Gowru Charitha Reddy : అంబటిని ఉరి తీయాలి.. గౌరు చరితా ఘాటు వ్యాఖ్యలు

  • అంబటిని ఉరి తీయాలి
  • వైసిపి ఐదేళ్ల పాలనలో మహిళలను అసభ్య పదజాలంతో మాట్లాడేవారు
  • వైసీపీ పార్టీనే ఒక చీడపురుగు పార్టీ
  • టీటీడీ లడ్డులో కల్తీ నెయ్యి విషయాన్నీ డైవర్ట్ చేయటానికే ఇలా చేస్తున్నారు
  • 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన సిగ్గుశరం లేదు
  • రాబోయే కాలంలో వైసిపి పార్టీకి ఒక్క సీట్ కూడా రాష్ట్ర ప్రజలు ఇవ్వకూడదు

అంబటిని ఉరి తీయాలి : వైసిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి గారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబు లని వ్యక్తిని ఉరి తీయాలని చరితా గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

అంబటిని ఉరి తీయాలి

అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చుసిన అంబటి రాంబాబు దిష్టి బొమ్మలుగా చేసి చెప్పులతో కొట్టి ఉరేగిస్తున్నారు. రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా గారు ఆమె నియోజకవర్గం అయినా పాణ్యంలో ప్రజల మధ్య ఆమె మాట్లాడటం జరిగింది. ఏం మాట్లాడారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

ఎమ్మెల్యే గౌరు చరితా గారు మాట్లాడుతూ… అధినాయకుడు ఎలా ఉంటాడో ఆయన ఫాలోవర్స్ కూడా ఇట్లాగే ఉంటారని అర్థం అవుతుంది. వైసిపి వాళ్ళను వదిలి పెట్టకూడదు. వీళ్ళను ఒక కేసు గా తీసుకోని అరెస్ట్ చేయడమే కాదు, ఇది ఇంకొకరు భయపడే రీతిగా టీడీపి క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి కామ్ గా ఉన్నాం. మేము చూపిస్తే మీరు ఏం అయిపోతారు.

అంబటిని ఉరి తీయాలి. ఇంకొకరు ఇలా చేయడానికి భయపడే రీతిగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు
Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబటి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజమే తల దించుకునేలా ఉన్నాయి. వైసిపి పార్టీ మహిళలకు ఏ మాత్రం గౌరవం ఇస్తున్నారో దీన్ని బట్టి అర్థం అవుతా ఉంది. రాజకీయం అన్నాక విమర్శలు ఉండచ్చు. ఒకరినొకరు విమర్శించుకోవచ్చు. అంతేగాని వ్యక్తిగతంగా దూషణలకు దిగడం సరికాదు.

తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ గల పార్టీ. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా క్రమశిక్షణ విలువలు నేర్పించడం జరిగింది. ఈ రాష్ట్రానికి వైసీపీ పార్టీ రావడమే ఒక చీడపురుగుగా ఎంటర్ కావడం జరిగింది. గతంలో నారా భువనేశ్వరి గారి గురించి కూడా ఇలానే మాట్లాడారు.

వైసిపి ఐదేళ్ల పాలనలో మహిళలను చెప్పలేని పదజాలంతో దూషించడం అలవాటుగా అయిపొయింది. మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే మాట్లాడటం ఎంతవరకు సమంజసం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉరి తీయండి చెప్పుతో కొట్టండి రాళ్లతో కొట్టండి ఇవ్వన్నీ మాటలు మాట్లాడటం జరిగింది.

టీటీడీ లడ్డులో కల్తీ నెయ్యి వాడారు

ఎంత నీచానికి పాల్పడుతున్నారంటే ఇవాళ కల్తీ నెయ్యి. వైసిపి ఐదేళ్ల పాలనలో టీటీడీ లడ్డులో కల్తీ నెయ్యి వాడారు. మేము కానీ మా కూటమి పార్టీ నిర్ణయించింది కాదు సుప్రీమ్ కోర్ట్ ఆధ్వర్యంలో ఏదైతే జరిగిందో సిట్ కల్తీ నెయ్యి అందులో నెయ్యే లేదని నిర్దారణ చేసింది. లడ్డు కల్తీ విషయం వెలుగులోకి వచ్చింది అని చెప్పి పార్టీకి పుట్టగతులు ఉండవని అలాగే పార్టీ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుందని అందుకే డైవర్సిన్ పాలిటిక్స్ కోసం ప్రజల్ని ఎలాగైనా మళ్లించాలని చెప్పి ఉద్దేశంతోనే దీనికి తెర తీయటం జరిగింది. ఇది ఇంతటితో ఆగదు. దీనిపై గట్టిగ చర్యలు తీసుకునే వరకు మేము ఆందోళన ఇంకా ఉదృతం చేస్తాం.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

వైసిపి పార్టీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన సిగ్గుశరం లేదు. సిగ్గుశరం లేకుండా ప్రవర్తిస్తా ఉన్నారు. రాబోయే కాలంలో వైసిపి పార్టీకి ఒక్క సీట్ కూడా రాష్ట్ర ప్రజలు ఇవ్వకూడదు అని నేను కోరుతున్నానని గౌరు చరితా గారు పేర్కొన్నారు.

Leave a Comment