11 మంది అసెంబ్లీకి రండి : వైసిపి పార్టీ ఎమ్మెల్యేల పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన కూటమి ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. అసెంబ్లీకి 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడండి. మేము దేనికైనా సమాధానం చెప్తాం అని శ్రావణి గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
11 మంది అసెంబ్లీకి రండి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఫిబ్రవరి 11 బుధవారం మొదలు కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అయిన వైసిపి 11 మంది ఎమ్మెల్యేలు హాజరు అయ్యి ఏమైనా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించగలదా చూడాలి మరి. ఇదిలా ఉండగా వైసిపి వాళ్ళ పైన కూటమి ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
రండి మీరు అసెంబ్లీకి, మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడమని చెప్పండి. దేనికైనా సమాధానం చెప్పేకి మేము రెడీగా ఉన్నాం. ఇలా ఊరికే రోడ్లలోకి వచ్చి దొంగ డ్రామాలు వేసుకుంటూ దొంగ ప్రొటెస్ట్ లు చేసుకుంటూ, ఈరోజు ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. అని శ్రావణి శ్రీ గారు పేర్కొన్నారు.
