Nagendra Babu : 151 లో మధ్యన 5 తీసేసి 11 ఇచ్చారు.. వాడి అమ్మ మొగుడు కట్టాడా తిరుపతి గుడి

  • 151 లో మధ్యన 5 తీసేసి 11 ఇచ్చారు
  • వాడి అమ్మ మొగుడు కట్టాడా తిరుపతి గుడి
  • ఎక్కడ కొండ కనపడిన గుండు కొట్టేయడమేగా నీ అలవాటు
  • టీటీడీ భక్తులకు భగవంతుణ్ణి దూరం చేసిన వైసిపి
  • అంత చులకన మీకు హిందువులు అంటే జగన్

151 లో మధ్యన 5 తీసేసి 11 ఇచ్చారు : ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు గారు జగన్ ని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగేంద్ర బాబు గారు ట్విట్టర్ X లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో జగన్ పైన తీవ్ర విమర్శలు చేశారు. అందులో ముఖ్యంగా జనాలు 151 లో మధ్యన 5 తీసేసి 11 ఇచ్చారు అని నాగబాబు గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

151 లో మధ్యన 5 తీసేసి 11 ఇచ్చారు

నాగబాబు గారు మాట్లాడుతూ… ఇక పొతే తిరుమల మీద నువ్వు చేసిన దోపిడి అంత ఇంత కాదు. ఎక్కడ కొండ కనపడిన గుండు కొట్టేయడమేగా నీ అలవాటు. డిక్లరేషన్ ఇవ్వటమే కాక మీ మంత్రి వచ్చి వాడి అమ్మ మొగుడు కట్టాడా తిరుపతి గుడి అంటావా అలా తల పొగరు మాటలు మాట్లాడితేనే జనాలు 151 లో మధ్యన 5 తీసేసి 11 ఇచ్చారు. అయినా నువ్వు ఏమైనా మారవా లేదు. డిక్లరేషన్ అడిగారని తిరుమల పర్యటన క్యాన్సల్ చేసుకున్న చరిత్ర నీది జగన్.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు
Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

టీటీడీ భక్తులకు భగవంతుణ్ణి దూరం చేసిన వైసిపి. పుట గడవని పేదవాళ్ల దగ్గరి నుంచి వజ్రాల కిరీటాలు చేయించే కోటీశ్వరుల వరకు అందరి కోరిక ఒక్కటే ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడాదికి ఒక్కసారి అయినా చేసుకోవాలని, ఒక సామాన్య భక్తుడు నెల నెల డబ్బులు కూడబెట్టుకొని స్వామిని చూడటానికి కొండా మీదకు వెళ్తాడు. అలాంటి కొండా మీద వసతి చార్జీలు మీరు ఒక్కసారిగా ఎలా పెంచుతారు.

నువ్వు ఏ మాఫియాను సంతోష పెట్టడానికి చేశావో అర్థం కానీ అమాయకులు అనుకుంటున్నావా ప్రజలు. దర్శనాలు సేవలు అయితే ఇంకా దారుణం. ఏదో కూరగాయలు బేరం ఆడినట్టు 5000 ని 10000 చెయ్యి అని మీ వైవీ సుబ్బారెడ్డి ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడాడో రాష్ట్రం మొత్తం చూసింది. అంత చులకన మీకు హిందువులు అంటే జగన్.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

Leave a Comment