Devineni Uma Maheswara Rao : సాక్షి రిపోర్ట్ ని సిట్ రిపోర్ట్ అంటున్న జగన్

సాక్షి రిపోర్ట్ ని సిట్ రిపోర్ట్ అంటున్న జగన్ : మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి గురించి జగన్ ఇంకా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, అంతే కాకుండా సాక్షి రిపోర్ట్ ని చదువుతూ సిట్ రిపోర్ట్ అంటున్న జగన్ అని ఉమామహేశ్వర రావు గారు ట్విట్టర్ X లో పోస్ట్ చేశారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

సాక్షి రిపోర్ట్ ని సిట్ రిపోర్ట్ అంటున్న జగన్

కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్ చెప్పిన పచ్చి అబద్ధాలు చెప్పడం మానని జగన్. సాక్షి రిపోర్ట్ ని చదువుతూ సిట్ రిపోర్ట్ అంటున్నాడు. మా హయాంలో లడ్డూ కల్తీ జరగలేదు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడాం అని సీబీఐ చెప్పిందని చెప్తూ ఇంకా జగన్ ఫేక్ ప్రచారాలు చేస్తున్నాడు. అని ఉమామహేశ్వర రావు గారు పేర్కొన్నారు.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు
Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెర్షన్ విందాం. నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసముల కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ ఇటువంటివి ఏవి లేవని చెప్పి నిర్దారణ చేసి సర్టిఫికెట్ ఇస్తే ఆ సర్టిఫికెట్ లో సాక్షాత్తు సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్ లో NDDB NDRI సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ ఛార్జ్ షీట్ కూడా క్లోజ్ చేసింది. అని జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొన్నారు.

Leave a Comment