చంద్రబాబు ముందుచూపు వల్ల : అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. టిడిపి ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారి ముందుచూపు వల్ల ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేసవి కాలంలో కూడా చెరువులు నిండుగా ఉన్నాయని కాల్వ శ్రీనివాసులు గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
చంద్రబాబు ముందుచూపు వల్ల
కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ… కృష్ణ డెల్టాకు ఇవ్వాల్సిన నీటిని గోదావరి జలాలతో ఇస్తున్నారు కాబట్టి ఆ నీటిని మేము గాలేరు నగరి గాని హంద్రీనీవా ద్వారా గాని ఉపయోగించగల్గుతున్నాం. ఒక్క హంద్రీనీవా 40 టిఎంసి ల సామర్థ్యంతో చేపడితే నేటికి 44 టీఎంసీ ల నీటిని తెచ్చుకున్నాం.
మేము తీసుకువచ్చిన 44 టీఎంసీ లతో అనంతపురం మరియు సత్యసాయి జిల్లాలో 156 చెరువులు ఈరోజు కళకళ లాడుతున్నాయి. వేసవికాలం మేలో కూడా మనం చెరువుల్లో నీళ్లు చూడగల్గుతున్నాం అంటే అది చంద్రబాబుగారి ముందుచూపుకి నిదర్శనం. రాయలసీమను శాశ్వతంగా కరువు నుంచి విముక్తం చేయటానికి సస్యశ్యామలం చేయటానికి పారిశ్రామికంగా అభివృద్ధి చేయటానికి తీసుకుంటున్న చర్యలు న భూతో న భవిష్యత్ రీతిలో ఉన్నాయి.
