Chandrababu Naidu : వైసిపికి 11 కి అవినాభావ సంబంధం ఉంది.. 11 నిమిషాల్లో విద్వంసం చేశారు

వైసిపికి 11 కి అవినాభావ సంబంధం ఉంది : వైసిపి 11 మంది ఎమ్మెల్యేలు తాజాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంలో పాల్గొనడం జరిగింది. వైసిపి వారిని ఉద్దేశించి నారా చంద్రబాబునాయుడు గారు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 11 కి వాళ్లకి అవినాభావ సంబంధం ఉంది. అసెంబ్లీలో 11 నిమిషాలే ఉండి విద్వంసం చేసి వెళ్లిపోయారని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

వైసిపికి 11 కి అవినాభావ సంబంధం ఉంది

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొదలైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసిపి 11 మంది ఎమ్మెల్యేల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్కరోజే వచ్చారు. ఏదో వాళ్ళకి 11కి అవినాభావ సంబంధం ఉంది. 11 నిముషాలు ఉన్నారు. 11 నిమిషాలే ఉండి, చూస్తూనే ఉన్నాం అక్కడ నిలబడుకునే వాళ్ళను, ఆ 11 నిముషాలు విద్వంసం చేశారు.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

గవర్నర్ ని కూడా ఇన్సల్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. మీరు పేపర్లు చించుకోవచ్చు కానీ గవర్నర్ పైన వేయాలన్న ఆలోచన రావడం దుర్మార్గం. అప్రజాస్వామ్యంగా చేసిన ఎవరికైనా సరే దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు.

Leave a Comment