ప్రజల్ని మళ్ళీ మోసం చేస్తున్న జగన్? : టీడీపీ మంత్రి కొలుసు పార్థసారథి మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల్ని మళ్ళీ మళ్ళీ మోసం చేయడానికి జగన్ సిద్ధం అయ్యాడని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆ వార్తలు కాస్తా మీడియాలో వైరల్ గా మారాయి. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
ప్రజల్ని మళ్ళీ మోసం చేస్తున్న జగన్?
మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాజాగా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో కొన్ని కీలక అంశాల గురించి జగన్ మాట్లాడటం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది.దాని తర్వాత మరో ఒకటిన్నర సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకం అవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుందని జగన్ గారు తెలిపారు.
దానికి సమాధానంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ… ఒక పాదయాత్రతో ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో అంచనా కూడా వేయలేని నష్టం జరిగిన విషయం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. కాబట్టి ఇంకొక పాదయాత్ర చేస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుందో కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉంది. మరి పాదయాత్ర ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్ర చేసుకోవచ్చు గానీ ప్రజల్ని ఒకసారి మోసం
చేయొచ్చు గానీ మళ్ళా మళ్ళా మోసం చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజలు అంత అమాయకులు కాదనేది మాత్రం చెప్పగలం.
జగన్ పాదయాత్రను ఈ సారి ప్రజలు ఎవ్వరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరని కొలుసు పార్థసారథి గారు తెలిపారు. ఆ వార్తలు కాస్తా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

జగన్ వైసీపీ పార్టీ నాయకులు శాంతి దూతల్లా మాట్లాడుతున్నారు
మంత్రి పార్థసారథి మాట్లాడుతూ… ఈరోజు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు శాంతి దూతల్లాగా మాట్లాడుతున్నారు. చంద్రయ్య అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఏ విధంగా నడి రోడ్లో దారుణంగా చంపారో ఒకసారి చూడమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను.
నేను ఇటువంటి దారుణ ఘటనలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి గ్రామానికి ఒక రాక్షసుని తయారు చేసి ప్రతి గ్రామంలో ఒక అరాచకవాదిని తయారు చేసి ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో ప్రజల్ని భయభ్రాంతులు చేశారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనవి చేస్తున్నాను.
గత ఐదు సంవత్సరాల్లో మీ పార్టీ శాసన సభ్యుల నాయకత్వంలో ఎనిమిది హత్యలు 79 దాడులు బడుగు బలహీన వర్గాలు మైనారిటీల మీద దాదాపు 51 దాడులు జరిగిన విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి రాలేదా లేకపోతే ఆనాటి ఇంటెలిజెన్స్ మరి వారి దృష్టికి తీసుకురాలేదా లేకపోతే ఈ సంఘటనలు అన్నిటిని కూడా హత్యలు, దాడులు, వీటన్నిటిని కూడా చాలా సిల్లీ ఇష్యూస్ గా తీసేసుకున్నారా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాను.
