Payyavula Keshav : వైసిపి 9.74 లక్షల కోట్లు అప్పు చేసింది.. మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి

వైసిపి 9.74 లక్షల కోట్లు అప్పు చేసింది : ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మూడవరోజు ప్రారంభమయ్యాయి. మూడవరోజు అసెంబ్లీలో 2026-2027 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ని ప్రవేశపెట్టిన ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల్ కేశవ్. అదేవిధంగా వైసిపి ప్రభుత్వం చేసిన అప్పులు 9.74 లక్షల కోట్లు అని పయ్యావుల కేశవ్ గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

వైసిపి 9.74 లక్షల కోట్లు అప్పు చేసింది

అప్పులు గురించి మాట్లాడుతున్న ప్రతిపక్ష మిత్రులకి ఒక విషయం గుర్తు చేయదలుచుకున్న 9.74 లక్షల కోట్ల రూపాయల అప్పును మిగిల్చి వెళ్ళింది మీ ప్రభుత్వమే మీరు చేసినటువంటి అప్పులు తీర్చడానికి మేము అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. కానీ ఈరోజు మేము అప్పుగా తెస్తున్న ప్రతి రూపాయి ఉత్పాదకత వ్యయంలోనే వెళ్తుంది. అది రైతులు మహిళలు విద్యార్థులు వృద్ధుల చేతుల్లోకి వెళ్తుంది.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

గత ప్రభుత్వ నిర్వాకాల వల్ల సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితి నుండి ఇప్పుడు మా ప్రభుత్వం సమర్థ పాలన విధానాలతో ఆర్ధిక సుస్థిరత దిశగా అడుగులు వేస్తుంది. ఖర్చులు తగ్గించుకుని వనరులు పెంచుకొని ఆర్థిక స్థిరత్వం దిశగా ప్రయాణం చేస్తుంది. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఆకాంక్షల సాకార దిశగా నడిపిస్తున్నాం. అని పయ్యావుల కేశవ్ గారు పేర్కొన్నారు.

Leave a Comment