YS Sharmila : కూటమిలో చంద్రబాబు కీలకం రాష్ట్రానికి గుండు సున్నా

  • 50 లక్షల కోట్ల బడ్జెట్ లో ఈ సారి సైతం రాష్ట్రానికి మొండి చెయ్యే
  • అమరావతికి మళ్ళీ అప్పులే తప్ప ఆపన్నహస్తం అందించలేదు
  • ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ మరియు మెట్రో రైలు ప్రస్తావన లేదు
  • పోలవరం ప్రాజెక్ట్ కి మళ్ళీ తీరని అన్యాయం

కూటమిలో చంద్రబాబు కీలకం రాష్ట్రానికి గుండు సున్నా : ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి పైన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే NDA కూటమిలో చంద్రబాబు కీలకంగా ఉన్నా ఆంధ్ర రాష్ట్రానికి ప్రయోజనం గుండు సున్నా అని షర్మిల గారు వ్యాఖ్యానించారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

కూటమిలో చంద్రబాబు కీలకం రాష్ట్రానికి గుండు సున్నా

తాజాగా దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2026-2027 బడ్జెట్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ లో దేనిదేనికి అనేది నిర్మలా గారు పార్లమెంట్ లో స్పష్టంగా తెలియచేశారు. ఆ బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రయోజనం లేదు అని షర్మిల గారు వ్యాఖ్యానించారు. అంతే కాకుండా షర్మిల గారు X లో ట్వీట్ వేశారు.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు
Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

షర్మిల గారు మాట్లాడుతూ… NDA లో చంద్రబాబు గారు కీలకంగా ఉన్నా, రాష్ట్రానికి ప్రయోజనం గుండు సున్నా. బాబు గారి అండతో ప్రధానిగా నిలబడ్డ మోడీ గారు ప్రతి సారి బడ్జెట్ లో మనకు చేస్తున్నది ఘరానా మోసమే. 50 లక్షల కోట్ల బడ్జెట్ లో ఈ సారి సైతం రాష్ట్రానికి మొండి చెయ్యే. ఆంధ్రుల ఆత్మగౌరవానికి, రాష్ట్ర ప్రయోజనాలకు బడ్జెట్ లో అనాపైస మందం విలువ లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ను దగా చేసిన బడ్జెట్. 5 కోట్ల మంది ప్రజలను ఊరించి ఉసూరు మనిపించిన బడ్జెట్.

అమరావతికి మళ్ళీ అప్పులే తప్ప ఆపన్నహస్తం అందించలేదు. వెనకబడిన ఉత్తరాంధ్రకు ఊతమివ్వలేదు. రాయలసీమకు మోసమే తప్ప చిల్లిగవ్వ దక్కలేదు. జీవనాడి పోలవరానికి జీవం పోయలేదు. విభజన హామీల్లో ఒక్క దానికి పట్టింపులేదు. ప్రత్యేక హోదాపై ఊసేలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కనికరం కలగలేదు. కడప స్టీల్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మెట్రో రైలు ప్రస్తావన లేదు. ఇండస్ట్రియల్ కారిడార్ల సంగతి తేల్చలేదు. పట్టుమని 10 పైసల మందం కూడా బడ్జెట్ తో ప్రయోజనం లేదు.

ఢిల్లీ తలదన్నే రాజధాని కడతామని అప్పులు అంటగట్టడం దుర్మార్గం. లక్ష కోట్లు ఖర్చయ్యే అమరావతికి ADB, జపాన్ బ్యాంకుల నుంచి 15 వందల కోట్లు అప్పులిప్పిస్తే రాజధాని పూర్తవుతుందా, గతేడాది అప్పుల కింద ఇస్తామని చెప్పిన 15 వేల కోట్లలో ఒక్క రూపాయి అయినా ఇచ్చారా గ్యారెంటీ కింద అప్పులు అంటే ఎవరికి గ్యారెంటీ విభజన చట్టం ప్రకారం అమరావతి నిర్మాణం కేంద్రానిదే బాధ్యత అని తెలియదా, అప్పులు ఇస్తామని చెప్తే ఆంధ్రుల ఆత్మగౌరవం ఎప్పడు పూర్తవుతుంది. ఇదేనా బీజేపీ కి రాష్ట్రంపై ఉన్న చిత్తశుద్ధి.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

పోలవరం ప్రాజెక్ట్ కి మళ్ళీ తీరని అన్యాయం చేశారు. ఎత్తు 45.72 మీటర్లకు పెంచాలని కోరినా బడ్జెట్ లో మళ్ళీ పెడచెవిన పెట్టారు. కేవలం 3 వేల కోట్లు మాత్రమే ఇచ్చి ఇక ప్రాజెక్ట్ ఎత్తు 41.15 మీటర్లకే అని చెప్పకనే చెప్పారు. గత బడ్జెట్ లో ప్రాజెక్ట్ పూర్తికి ఇస్తామని చెప్పిన 12 వేల కోట్లలో ఇచ్చింది 5 వేల కోట్లే. ఈ ఏడాది 3 వేల కోట్లు మాత్రమే ఇస్తే 2027 నాటికి ప్రాజెక్టు ఎలా పూర్తి అవుతుంది. మిగిలిన నిధుల సంగతి ఏంటి, 20 వేల కోట్ల R&R ప్యాకేజీ మిగులు కోసం పోలవరానికి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుంటే కూటమి ప్రభుత్వం మౌనంగా ఉండటం సిగ్గుచేటు. కూటమిలో పెద్దన్నగా చెప్పుకొనే చంద్రబాబు గారు నోరు మెదపక పోవడం ఆయన పాలన తీరుకి నిదర్శనం.

Leave a Comment