Nara Lokesh : ఒక్క కప్ కాఫీ తప్ప ఏం తీసుకోలేదు.. వైసిపికి ఇదే నా సవాల్

ఒక్క కప్ కాఫీ తప్ప ఏం తీసుకోలేదు : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనమండలి సమావేశాల్లో కూటమి మరియు వైసిపి ఎమ్మెల్సీ లతో పాటు కొందరు కూటమి మంత్రులు కూడా హాజరయ్యారు. వైసిపి పార్టీకి సవాల్ విసిరిన నారా లోకేశ్. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ లోని భూములు పొందిన ఐదు కంపెనీల నుంచి ఒక్క కప్ కాఫీ, టీ తప్ప ఏం తీసుకోలేదు అని నారా లోకేశ్ గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

ఒక్క కప్ కాఫీ తప్ప ఏం తీసుకోలేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ లో ఐదు ఐటి కంపెనీలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఆ ఐదు ఐటి కంపెనీలకు 99 పైసలకే భూములను కేటాయించింది. ఆంధ్ర రాష్ట్ర యూత్ కి ఉద్యోగాలు కల్పించాలని ఉద్దేశ్యంతోనే తక్కువ ధరలతోనే ఐటి కంపెనీలకు భూములు ఇచ్చింది. అదేవిధంగా వైజాగ్ సిటీలో ఎకో సిస్టం బిల్డ్ అవుతుంది అని నారా లోకేష్ గారు పేర్కొన్నారు.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు
Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

వైసిపి వాళ్ళు మమ్మల్ని ఆపలేరు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నేను వైసిపి వాళ్ళకి సవాల్ విసురుతున్న ఒక్క కప్ కాఫీ కన్నా వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకోని ఉంటే నిరూపించండి. బొత్స సత్యనారాయణ గారు వాకౌట్ చేయటం కరెక్ట్ కాదు. ఇది పారిపోవటం అంటారు. అని నారా లోకేష్ గారు వ్యాఖ్యానించారు.

Leave a Comment