ఏపీ క్రైస్తవులు జగనన్న ప్రభుత్వం కోసం ప్రార్థన చేయాలి : మాజీ సీఎం వైసిపి అధినేత వైస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన మేనత్త విమలమ్మ గారు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే ఏపీలో ఉన్న క్రైస్తవులు అందరూ సేఫ్ గా ఉండటానికి మరియు స్వతంత్రంగా ఆరాధన చేసుకోవడానికి జగనన్న ప్రభుత్వం రావాలని అందరు ప్రార్థన చేయాలని విమలమ్మ గారు కోరారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
ఏపీ క్రైస్తవులు జగనన్న ప్రభుత్వం కోసం ప్రార్థన చేయాలి
జగన్ బాబు మేనత్తగా మీ అందరికి విజ్ఞప్తి. మన క్రైస్తవ సహోదరులు అందరూ కూడా సేఫ్ గా ఉండాలంటే, స్వతంత్రంగా ఆరాధన చేసుకోవాలంటే మన రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ లబ్ది పొందాలి అంటే జగనన్న ప్రభుత్వం రావాలని మనందరికి తెలుసు కాబట్టి మనం అందరం కూడా ప్రార్థనతో ఈ విజయాన్ని సాధించుకోవాలి అని ప్రభు నామమున మిమ్మల్ని అందరిని వేడుకొంటున్నాను. అని విమలమ్మ గారు పేర్కొన్నారు.
