జగన్ పర్యటనపై చంద్రబాబు సీరియస్ : మాజీ సీఎం వైసిపి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ప్రస్తుత సీఎం నారా చంద్రబాబునాయుడు గారు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ అంబటి రాంబాబు ఫ్యామిలీని పరామర్శించడానికి గుంటూరు పర్యటన వెళ్లారు. ఆ పర్యటనలో భాగంగా జగన్ గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళడానికి 6 గంటలా అని సీఎం చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
జగన్ పర్యటనపై చంద్రబాబు సీరియస్
గుంటూరు నుంచి విజయవాడకు పోవాలంటే 6 గంటలు. రోడ్డులో ఇంకెవ్వరు పోవడానికి వీల్లేదు. అంతకుముందు చూస్తే రోడ్ మీద పోతూ పోతూ వాళ్ళ కార్ కింద సింగయ్య చనిపోతే కూడా పట్టించుకోలేదు. రౌడీయిజం గుండాయిజం ఎవరి దగ్గర చేస్తారు అని అడుగుతున్నా, అదే మాదిరిగా రోడ్ అంత బ్లాక్ చేయటం గొడవలు చేయటం ఎదో బలం ఉందని నిరూపించుకోవటం.
బల ప్రదర్శన నిరూపించుకోవాల్సింది ఎన్నికల సమయంలో మిగిలిన సమయంలో ప్రజలకు సేవ చేయటంలో, ఏదైనా గాని తప్పులు చేస్తే చెప్పడంలో మీరు ముందుకు రండి కానీ తప్పుడు విధానాల ద్వారా వస్తే మాత్రం ఈ ప్రభుత్వం క్లియర్ గా ఉండాలా లేదా అని అడుగుతున్నా అని నారా చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు.
