్చు. ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ అని ఆ ఒప్పందం రుజువు చేసింది.
చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం. ఐటి విద్య శాఖల మంత్రి నారా లోకేష్ గారి విశేష కృషి వలన ఇది సాధ్యమైంది. ఇంతేకాదు రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి. ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. అంటే అది సీఎం చంద్రబాబు నాయుడు గారు దార్శనికత పాలన మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశ్వసనీయ భాగస్వామ్యం వలనే సాధ్యం అయ్యింది. అని పయ్యావుల కేశవ్ గారు పేర్కొన్నారు.
