చంద్రబాబుని తిట్టినందుకు అంబటి అరెస్ట్ : మాజీ సీఎం వైసిపి అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు ఇంటికి పరామర్శకు వెళ్లడం జరిగింది. అక్కడ అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలిసి జగన్ పరామర్శించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో మాట్లాడారు. అంబటిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు అరెస్ట్ చేశారు. మరి అంబటి ఇంటి మీద దాడి చేసిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆమె భర్తని ఎందుకు అరెస్ట్ చేయలేదని జగన్ గారు పేర్కొన్నారు.
చంద్రబాబుని తిట్టినందుకు అంబటి అరెస్ట్
చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తారంట, మరి చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసినప్పుడు మరి అంబటి రాంబాబు ఇంటికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను హత్య చేయాలనీ చూసి 5 కార్లు ద్వంసం చేసి ఆఫీస్ నిప్పంటించి చేసిన గుంటూరు ఎమ్మెల్యే గారు మాధవి ఆమె భర్త సమక్షంలో జరిగితే వాళ్ళ మీద ఏం ఆక్షన్ తీసుకున్నారు.
గళ్ళా మాధవి ఆమె భర్తని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమక్షంలో చింతిస్తూ క్షమాపణ చెప్పి వివరణ ఇచ్చారు. అంబటి రాంబాబు ఇంటి మీద ఎటాక్ చేసి ఈ మాదిరిగా చేసిన దానికి వీళ్ళు మనుషులేనా అని అడుగుతున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొన్నారు.
