Varudu Kalyani : హైదరాబాద్ ఎకరా 150 కోట్లు వైజాగ్ లో 150 పైసలే… వరుదు కళ్యాణి షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్ ఎకరా 150 కోట్లు వైజాగ్ లో 150 పైసలే : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు మొదలు అయ్యాయి. శాసనమండలిలో కూటమి ప్రభుత్వం పైన ప్రశ్నించిన వైసిపి ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. హైదరాబాద్ లో ఎకరాకు 150 కోట్లు ఇస్తున్నారు. మన వైజాగ్ లో 150 పైసలకే ఇస్తున్నారు. ఎందుకు అంత తక్కువ ధరకు ఇస్తున్నారని వరుదు కళ్యాణి గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

హైదరాబాద్ ఎకరా 150 కోట్లు వైజాగ్ లో 150 పైసలే

వరుదు కల్యాణి మాట్లాడుతూ… హైదరాబాద్ లో ఎకరాకు 150 కోట్లు ఇస్తున్నారు. మన వైజాగ్ లో ఇక్కడ 150 పైసలకే ఇస్తున్నారు. ఇంకా పునాది స్థాయిలో ఉన్న అమరావతిలో కూడా ఇస్తున్న భూముల ధర కంటే విశాఖపట్నంలో ఇంకా తక్కువకు ఇస్తున్న పరిస్థితి. భూ కేటాయింపులు అనేది వెనుకబడిన మారుమూల ప్రాంతాల్లో తక్కువ ధరకు ఇస్తారు. ఎందుకంటే ప్రాంతం అభివృద్ధి చెందాలని అలాగే అక్కడ భూమికి చీప్ ధరలు ఉంటాయి. కాబట్టి ఇస్తుంటారు.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు
Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

వైజాగ్ లో ఉన్న ఇంత కాస్ట్లీ ల్యాండ్ ఎందుకు తక్కువ ధరకు ఇస్తున్నారు ప్రభుత్వమే చెప్పాలి. టీసీఎస్ కి 99 పైసలు ప్రభుత్వమే ఆఫర్ చేసిందా, లేదా వాళ్ళు డిమాండ్ చేశారా అనేది తెలీదు. ఐటి సంస్థలకు ఇస్తాం అని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీ లకు అతి తక్కువ ధరలకు ఇచ్చేస్తున్నారు. అని కళ్యాణి గారు వ్యాఖ్యానించారు.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

Leave a Comment