చంద్రబాబు లోకేష్ నన్ను రక్షించండి : గంగ జానకి అనే మహిళకి తిరుమలలో ఒక షాప్ ఉంది. ఆమెకు ఒక కూతురు ఉంది. ఆమె భర్తతో విడిపోయింది. భర్త వేరే పెళ్లి చేసుకొని తిరుచానూరు లో ఉంటాడు. భర్త పేరు క్రాంతి కుమార్ టీటీడీ రెవిన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు. గత కొద్దీ రోజులుగా తన మాజీ భర్త స్నేహితులతో కలిసి తనని ఇబ్బంది పెడుతున్నాడని తన షాప్ ని లాక్కోవాలని చూస్తున్నాడని ప్రాణహాని ముప్పు ఉందని ఆమె పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నన్ను కాపాడండి అంటూ ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా నెట్టింట వైరల్ అవుతుంది. పూర్తి కథనం వివరాళ్ళకి వెళ్లి తెలుసుకుందాం.
చంద్రబాబు లోకేష్ నన్ను రక్షించండి
తిరుమలలో ఒక షాప్ పెట్టుకొని గంగ జానకి ఆమె బిడ్డ జీవనాధారంగా బ్రతుకుతున్నారు. టీటీడీ రెవిన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసే క్రాంతి కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. కొన్ని కారణాల చేత ఆమె క్రాంతి కుమార్ విడిపోయారు. క్రాంతి కుమార్ వేరే వివాహం చేసుకొని తిరుచానూరు లో ఉంటున్నారు.
ఇప్పుడు ఆమెకు జీవనాధారంగా ఉన్న షాప్ ని ఆమె నుంచి దౌర్జన్యంగా లాక్కోవాలని కలకండ నారాయణ, భాను రాయల్ మరియు ఆమె మాజీ భర్త క్రాంతి కుమార్ రాయల్ ముగ్గురు కలిసి ఆమెని చంపాలని చూస్తున్నారు. గంగ జానకి రథసప్తమి రోజు రాత్రి సమయంలో అలిపిరి గేట్ వద్ద ఒక స్విఫ్ట్ వైట్ కలర్ కార్ డోర్ ఆమెని గట్టిగా తట్టడంతో రన్నింగ్ లో స్కూటీ నుంచి పడిపోయి ఆమె భుజానికి గాయం అయ్యింది.
అదే స్విఫ్ట్ కార్ రెండు మూడు రోజులుగా ఆమె షాప్ చుట్టూ పక్కల తిరుగుతూ కొంతమంది అనుమానాస్పదంగా ఫొటోలు వీడియోలు తీస్తూ ఆమెను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. వీళ్లకు సహకరిస్తూ నారాయణ అనే వ్యక్తి ఆహారం టీ పానీయాలు అందిస్తున్నారు. మానసికంగా ఆమెను హింసిస్తున్నారు. ఆమె షాప్ ని దౌర్జన్యంగా లాక్కోవాలని ఆమె మాజీ భర్త అర్ద రాత్రి ఒంటిగంట సమయంలో వచ్చి సామాన్లు అన్ని బయట పడేసి అక్రమంగా ఆమె షాప్ ని దౌర్జన్యంగా తీసుకోవడానికి ప్రయత్నించారు.
గంగ జానకి మాట్లాడుతూ… నన్ను నా బిడ్డని చంపాలని చూస్తున్నారు. నా షాప్ ప్రొసీడింగ్స్ ని ఆపేయాలని చూస్తున్నారు. నా షాప్ ప్రొసీడింగ్స్ నాకు ఇప్పించాల్సింది గా కోరుతున్నాను. నాకు నా బిడ్డకు రక్షణ కల్పించండి. నాకు తల్లిదండ్రులు ఎవ్వరు లేరు. నా బిడ్డని చూసుకొనే బ్రతుకుతున్నాను. నాకు నా బిడ్డకి రక్షణ కల్పించండి న్యాయం చేయండి.
