Chandrababu : తాడేపల్లి ప్యాలెస్ వద్ద హెలిప్యాడ్ కోసం.. ప్రైవేటు భూమిని అక్రమంగా 22 ఏ కింద పెట్టేశారు

తాడేపల్లి ప్యాలెస్ వద్ద హెలిప్యాడ్ కోసం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు అమరావతిలో మంత్రులు మరియు కార్యదర్శులతో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పలు ఆసక్తికర అంశాల గురించి మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మాజీ సీఎం జగన్ ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్ వద్ద హెలిప్యాడ్ కావాలని ఒక ప్రైవేట్ ల్యాండ్ ని అక్రమంగా లాక్కున్నారని సీఎం చంద్రబాబు గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

తాడేపల్లి ప్యాలెస్ వద్ద హెలిప్యాడ్ కోసం

రెవిన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్ ఆయన ఉండే ఇంటి పక్కనే హెలిప్యాడ్ కావాలి. హెలిప్యాడ్ కావాలంటే తప్పులేదు. లీజ్ కి తీసుకోవచ్చు. ఆ ల్యాండ్ కోసం ఒక అతన్ని ఇవ్వమంటే, అతను ఓన్ ల్యాండ్ అని అతను ఇవ్వకపోతే బలవంతంగా టేక్ ఓవర్ చేసి 22 A కింద పెట్టేశారు.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు
Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

ఒక ప్రైవేట్ వ్యక్తి ల్యాండ్. సాక్షాత్తు చట్టాలు చేసే ముఖ్యమంత్రి, చట్టాల్ని అమలు చేయాల్సిన వ్యక్తి ఒక ప్రైవేట్ ల్యాండ్ 22 A కింద ఇల్లీగల్ గా పెట్టాడంటే పరాకాష్ట. నేను అడిగాను అతన్ని, అతను అన్నాడు ముందు నా ప్రాణం ఉంటె ఎప్పటికైనా పోరాడతాను పొతే పోయింది ఆస్తి అనుకున్నాను నేను ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మీరందరు సెట్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గరికి వచ్చి పిటిషన్ ఇస్తున్నాను అని అతను నాకు చెప్పాడు. అని చంద్రబాబు గారు పేర్కొన్నారు.

Leave a Comment