- గుంటూరు మెడికల్ కాలేజ్ లో 8 మందికి పద్మశ్రీ
- గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.100 కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు
- NRI లకు చంద్రబాబు గారి సూచన
- త్వరలోనే ఏపీ లో డ్రోన్ అంబులెన్సు
గుంటూరు మెడికల్ కాలేజ్ లో 8 మందికి పద్మశ్రీ : ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు గారు పద్మశ్రీ అవార్డుల పైన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే గుంటూరు మెడికల్ కాలేజ్ లో చదివిన 8 మందికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయని ఆయన తెలిపారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
గుంటూరు మెడికల్ కాలేజ్ లో 8 మందికి పద్మశ్రీ
సీఎం చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని గారు, వైద్యశాఖామంత్రి సత్యాయాదవ్ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే నజీర్ గారు, ఇతర నేతలు. ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.100 కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. నాడు 2018లో మాతా శిశు సంరక్షణ భవనానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు గారు. మళ్ళీ నేడు తానే పనులు పూర్తి చేసి ప్రారంభించడం విశేషం.
ఆ కార్యక్రమంలోనే భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గుంటూరు మెడికల్ కాలేజ్ లో చదివినవారికి 8 మందికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయని ఆయన తెలిపారు. అంతే కాకుండా చంద్రబాబు నాయుడు గారు వారి పేర్లను కూడా చెప్పారు. 1.హబీబుల్లా 2.సోమరాజు 3. బిఎన్ రావు 4.నాయుడమ్మ 5. ప్రసాద్ రావు 6. నరేంద్ర నాధ్ 7. గోపీచంద్ 8. గోపాల్ కృష్ణ గోఖలే.
ఆరోజు ఈ గుంటూరు మెడికల్ కాలేజ్ లేకపోతే ఈ 8 మందికి పద్మశ్రీ గుర్తింపు వచ్చేది కాదు అని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు.
NRI లకు బాబు గారి సూచన
భవిష్యత్ లో మీరు చదువుకున్న కాలేజీతో శాశ్వతంగా అసోసియేట్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి పేరెంట్స్ చూసుకుంటూ ఒక 4 రోజులు ఇక్కడ ఉండండి. మీ అమెరికా కంటే బెటర్ సిటీగా చేసే బాధ్యత నేను తీసుకుంటా. పొల్యూషన్ కంట్రోల్ చేస్తాం. మీరు అప్పట్లో అమెరికాకు ఎందుకు వెళ్లారు అంటే అక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇబ్బందులు ఉండవని వెళ్లారు. 800 సర్వీసులు ఇవాళ ఆన్లైన్ లో పెట్టాం. మీరు కూడా రాబోయే రోజుల్లో వచ్చి ఇక్కడ పేషెంట్స్ ని ట్రీట్ చేయటం. అది కూడా మీరు వర్చ్యువల్ గా ట్రీట్ చేయటం అని చంద్రబాబు గారు NRI లకు చెప్పడం జరిగింది.
త్వరలోనే 2026 లోనే డ్రోన్ అంబులెన్సు
ఇవాళ అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఫైవ్ స్టార్ కంటే మించి పోయాయి. ట్రీట్మెంట్ ఖర్చు కంటే రూమ్ కార్చి ఎక్కువ అవుతుంది. ఎవరైనా పేషెంట్ ఇంటి దగ్గర ఉంటె మనం ఎప్పటికప్పుడు హెల్త్ కండిషన్ మోనిటర్ చేస్తూ, త్వరలోనే 2026 లోనే డ్రోన్ అంబులెన్సు ని కూడా ఇంటిగ్రేట్ చేయాలి అనుకుంటున్నాం అని చంద్రబాబు గారు అన్నారు.
