Chandrababu Naidu : పొత్తు పెట్టుకుంటాం అని చెప్పింది పవన్ కళ్యాణ్

పొత్తు పెట్టుకుంటాం అని చెప్పింది పవన్ కళ్యాణ్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను జైలు లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మరియు బాలయ్య గారు ఇద్దరు వచ్చారని, జైలు నుంచి బయటికి వచ్చాక మేము పొత్తు పెట్టుకుంటాం అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

పొత్తు పెట్టుకుంటాం అని చెప్పింది పవన్ కళ్యాణ్

నాకు నోటీసు కూడా ఇవ్వకుండా నన్నే అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్తే ఆయన్ని దిగనివ్వకుండా తిరిగి హోటల్ లో ఉంటె బలవంతంగా పంపించడం. నేను కానీ ఉపముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాం తప్ప, నాయకుల్ని పార్టీలను దృష్టిలో పెట్టుకొని కాదు.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. అందరం కలిసి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తే తప్ప రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేము. ఏకైక సంకల్పంతో ఆలోచించాం. ఆ రోజు నేను జైలు లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాలయ్య గారు ఇద్దరు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు బయటికి పోయి, ఏది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా డివైడ్ కావడానికి వీల్లేదు. మేము పొత్తు పెట్టుకుంటాం అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు.

యువత వ్యవసాయం వైపు మరలాలి
Kinjarapu Atchannaidu : యువత వ్యవసాయం వైపు మరలాలి.. రైతును రాజుగా చేయటానికి పంచసూత్రాలు

Leave a Comment