Nara Lokesh : దేవుడి లడ్డు పైన వైసిపి డ్రామాలు.. నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్

  • దేవుడి లడ్డు పైన వైసిపి డ్రామాలు
  • తిరుమల లడ్డు కల్తీ జరిగింది
  • 2022 లో లడ్డు శాంపిల్ చేస్తే టెస్ట్ ఫెయిల్ అయ్యింది
  • కూటమి ప్రభుత్వం రాగానే శాంపిల్ టెస్ట్ చేస్తే అనిమల్ ఫ్యాట్ వెజిటేబుల్ ఆయిల్ ఉందని చెప్పారు
  • చార్జ్ షీట్ పేజ్ నెంబర్ 35 లో చాలా స్పష్టంగా సిబిఐ వాళ్ళు కూడా చెప్పారు
  • టీటీడీ లడ్డుని కూడా వదిలి పెట్టట్లేదు

దేవుడి లడ్డు పైన వైసిపి డ్రామాలు : ఆంధ్రప్రదేశ్ విద్య ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ గారు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన కార్యకర్తలపైన తీవ్ర విమర్శలు చేరిన లోకేష్. తిరుమల దేవుడి లడ్డు పైన వైసిపి డ్రామాలు చేస్తుందని నారా లోకేష్ గారు అన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

దేవుడి లడ్డు పైన వైసిపి డ్రామాలు.. నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ విద్య ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ కాకినాడ పర్యటన వెళ్లడం జరిగింది. కాకినాడ రూరల్ నియోజకవర్గ కార్యకర్తలు మరియు నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో నారా లోకేష్ గారు పలు అంశాల పైన మాట్లాడటం జరిగింది. అందులో ముఖ్యమైన అంశం ఏంటంటే తిరుమల లడ్డు కల్తీ ఇష్యూ గురించి ఆయన మాట్లాడారు. తిరుమల లడ్డు వ్యవహారం గురించి నారా లోకేష్ గారి మాటల్లోనే తెలుసుకుందాం.

నారా లోకేష్ మాట్లాడుతూ… ఈరోజు వైసిపి వాళ్ళందరూ దేవుడి ప్రసాదం గురించి మాట్లాడుతున్నారు. మనపైన ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడున్న కార్యకర్తలు అందరికీ ఒక విషయం చెప్పాలనుకున్నా నేను టిటిడి లడ్డు విషయంలో రాజకీయం చేయదలుచుకోలే కానీ మీ ముందల వాస్తవాలు పెట్టాలనుకుంటున్నా, 2019 వరకు నెయ్యి ఎప్పుడు తీసుకున్న లడ్డు కోసం అద్భుతమైన టెస్టింగ్ చేసేవాళ్ళం ఒక పద్ధతి ప్రకారం వెళ్ళేవాళ్ళం.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు
Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

కర్ణాటకలో ఉంది కేఎంఎఫ్ అని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కోపరేటివ్ డైరీ వాళ్ళ దగ్గర నుంచే మనం ఎక్కువ శాతం నెయ్యి కొనేవాళ్ళం. ఎంత రేట్ అయిన మంచి నెయ్యి ఇస్తారని వాళ్ళ దగ్గర కొనేవాళ్ళం. వైసిపి అధికారంలోకి వచ్చారు. 2019లో వచ్చి అన్ని మార్చేశారు. టెండర్ శరతులు మార్చేశారు. ఏకంగా చిన్న చిన్న కంపెనీలకు ఇచ్చేదానికి వాళ్ళు టెండర్లు చేశారు.

దాని తర్వాత 2022 లో శాంపుల్ తీసుకుని టెస్ట్ చేస్తే శాంపుల్ ఫెయిల్ అయింది. ఆ రిపోర్ట్ బయటికి రాకుండా తొక్కారు. మనందరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చర్చించాం. అదేంటి నాణ్యత తగ్గినట్టు ఉంది లడ్డులోని ఎంతమంది సోషల్ మీడియాలో పెట్టారు. వీడియోలు పెట్టారు. అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే గౌర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టిటీడికి ఇమ్మీడియట్ గా నెయ్యిలో ఏదో తేడా ఉన్నట్టుంది శాంపుల్స్ తీసుకోండి పంపించి టెస్ట్ చేపించండి అని చెప్పారు.

టిటీడి అధికారులు శాంపుల్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోఆపరేటివ్ ఎన్డిబి కాస్ కి శాంపుల్స్ పంపించారు. దాంట్లో చాలా స్పష్టంగా అనిమల్ ఫ్యాట్ ఉంది వెజిటేబుల్ ఆయిల్ ఉందని చెప్పడం జరిగింది.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

అది మొన్న వచ్చిన చార్జ్ షీట్ పేజ్ నెంబర్ 35 లో చాలా స్పష్టంగా సిబిఐ వాళ్ళు కూడా చెప్పారు. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టారు. టిటీడి లడ్డును కూడా వదిలిపెట్టట్లేదు. దేవుడి లడ్డు పైన డ్రామా మొదలు పెట్టారు. అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలి ఇంకా చాలా డ్రామాలు చేస్తారు అని నారా లోకేష్ గారు వ్యాఖ్యానించారు.

Leave a Comment