Poluboina Anil Kumar : టిడిపి పార్టీ ఎక్స్పైరీ డేట్ 2029.. వైసిపి పార్టీ ఆ టిడిపి ఆ పార్టీ తేల్చుకుందామా

టిడిపి పార్టీ ఎక్స్పైరీ డేట్ 2029 : మాజీ మంత్రి వైసిపి నాయకుడు పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ టిడిపి పార్టీని ఉద్దేశించి పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే టిడిపి పార్టీ ఎక్స్పైరీ డేట్ 2029 అని, వైసిపి పార్టీ ఆ టిడిపి ఆ పార్టీ తేల్చుకుందామా అని అనిల్ కుమార్ పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

టిడిపి పార్టీ ఎక్స్పైరీ డేట్ 2029

అనిల్ కుమార్ మాట్లాడుతూ… పోలీసులను పక్కన పెట్టి, కేసులు అరెస్ట్ లు పక్కన పెట్టి, వైసిపి పార్టీ ఆ టిడిపి పార్టీ ఆ తేల్చుకుందామంటే దానికి సిద్ధం అంటే చెప్పండి సిద్ధం. పోలీస్ వ్యవస్థని పక్కన పెట్టి రండి మీ ఇళ్ల మీదక మా ఇళ్ల మీదక రండి. కానీ మంచి రాజకీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలలో మేము ఎప్పుడు కూడా ఇట్లాంటి రాజకీయాలు చేయలేదు.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు
Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

దీని వల్ల మేము భయపడి పోతాము తోకలు ముడుచుకుని పోతాము వెనక్కి వెళ్ళిపోతాం అంటే అది జరగదు. మీరు చేసే కొద్దీ వైసిపి కార్యకర్తలు ఇంకా రోడ్ మీదకి వస్తారు. మీరు రెచ్చగొట్టే కొద్దీ మా కార్యకర్తలు ఇంకా మీ ముందుకు గట్టిగ వస్తారు. వైసిపి పార్టీ ప్రతి ఒక్కరికి అండగానే ఉంది. జోగి రమేష్ మరియు అంబటి రాంబాబు కి జగనన్న అండ పార్టీ సపోర్ట్ ఉంటుంది.

ప్రజలు కూడా చూస్తున్నారు. ఏం జరుగుతుందా అని తప్పకుండ బుద్ది చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది. మహా అంటే ఇంకో 3 సంవత్సరాలు. మీకు ఇష్టం వచ్చినేది ఈ మూడేళ్లలో చేసుకోండి. కేసులు పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. టీడీపీ పార్టీ ఎక్స్పైరీ డేట్ 2029 అని అనిల్ కుమార్ గారు వ్యాఖ్యానించారు.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

Leave a Comment