151 నుంచి 11 సీట్లకి కారణం బూతు నాయకులే : ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు వైసీపీ పార్టీ 2024 ఎలక్షన్స్ లో ఓడిపోవడానికి గల కారణం బూతు నాయకులే అని ఆయన పేర్కొన్నారు. ఇంతకీ ఆ బూతు నాయకులు ఎవరంటే జోగి రమేష్, అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని మరియు వల్లభనేని వంశీ అని రామానాయుడు గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
151 నుంచి 11 సీట్లకి కారణం బూతు నాయకులే
ఈరోజు జగన్మోహన్ రెడ్డికి 151 నుంచి 11 సీట్లకు వచ్చారంటే దానికి కారణం జోగి రమేష్ అంబటి రాంబాబు పేర్ని నాని కొడాలి నాని మరియు వల్లభనేని వంశీ. అటువంటి వాళ్ళ వల్లే కదా ఇటువంటి స్థితి వచ్చిందని వాళ్ళను మార్చుకోవడం లేకపోతె ఏం చేయాలి. ఇంకా ఏ రకంగా భవిష్యత్ ఉంటుందో అని ఆలోచన చేయడం మానేసి ఇంకా అధికారంలో ఉన్నప్పుడు అదే రకమైనటువంటి బూతు పురాణం. అధికారం పోయాక కూడా అదే రకమైనటువంటి బూతు పురాణం.
అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి నాయకులనే మీరు ప్రోత్సహించి ఎవరైతే దూషణ చేస్తారో ఎవరైతే బూతు పురాణం మాట్లాడతారో ఏ రకంగా ఆరోజు పదవులు ఇచ్చారో, ఈరోజు మీకు ప్రజలు బుద్ది చెప్పిన కూడా మళ్ళీ అదేవిధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రతిపక్ష హోదా లేకపోయిన మీరు వ్యవహరిస్తున్న పరిస్థితులు కూడా ప్రజలు అందరు గమనిస్తున్నారు అని నిమ్మల రామానాయుడు గారు వ్యాఖ్యానించారు.
