- విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో 54 కోట్లు క్యాష్ ప్రాఫిట్
- గవర్నమెంట్ అఫ్ ఇండియా ఒప్పుకొని 12,000 కోట్లు రూపాయలు
విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో 54 కోట్లు క్యాష్ ప్రాఫిట్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు అమరావతిలో మంత్రులు మరియు కార్యదర్శులతో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పలు ఆసక్తికర అంశాల గురించి మాట్లాడటం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే కేంద్ర సాయం చేయటం అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ 54 కోట్ల రూపాయలు లాభాల్లోకి వచ్చింది అని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో 54 కోట్లు క్యాష్ ప్రాఫిట్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల గర్వంగానూ మరియు సంతోషంగానూ ఉందన్నారు. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం గవర్నమెంట్ అఫ్ ఇండియా ఒప్పుకొని 12,000 కోట్లు రూపాయలు ఇచ్చారని ఆయన తెలిపారు. ఫస్ట్ టైం మొన్నే 54 కోట్ల రూపాయలు క్యాష్ ప్రాఫిట్ కూడా వచ్చింది. అని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చిందంటే మంచి విషయం అనే చెప్పుకోవాలి. ఒకప్పుడు ఒకానొక సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖ ఉక్కు మన హక్కు అని కేంద్రంతో మాట్లాడి ఒప్పించి 12,000 కోట్ల రూపాయలను స్టీల్ ప్లాంట్ కి ఇప్పించగలిగింది. ఇది నిజంగా కూటమి ప్రభుత్వాన్ని ఒప్పుకొని తీరాల్సిందే అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
