Gummadi Sandhya Rani : జగన్ దమ్ముంటే 11 మందిని తీసుకోని రా.. సంధ్యారాణి సవాల్

  • 11 మందిని తీసుకోని 11 గంటలకు అసెంబ్లీకి రా
  • దొంగ ప్రెస్ మీట్లు ఒక కాగితం పట్టుకొని ఆ కాగితం చదివేయటం
  • తల్లి చెల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు
  • తల్లిని చెల్లిని గెంటేసినవాడు ఏమైనా చేయగలడు అని ప్రసాదం కల్తీ అయ్యాక అర్థం అయ్యింది

జగన్ దమ్ముంటే 11 మందిని తీసుకోని రా : ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు మాజీ సీఎం జగనమొహం రెడ్డి గారికి సవాల్ విసిరారు. జగన్ నీకు దమ్ముంటే 11 మంది ఎమ్మెల్యేలను తీసుకోని 11 వ తేదీన రమ్మని సంధ్యారాణి గారు పేర్కొన్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

జగన్ దమ్ముంటే 11 మందిని తీసుకోని రా

జగన్ కి ధైర్యం, నిజాయితీ దమ్ము ఉంటే 11 మంది ఎమ్మెల్యేలను తీసుకోని ఫిబ్రవరి 11 వ తేదీన అసెంబ్లీకి రమ్మను. మేము డిస్కస్ చేస్తాం. గవర్నర్ గారి స్పీచ్ 10 గంటలకి, 11 గంటలకే చర్చ చేద్దాం ఎందుకంటే మీకు 11 అచ్చు వచ్చిన నెంబర్ కాబట్టి అసెంబ్లీకి రండి మాట్లాడదాం.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు
Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

అది ఏమి చేయరు. మీ దొంగ ప్రెస్ మీట్లు ఒక కాగితం పట్టుకొని ఆ కాగితం చదివేయటం. ప్రజలు నమ్మరు. నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. కాబట్టే 151 నుంచే 11 సీట్లకు వచ్చారు. సిగ్గు బుద్ది మీకు లేదు. ప్రజాస్వామ్యాన్ని మీరు దెబ్బ తీస్తున్నారు. తల్లి చెల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు. జగన్ లాంటి కొడుకులు కూడా ఉంటారని ఆశ్చర్యంగా ఆడపిల్లలు అందరు అనుకునేవారు.

కానీ ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఆడపిల్లలకు అన్యాయం జరిగిపోయిందే ఆశ్చర్యంగా ఉందే అని అంటున్నాడు. మీ అమ్మ చెల్లిని మెడ పట్టుకొని గెంటేశావే నీ ఆస్తి కోసం పదవి కోసం, తల్లిని చెల్లిని గెంటేసినవాడు ఏమైనా చేయగలడు అని ప్రసాదం కల్తీ అయ్యాక అర్థం అయ్యిందని సంధ్యారాణి గారు వ్యాఖ్యానించారు.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

Leave a Comment