కేజీఎఫ్ ముఖ్య ఉద్దేశ్యం చంద్రబాబు అరెస్ట్ : ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు గారిని ఉద్దేశించి కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన స్థాపించిన కేజీఎఫ్ ముఖ్య ఉద్దేశ్యం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అని కుసుమ కుమార్ గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
కేజీఎఫ్ ముఖ్య ఉద్దేశ్యం చంద్రబాబు అరెస్ట్
అసలు ఈ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అంటే ఏంటంటే కమ్మ కులం వారి కోసం పెట్టిన సంస్థ. ఈ సంస్థ మెయిన్ ఉద్దేశం ఏంటంటే కమ్మ వారు ఎక్కడ ఉన్న కూడా కమ్మని కమ్మ సపోర్ట్ చేసుకోవాలి. కమ్మ వాళ్ళు అందరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలని పెట్టిన సంస్థ. దీని యొక్క ఫౌండర్ జెట్టి కుసుమ కుమార్. అదేవిధంగా కమ్మ కులాన్ని బలపరచుకోవాలని కూడా ముఖ్య ఉద్దేశ్యం. కేజీఎఫ్ అంటే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని అర్థం.
కుసుమ కుమార్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు మన వాళ్ళైతే మన కమ్మ వారికి ధైర్యం. కేజీఎఫ్ స్థాపించటానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన మన నాయకుడే కాదు ఒక జాతీయ నాయకుడు. అటువంటి ఒక జాతీయ నాయకుడ్ని ఒక చిన్న పెట్టి కేసుతో తీసుకెళ్లి జైలు లో వేస్తే వారి అబ్బాయి లోకేష్ గారు నెలరోజులు ఢిల్లీ చుట్టూ తిరిగితే కూడా ఎవడు స్పందించలేదు. చంద్రబాబు నాయుడు లాంటి జాతీయ నాయకుడికే కష్టం వస్తే అటువంటి పరిస్థితి సాధారణ కమ్మ వారికి వస్తే ఏమిటి అని కాబట్టి మనం ఐక్యం చేసుకోవాలి బలం అనేది అందరికి తెలియాలి అన్న ఉద్దేశం తోటే కేజీఎఫ్ స్థాపించి ప్రపంచ సదస్సు చేశాం.
