Yarapathineni Srinivasa Rao : ప్రకృతి వినాశనానికి కారణం అయిన వ్యక్తి జగన్

  • ప్రకృతి వినాశనానికి కారణం అయిన వ్యక్తి జగన్
  • వైసిపి అధికారులు చేసిన పాపాలు ఘోరాలు ఆకృత్యాలు దుర్మార్గాలు ఇది ప్రపంచ చరిత్రలోనే ఎవ్వరు చేసి ఉండరు
  • డైరీలు ఎక్కడ కూడా నెయ్యి తయారు చేసిన చరిత్ర లేదు
  • నిసిగ్గుగా జగన్మోహన్ రెడ్డి టీం కల్తీ చేయలేదు అని చెప్తుంది
  • సుప్రీం కోర్ట్ లో వేసిన సిబిఐ సిట్ వారు కెమికల్స్ ఏ విధంగా కలిపారో అనేది తేల్చారు
  • 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు

ప్రకృతి వినాశనానికి కారణం అయిన వ్యక్తి జగన్ : కూటమి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు మాజీ సీఎం జగన్ పైన తీవ్ర విమర్శలు చేశారు. అదేంటంటే ప్రకృతి వినాశనానికి కారణం అయిన వ్యక్తి జగన్ అని ఆయన వ్యాఖ్యానించారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

ప్రకృతి వినాశనానికి కారణం అయిన వ్యక్తి జగన్

కూటమి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. నిన్న మొన్న అంటున్నాడు జగన్ 2.0 చూస్తారని, జగన్ 1.0 చూసారు. జగన్ 2.0 చూసే పరిస్థితి లేదు. ప్రకృతి జగన్ కి సహకరించదు. ప్రకృతి వినాశనానికి కారణం అయిన వ్యక్తి జగన్. జగన్మోహన్ రెడ్డి చేయనటువంటి పాపం లేదు అని యరపతినేని శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు.

నిసిగ్గుగా జగన్ ఆయన టీం తిరుమల లడ్డు కల్తీ జరగలేదని చెప్తున్నారు

2019-2024 మధ్య జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వైసిపి అధికారులు చేసిన పాపాలు ఘోరాలు ఆకృత్యాలు దుర్మార్గాలు ప్రపంచ చరిత్రలోనే ఎవ్వరు చేసి ఉండరు. వైసీపీ వాళ్ళు చేసిన అత్యంత పాపం ఏంటంటే కోట్లాది భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారు. తిరుమల లడ్డు కల్తీ జరిగింది.

పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు
Vangalapudi Anitha : పోలీసు శాఖకు 3,000 కొత్త వాహనాలు.. ప్రతిజిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌

ఈ డైరీలు ఎక్కడ కూడా నెయ్యి తయారు చేసిన చరిత్ర లేదు. ఈ డైరీలకు కల్తీ లేకుండా తయారు చేసిన చరిత్ర కానీ లేదు. మనం దింట్లో పరిగణించాల్సిన విషయం ఏంటంటే కల్తీ జరిగిందా లేదా అనేది ఆల్రెడీ సుప్రీం కోర్ట్ లో వేసిన సిబిఐ సిట్ వారు కెమికల్స్ ఏ విధంగా కలిపారో అనేది తేల్చారు.

అయితే నిసిగ్గుగా జగన్మోహన్ రెడ్డి ఆయన టీం మేము చేయలేదు చేయలేదు చెప్తున్నారు. వెల కట్టలేని తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్రపతి, ప్రధానమంత్రి సామాన్య భక్తుల దాకా డబ్బులు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా మమ్మల్ని రక్షించు స్వామి వేడుకుంటారు. ప్రపంచంలోనే పవిత్రమైన గుడి తిరుమల తిరుపతి దేవస్థానం అని యరపతినేని శ్రీనివాస రావు గారు తెలిపారు.

పాపాలు చేశారు కాబట్టే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు

డబ్బులకి కక్కుర్తి పడి స్వామివారి ప్రసాదాన్ని లడ్డుని కూడా కల్తీ చేశారు. మనోభావాలు దెబ్బ తిన్నాయని భక్తులు భావిస్తున్నారు. ఈ పాపాలాన్ని చేశారు కాబట్టే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి వ్యవస్థలు అన్ని కూడా అడ్డగోలుగా దోపిడి చేసిన వ్యక్తి. కోట్లను భక్తుల మనోభావాలు దెబ్బ తీసిన అంశం ఊరికే పోదు. ఆ వేంకటేశ్వర స్వామి మిమ్మల్ని వదిలిపెట్టడు అని శ్రీనివాస రావు గారు అన్నారు.

సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్
Vasamsetti Subhash : సిగ్గు లేకుండా బీసీ కార్డు వాడుతున్న జోగి రమేష్.. కులం కార్డు వాడి కులాలను రెచ్చగొడుతున్నాడు

Leave a Comment