Nallapareddy Prasanna Kumar Reddy : చంద్రబాబు భయంకరమైన చావు చస్తాడు.. నల్లపరెడ్డి షాకింగ్ కామెంట్స్

  • చంద్రబాబు అంతకుఅంత అనుభవిస్తాడు భయంకరమైన చావు చస్తాడు
  • పదవి కోసం దేనికైనా తెగించే వ్యక్తి చంద్రబాబు
  • మామ ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు
  • వెంకటేశ్వర స్వామి కల్తీ నెయ్యి అంటూ దుష్ప్రచారం
  • పనికిమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు
  • చంద్రబాబుని వెంకటేశ్వర స్వామి క్షమించడు
  • చంద్రబాబు నాయుడు అంటే స్వామికి కూడా భయమే

చంద్రబాబు భయంకరమైన చావు చస్తాడు : వైసిపి మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి పైన కీలక వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే చంద్రబాబు భయంకరమైన చావు చస్తాడు అని నల్లపరెడ్డి పేర్కొన్నారు. ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నల్లపరెడ్డి చంద్రబాబు గారిని ఎందుకు అలా అన్నారనేది పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

చంద్రబాబు భయంకరమైన చావు చస్తాడు

ఈరోజు వెంకటేశ్వర స్వామినే రాజకీయంగా బయటికి లాగిన చంద్రబాబు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ఒక పవిత్రమైన దేవస్థానం. మతాలు కులాలకు అతీతంగా అందరు కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకుంటుంటారు. అటువంటి దేవుడ్ని కూడా ఈరోజు రాజకీయాల ఊబి లోకి లాగి, ఇంత పనికిమాలిన రాజకీయం చంద్రబాబు చేశాడంటే ఆ వెంకటేశ్వర స్వామి క్షమించడు. చంద్రబాబు అంతకుఅంత అనుభవిస్తాడు. భయంకరమైన చావు చస్తాడు. అని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు
Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు పదవి కోసం దేనికైనా తెగిస్తాడు. ఉదాహరణకి పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి, ఆ పదవి నుంచి తొలగించి మానసికంగా ఎన్టీఆర్ గారిని హత్య చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గారినే పెట్టుకొని కల్తీ నెయ్యి అంటూ దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి కరుణాకర్ రెడ్డి గారికి వీళ్ళందరికీ అంటకట్టి ప్రచారం చేశాడు.

కల్తీ లేదని సిబిఐ ఈరోజు నిర్దారణ చేసింది. ఎంత పనికిమాలిన రాజకీయాలు చేస్తాడంటే చంద్రబాబు నాయుడు, నిజంగా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు నిజంగా దేవుడు కూడా మంచోళ్ళను త్వరగా తీసుకెళ్ళిపోతాడు. చెడ్డోళ్లను మాత్రం లేట్ గా తీసుకెళ్తాడు.

చంద్రబాబు నాయుడు అంటే స్వామికి కూడా భయమే

అలిపిరి దగ్గర నక్సలైట్స్ చంద్రబాబు నాయుడు గారి కార్ ని పేల్చారు. దానికి కూడా వెంకటేశ్వర స్వామి భయపడిపోయి ఈ చంద్రబాబు ఇక్కడ చనిపోతే ఆ అపవాదం నాకు వస్తది అని స్వామి చంద్రబాబుని పక్కకు నెట్టేశాడు. స్వామికి కూడా భయమే చంద్రబాబు నాయుడు.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగాడు కాబట్టి బాధతో అంట ఉన్న చంద్రబాబుని, ఆ వయసులో అలా అనకూడదు కానీ అనాల్సి వస్తుంది. ఇటువంటి రాజకీయాలు చేయకూడదు. దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగి ఆయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాల ప్రతిపక్షం అనేది ఉండకూడదు అనేది కరెక్ట్ కాదు. ఇకనైనా లోకేష్ గాని చంద్రబాబు గాని బుద్దులు మార్చుకొని ముందుకు పొతే మంచిది అని నల్లపరెడ్డి పేర్కొన్నారు.

Leave a Comment